మధుర మృతదేహం , నిందితుడు బాలచంద్ర
కర్ణాటక, బాగేపల్లి: మద్యం మత్తులో భార్యను కట్నం కోసం పీడించి, మటన్ కూరలో ఉప్పు ఎక్కువ వేసిందని హింసించి చంపాడో కిరాతక భర్త. ఆదివారం రాత్రి బాగేపల్లి తాలుకాలోని చేళూరు సమీపంలో ఉన్న హోసహుడ్య (ఉప్పకుంటెపల్లి) గ్రామంలో చోటు చేసుకుంది. భర్త చేతిలో హత్యకు గురైన బాధితురాలు బీ.ఎస్. మధుర (25)కాగా, నిందితుడు భర్త బాలచంద్ర. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రెండేళ్ల కిందట బాగేపల్లి తాలూకాలోని మరవపల్లి గ్రామానికి చెందిన బాలచంద్ర, మధురను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. ఇతడు కారు డ్రైవర్‌గా పనిచేసేవాడు. తరువాత మధుర తల్లిదండ్రులు అతనికి భారీగానే కట్నకానుకలు ముట్టజెప్పారు. కానీ మద్యానికి బానిస అయిన బాలచంద్ర రోజూ తాగి వచ్చి భార్యతో గొడవ పడి మరింత వరకట్నం తేవాలని వేధించేవాడు. (ప్రియురాలి కోసం వెళ్లి హతమయ్యాడు )
గొంతు పిసికి చంపి..
మధుర గతంలో కాన్పునకు పుట్టింటికి వెళ్ళి అక్కడే ఉంటోంది. వారికి 11 నెలల మగబిడ్డ ఉన్నాడు. బాలచంద్ర వారం రోజులకు ఒక సారి భార్య వద్దకు వచ్చి వెళుతుండేవాడు. ఆదివారం వచ్చిన బాలచంద్ర రాత్రి భోజనం తిని మాంసంలో ఉప్పు ఎక్కువైందని గలాటా చేయసాగాడు. మదుర చెల్లి భార్యభర్తల మధ్య గొడవలో ఎందుకని అక్కడి నుంచి వెళ్లిపోయింది. మత్తులో ఉన్న బాలచంద్ర భార్య గొంతుపిసికి చంపి చున్నీతో మెడకు కట్టి కిటికి ఉరి వేసుకున్నట్లు కథ అల్లాడు. అంతకుముందే మధుర అరుపులు విని బయటి నుంచి కుటుంబ సభ్యులతో పాటు చుట్టు పక్కల వారు వచ్చి ఘోరం వెలుగుచూసింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి బాలచంద్రను పట్టుకోవడానికి యత్నించారు. అతన్ని మాకు అప్పగించాలని ప్రజలు పోలీసుల జీపు పైన రాళ్ళతో దాడికి దిగారు. దాంతో వారిని తప్పించుకొని అతన్ని అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. చేళూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.(విల్లుపురంలో దారుణం)
Comments
Please login to add a commentAdd a comment