
వినూత (ఫైల్)
కర్ణాటక, బొమ్మనహళ్లి: వరకట్నం వేధింపులు భరించలేక పెళ్లయిన ఆరు నెలలకే నవ వధువు ఉరికి వేలాడింది. ఈ ఘటన బెంగళూరు నగరంలోని శుక్రవారం చోటు చేసుకుంది. ఆరు నెలల క్రితం వినూతతో కిరణ్‌కుమార్‌కు వివాహం జరిగింది. బ్యాడరహళ్లిలో దంపతులు నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో అదనపు కట్నం కోసం కిరణ్‌తో పాటు అతని తల్లి నిత్యం వేధించేవారు. ఈ క్రమంలో కిరణ్‌కు కౌన్సెలింగ్ కూడా ఇప్పించారు. అయినా కూడా ఆయనలో మార్పు రాలేదు. దీంతో జీవితంపై విరక్తి చెందిన వినూత శుక్రవారం ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే వినూత తల్లిదండ్రులు మాత్రం ఇది ఆత్మహత్య కాదని, తమ కుమార్తెను హత్య చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని కిరణ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.