
సాక్షి, హైదరాబాద్: జీడిమెట్ల యాసిడ్ దాడి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. కుటంబ కలహాల కారణంగానే యాసిడ్ దాడి జరిగినట్లు తేల్చారు. బాధితురాలి దగ్గరి బంధువే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. సీసీ కెమెరా ఆధారంగా నిందితుడిని గుర్తించారు. 12 గంటల్లో యాసిడ్ దాడి కేసును సైబరాబాద్ పోలీసులు చేధించారు. భాధితురాలిని మెరుగైన చికిత్స నిమిత్తం ఎల్‌వీ ప్రసాద్ ఐ ఆసుపత్రికి తరలించారు.
జీడిమెట్ల పరిధి చింతల్‌లో ఉన్న సిద్ధార్థ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తోన్న సూర్యకుమారిపై గురువారం సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వెళ్తుండగా యాసిడ్ దాడి జరిగింది. విషయం తెలిసిన వెంటనే బాధితురాలిని కూకట్‌పల్లిలోని రెమెడీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఎల్‌వీ ప్రసాద్ ఐ ఆసుపత్రికి తరలించారు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని త్వరితగతిన పట్టుకున్నారు. సూర్య కుమారి అక్క కుమారుడే ఈ దాడి చేసినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment