వ్యభిచార గృహంపై దాడులు
Published Thu, Mar 9 2017 10:48 AM | Last Updated on Tue, Aug 21 2018 6:12 PM
హైదరాబాద్ : నగరంలోని వ్యభిచార గృహాలపై పోలీసులు దాడులు చేపట్టారు. చింతల్‌లోని ప్రసూననగర్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారంతో ఓ ఇంటిపై పోలీసులు బుధవారం అర‍్థరాత్రి దాడి చేశారు. ఈ దాడుల్లో నిర్వాహకుడితో పాటు ముగ్గురు యువతులను, ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement