వేములపల్లి, న్యూస్‌లైన్ : వేములపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదానికి రాంగ్‌రూటే ప్రధానకారణమని తేలింది. డీసీఎం డ్రైవర్ రోడ్డు మారాల్సి ఉన్నా నిర్లక్ష్యంగా అదే రూట్‌లో రావడంతో ప్రమాదం చోటు చేసుకుంది. మండలంలోని బుగ్గబాయిగూడెం సమీపంలో అద్దంకి-నార్కట్‌పల్లి రోడ్డు పనులు జరుగుతున్నాయి. దీంతో వన్‌వేలో వాహనాలు వెళుతున్నా యి. కాగా గ్రామం చివరన మిర్యాగూడకు వెళుతుండగా తిరిగి రెండు మార్గాలలో ప్రయాణించాల్సి ఉంది. కాగా డీసీఎం డ్రైవర్ వన్‌వే వచ్చిన తరువాత తిరిగి ఎడమకు మళ్లకుండా వన్‌వేలోనే ప్రయాణించడంతో ప్రమాదం జరిగింది. దీంతో పాటు అంబులెన్స్ మరో వాహనాన్ని ఓవర్‌టెక్ చేయబోతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సుమారు రెండు కిలోమీటర్ల వరకు మళ్లీ రోడ్డు మళ్లింపు లేకపోవడంతో డీసీఎం వాహనాలకు ఎదురుగా వచ్చి అంబులెన్స్‌ను ఢీ కొట్టింది.
మృతులంతా బంధువులే..
వేములపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన, గాయాలపాలైన వారు అందరూ బంధువులు. నిడమనూరు మం డలం గుంటిపల్లికి చెందిన నల్లగంతుల చిన్నసైదమ్మకు మూత్రపిం డాల వ్యాధి ఉడడంతో మిర్యాల గూడ నుంచి నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి అంబులెన్స్‌లో తీసుకె ళ్తుండగా ఎదురుగా వచ్చిన డీసీఎం ఢీ కొట్టింది. దీంతో సైదమ్మతో పాటు డీసీఎంలో వెళుతున్న ముగ్గురు బంధువులు అంబులెన్స్ డ్రైవర్ మృతిచెందారు. వారిలో గుంటిపల్లికి చెందిన నల్లగంతు చిన్న సైదమ్మ(50), నల్లగంతుల శ్రీను(35), మిర్యాలగూడ మండ లం యాదగిరిపల్లికి చెందిన పగిళ్ల ఉపేందర్(35), త్రిపురారానికి చెందిన అనుముల లక్ష్మీ(30), డ్రైవర్ నామ శేఖర్(35) ఉన్నారు.
ఒకే కుటుంబంలో ముగ్గురు..
ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. చిన్న సైదమ్మకు అనుముల లక్ష్మి స్వయాన కూతురు. పగిళ్ల ఉపేందర్ సైదమ్మకు అల్లుడు(సైదమ్మ మరో కూతురు భర్త). దీంతో ఒకే కుటుంబంలో ముగ్గురు మృతిచెందడంతో బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. దీంతో పాటు నల్లగంతుల పెద్ద సైదమ్మ మృతిరాలు చిన్న సైదమ్మకు అక్క(యారాలు), నల్లగంతుల శ్రీను, పెద్ద సైదమ్మకు కుమారుడు. చిక్సిత పొందుతున్న అనుముల నాగయ్య మృతురాలు లక్ష్మి భర్త. వీరంతా బంధువులే కావడంతో మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిలో రోదనలు మిన్నంటాయి.
రాంగ్‌రూటే ప్రాణాలు మింగింది
Published Thu, Aug 15 2013 3:26 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
Advertisement