మంత్రిగారూ, ఇది రాంగ్ రూట్! | central minister ramkripal yadav stopped by lady police | Sakshi
Sakshi News home page

మంత్రిగారూ, ఇది రాంగ్ రూట్!

Published Wed, May 20 2015 2:14 AM | Last Updated on Sun, Sep 3 2017 2:19 AM

మంత్రిగారూ, ఇది రాంగ్ రూట్!

మంత్రిగారూ, ఇది రాంగ్ రూట్!

కేంద్రమంత్రి రామ్‌కృపాల్‌ను అడ్డుకున్న మహిళా పోలీసు
పట్నా: కేంద్ర మంత్రి రామ్‌కృపాల్ యాదవ్‌కు దమ్మున్న మహిళా కానిస్టేబుల్ ఒకరు గట్టి షాకిచ్చారు. మంగళవారం పట్నాలోని జయప్రకాశ్ నారాయణ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాంగ్ రూట్‌లో ఎగ్జిట్ ద్వారం గుండా వెళ్తున్న ఆయనను అక్కడ పని చేసే సీఐఎస్‌ఎఫ్ మహిళా పోలీసు అడ్డుకున్నారు. ఆయనతో కాసేపు మాట్లాడాక వాకీటాకీలో తనపై అధికారిని సంప్రదించారు. తర్వాత ఆ మార్గం గుండా లోనికి వెళ్లకూడదని స్పష్టం చేశారు. దీంతో మంత్రి తన పొరపాటు అంగీకరించి అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఈ దృశ్యాలు టీవీ చానళ్లలో ప్రసారమయ్యాయి.
 
వీఐపీలు తమ హోదాను ఇలా దుర్వినియోగపరచడం సరైందేనా అని ఓ విలేకరి అడగ్గా, తనది పొరపాటేనని రామ్‌కృపాల్ అంగీకరించారు. మహిళా కానిస్టేబుల్ తనను ఆపి, ప్రవేశ మార్గం వద్దకు వెళ్లాలని చెప్పడంతో అలాగే వెళ్లానని చెప్పారు. తాను ఆమెతో వాదించలేదని, ఆమె తన విధిని చక్కగా నిర్వహించారని కొనియాడారు. ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి పట్నా వస్తున్న కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయకు ఆహ్వానం పలకడానికి రామ్‌కృపాల్ విమానాశ్రయానికి వెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement