ట్రాఫిక్ నిబంధనలకు విరుద్దంగా బైక్ నడిపిన ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
ట్రాఫిక్ నిబంధనలకు విరుద్దంగా బైక్ నడిపిన ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం ఉదయం నేరేడ్‌మెట్ వాయుపురిలో ఒకే బైక్‌పై నలుగురు యువకులు రాంగ్‌రూట్‌లో వెళ్తున్నారు. ఎదురుగా వేగంగా వచ్చిన కారును బైక్ ఢీకొనటంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.