mutton curry
-
హోలీ పండుగకు భార్య మటన్ వండలేదని 100కు కాల్..
నల్గొండ (కనగల్) : భార్య మటన్ వండలేదని ఓ వ్యక్తి 100కు కాల్ చేసి కేసుల పాలయ్యాడు. ఎస్ఐ యు. నగేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి .. నల్లగొండ జిల్లా కనగల్ మండలం చర్ల గౌరారం గ్రామానికి చెందిన ఓర్సు నవీన్ తన భార్య మటన్ వండలేదని డయల్ 100కు ఆరు సార్లు కాల్ చేశాడు. మద్యం మత్తులో ఉన్న అతడు అనవసరంగా కాల్ చేసి ఇలా పోలీసుల సమయాన్ని వృథా చేయడంతో కేసు నమోదు చేశారు. ఆపద, అత్యవసర సేవలకోసం మాత్రమే డయల్ 100కు పోన్ చేయాలని ఎస్ఐ సూచించారు. -
మునక్కాడ మటన్.. ఇలా చేస్తే లొట్టలేసుకుంటూ తినాల్సిందే
Mutton Mulakkada Curry in Telugu: శాకాహారమైనా మాంసాహారమైనా మునక్కాడలు, మనగాకు చేరితే ఆ ఘుమఘుమలే వేరు. తినగ తినగ మునగలో తీరైన రుచులుండు అన్నట్టు మునగ వంటలను తింటూ లొట్టలేయకుండా ఉండలేరు. మునక్కాడ మటన్ కావలసినవి: మటన్ – అరకేజీ; మునక్కాయలు – 3 (3 అంగుళాల పరిమాణంలో ముక్కలు చేయాలి); ఉల్లిపాయలు – 3; అల్లం–వెల్లుల్లి పేస్ట్ – 2 టీ స్పూన్లు; కారం – 2 టీ స్పూన్లు; పసుపు – చిటికెడు; కొబ్బరి తురుము – అర టీ స్పూన్; లవంగాలు – 4; దాల్చిన చెక్క – చిన్న ముక్క; గరంమసాలా – అర టీ స్పూన్; కరివేపాకు – రెండు రెమ్మలు; టొమాటో– 1 (తరగాలి); కొత్తిమీర – ఒక కట్ట; ఉప్పు – తగినంత; నూనె – సరిపడా తయారుచేయు విధానం: ► మటన్ ని శుభ్రంగా కడిగి కుకర్‌లో వేసి. కొద్దిగా కారం, ఉప్పు, గరంమసాలా కలిపి స్టౌ మీద పెట్టి రెండు–మూడు విజిల్స్ వచ్చాక దింపేయాలి. ►స్టౌ మీద మందపాటి గిన్నె పెట్టి. నూనె పోసి, బాగా వేడెక్కాక ఉల్లిపాయ తరుగు వేసి వేయించాలి. దీంట్లో అల్లంవెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొబ్బరి, లవంగాలు, దాల్చిన చెక్క వేసి, వేయించాలి. ►తరువాత ఉప్పు, కారం, పసుపు, గరంమసాలా వేసి కలపాలి. ఇందులో మునక్కాయ ముక్కలు, ఉడికించి పెట్టుకున్న మటన్ ముక్కలు కూడా వేసి కలిపి మూత పెట్టాలి. ►రెండు నిమిషాల తరువాత కొద్దిగా నీళ్లు పోసి, టొమాటో ముక్కలు వేసి, ఓ పదినిమిషాలు ఉడికించాలి. ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత కొత్తిమీర తరుగు వేసి, దించాలి. -
టేస్ట్ అదరహో.. మటన్ లందు కర్నూలు మటన్ వేరయా !
సాక్షి,కర్నూలు (ఓల్డ్‌సిటీ): రాష్ట్రంలో కర్నూలు పొట్టేలు మాంసానికి ప్రత్యేకత ఉంది. ఇక్కడి మాంసం రుచికరంగా ఉండటమే కాకుండా ధర కూడా ఎక్కువగా ఉంటుంది. నగరంలో సుమారు 70 మంది మాంస విక్రయదారులు ఉన్నారు. పొట్టేళ్లను సమీప ప్రాంతాల్లో జరిగే సంతల్లో కొంటుంటారు. నగరానికి 70 కిలోమీటర్ల దూరంలోని పెబ్బేరు గ్రామం పొట్టేళ్ల సంతకు ప్రసిద్ధి. అక్కడ సంత శనివారం జరుగుతుంటుంది. అలాగే జిల్లాలోని పత్తికొండ, నందికొట్కూరు కూడా సంత జరిగే ప్రాంతాలు. అక్కడ సోమవారం జరుగుతుంటుంది. ఇక్కడి మాంస విక్రయదారులు ఈ మూడు ప్రాంతాల నుంచి వారం రోజులకు సరిపడే పొట్టేళ్లు తెచ్చుకుని కోస్తుంటారు. ఈ ప్రాంతంలో నెల్లూరు జుడిపి, నెల్లూర్ బ్రౌన్ అనే రెండు రకాల జాతి పొట్టేళ్లు లభిస్తాయి. పైగా పొట్టేలు మాంసంలో కరోనా నిరోధించే శక్తి ఎక్కువ. ఇందులో ఒక ప్రత్యేక ఎంజైమ్ ఉంటుంది. కోడి మాంసంలో అది లభించదు. ఇక్కడి పొట్టేళ్లు సారవంతమైన నేలల్లో మేస్తాయి. ఈ నేలల్లో వాటికి మంచి పోషకాహారాలు లభిస్తాయి. పొరుగు జిల్లాతో పోలిస్తే.. అనంతపురం జిల్లాతో పోలిస్తే ఇక్కడి మాంసమే నాణ్యమైనది. రుచిలోనూ మేలైన రకంగా ఉంటుంది. ఈ విషయం శాస్త్రీయంగా నిర్ధారణ అయింది. ఆ జిల్లాలోని పొట్టేళ్లలో కర్ణాటక ప్రాంతంలోని మాండియా బ్రీడ్ కలుస్తుంటుంది. పొట్టేళ్ల సంతాన ఉత్పత్తి సమయంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఆడ పొట్టేలు కానీ లేక మగ పొట్టేలు కానీ మాండియా బీడ్‌కు చెందినదైతే సంతానోత్పత్తి ద్వారా వచ్చిన పొట్టేలు మాంసంలో రుచి ఉండదు. అందువల్ల ధరల్లోనూ తేడా ఉంటుంది. అనంతపురంలో మాంసం ధర రూ. 400కు కిలో ఉంటే కర్నూలులో మాత్రం రూ. 700 పల్కుతోంది. అయితే అనంతపురం మాంసంలో ఎముకలు, పేగులు వంటి వ్యర్థ పదార్థాలు 30 శాతమే ఉంటాయి. కర్నూలు మాంసంలో ఆ శాతం 40 దాకా ఉంటుంది. వ్యర్థాలు ఎక్కువ ఉండటం కూడా మాంసం ధరపై ప్రభావం చూపిస్తుందని కొందరు విశ్లేషకులు చెబుతారు. జాతీయ పరిశోధన కేంద్రానికి రవాణా.. జాతీయ పరిశోధనా కేంద్రం హైదరాబాదులోని చెంగిచెర్లలో ఉంది. కర్నూలు మాంసం నిత్యం ఈ కేంద్రానికి ఎగుమతి అవుతుంటోంది. వధశాలలు ఎలా ఉండాలి, ఏ ప్రాంతంలో మాంసం కోయాలి, ఎలాంటి జంతువులను కోయాలి, ఏఏ జాగ్రత్తలు పాటించాలి వంటి అనేక అంశాలను అక్కడి శాస్త్రవేత్తలు పరిశోధనల ద్వారా నిర్ధారిస్తుంటారు. వారు పరిశోధనలకు కర్నూలు మాంసాన్నే ఉపయోగిస్తారు. అదే సంస్థలోని విక్రయ కేంద్రంలోనూ కర్నూలు మాంసాన్ని అందుబాటులో ఉంచుతారు. మాంసానికి కూడా ఇంత స్టోరీ ఉంటుందా అనేది ఇప్పుడే తెలుస్తోంది కదూ! ఇది ముమ్మాటికి నిజం. నేల స్వభావం, అక్కడి గడ్డిమేత ఆధారంగా తేడా: డాక్టర్ రమణయ్య, పశుసంవర్ధక శాఖ జేడీ నేల స్వభావం, అక్కడి గడ్డిమేత ఆధారంగా జీవాల మాంసాల్లో తేడా ఉంటుంది. కర్నూలు నగరంతో పాటు చుట్టూ ఉండే నేల సారవంతమైనది. ఇక్కడ మొలిచే గడ్డిలోనూ తేడా ఉంటుంది. ఈ గడ్డిని మేతగా తీసుకునే జీవాల మాంసంలోనూ తేడా కనిపిస్తుంది. కర్నూలుతో పోలిస్తే హైదరాబాదు మాంసానికి కూడా రుచి తక్కువే. అందువల్లే అక్కడి పరిశోధనా కేంద్రం వారు చెంగిచెర్లకు తెప్పించుకుంటారు. చదవండి: Raghuveera Reddy: ‘కట్టిపడేసే’ దృశ్యం, వైరల్ ఫోటో -
వధువు వాళ్లు మటన్ వండలేదని పెళ్లికొడుకు ఎంత పనిచేశాడు..
భువనేశ్వర్: సాధారణంగా వివాహవేడుకలో అప్పుడప్పుడు కొన్ని ఆశ్చర్యకమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. వధువు తరపువారు, వరుడి వైపు బంధువులని సరిగ్గా పలకరించలేదనో.. పెళ్లిలో వసతులు సరిగ్గా లేవని అలిగిన సంఘటనలు మనకు తెలిసిందే. మరికొన్ని చోట్లలో మగ పెళ్లి వారు అడిగినంత కట్నం ఇవ్వలేదని, చిన్నపాటి ఘర్షణలు చోటుచేసుకుని మండంపైన వివాహలు ఆగిపోయిన సందర్భాలు కొకొల్లలు. తాజాగా ఒడిశాలో జరిగిన వివాహం కాస్త వెరైటీ కారణంతో ఆగిపోయింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వివరాలు.. కియోంజర్ జిల్లాలోని మానతీరా గ్రామంలో ఈ ఘటన జరిగింది. కాగా, పెళ్లి వేడుకలో భాగంగా ఒక రోజు ముందు.. మగ పెళ్లివారు బంధువులతో కలిసి బరాత్‌గా వధువు ఇంటికి చేరుకున్నారు. ఈ క్రమంలో రాత్రి భోజనాలు ఏర్పాటు చేశారు. అయితే, ఈ దావత్లో వరుడి బంధువులు మటన్ కావాలని అడగగా.. ఆడపెళ్లివారు వండలేదని సమాధానం చెప్పారు. దీంతో వరుడి తరపు వారు ఆగ్రహంతో ఊగిపోయారు. కాసేపటికి, ఇరువర్గాల మధ్య మాటమాట పెరిగింది. దీంతో అక్కడ స్వల్ప ఘర్శణ వాతావరణం తలెత్తింది. అనంతరం పెళ్లి కొడుకు వివాహన్ని రద్దు చేసుకుని తమ బంధువులతో కలిసి గంధాపాల గ్రామంలోని తమ బంధువుల ఇంటికి వెళ్లారు. ఆ మరుసని రోజే తమ్కా పోలీస్ స్టేషన్ పరిధిలోని పులజారా ప్రాంతానికి చెందిన మరో యువతితో పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు..‘ఇదేం.. పైత్యం వాళ్లకి..’, ‘వరుడికి.. బుధ్దుందా అసలు..’, ‘బ్రో.. మీరు ఎప్పుడు మారతారు..’, ‘పాపం.. అమ్మాయి పరిస్థితి ఏంటో..’, ‘ ఇలాంటి శాడిస్టు భర్త నీకేందుకు..’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. చదవండి: ఆమె ఆరోగ్యం బాగు చేయడానికి ఆ దేవుడే ఇలా వచ్చాడేమో! -
మటన్ కూరలో ఉప్పు ఎక్కువ వేసిందని..
కర్ణాటక, బాగేపల్లి: మద్యం మత్తులో భార్యను కట్నం కోసం పీడించి, మటన్ కూరలో ఉప్పు ఎక్కువ వేసిందని హింసించి చంపాడో కిరాతక భర్త. ఆదివారం రాత్రి బాగేపల్లి తాలుకాలోని చేళూరు సమీపంలో ఉన్న హోసహుడ్య (ఉప్పకుంటెపల్లి) గ్రామంలో చోటు చేసుకుంది. భర్త చేతిలో హత్యకు గురైన బాధితురాలు బీ.ఎస్. మధుర (25)కాగా, నిందితుడు భర్త బాలచంద్ర. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రెండేళ్ల కిందట బాగేపల్లి తాలూకాలోని మరవపల్లి గ్రామానికి చెందిన బాలచంద్ర, మధురను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. ఇతడు కారు డ్రైవర్‌గా పనిచేసేవాడు. తరువాత మధుర తల్లిదండ్రులు అతనికి భారీగానే కట్నకానుకలు ముట్టజెప్పారు. కానీ మద్యానికి బానిస అయిన బాలచంద్ర రోజూ తాగి వచ్చి భార్యతో గొడవ పడి మరింత వరకట్నం తేవాలని వేధించేవాడు. (ప్రియురాలి కోసం వెళ్లి హతమయ్యాడు ) గొంతు పిసికి చంపి.. మధుర గతంలో కాన్పునకు పుట్టింటికి వెళ్ళి అక్కడే ఉంటోంది. వారికి 11 నెలల మగబిడ్డ ఉన్నాడు. బాలచంద్ర వారం రోజులకు ఒక సారి భార్య వద్దకు వచ్చి వెళుతుండేవాడు. ఆదివారం వచ్చిన బాలచంద్ర రాత్రి భోజనం తిని మాంసంలో ఉప్పు ఎక్కువైందని గలాటా చేయసాగాడు. మదుర చెల్లి భార్యభర్తల మధ్య గొడవలో ఎందుకని అక్కడి నుంచి వెళ్లిపోయింది. మత్తులో ఉన్న బాలచంద్ర భార్య గొంతుపిసికి చంపి చున్నీతో మెడకు కట్టి కిటికి ఉరి వేసుకున్నట్లు కథ అల్లాడు. అంతకుముందే మధుర అరుపులు విని బయటి నుంచి కుటుంబ సభ్యులతో పాటు చుట్టు పక్కల వారు వచ్చి ఘోరం వెలుగుచూసింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి బాలచంద్రను పట్టుకోవడానికి యత్నించారు. అతన్ని మాకు అప్పగించాలని ప్రజలు పోలీసుల జీపు పైన రాళ్ళతో దాడికి దిగారు. దాంతో వారిని తప్పించుకొని అతన్ని అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. చేళూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.(విల్లుపురంలో దారుణం) -
భర్తను చంపేందుకు భార్య స్కెచ్
-
మటన్ కూరలో సైనేడ్ కలిపి భర్త హత్యకు స్కెచ్
సాక్షి, భీమడోలు: అనుమానం పెనుభూతమైంది. చంపితే గానీ కథ కొలిక్కిరాదని పక్కా ప్లాన్ వేశారు. ఎలా చంపాలని, ఎలా చంపితే తమ పేర్లు బయటకు రావని ప్రయోగం కూడా చేశారు. అంతా బాగానే ఉంది. సరిగ్గా టైమ్ వచ్చే సరికి కథ అడ్డం తిరిగింది. ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలం పొలసానిపల్లిలో చోటుచేసుకుంది. భర్తకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో కట్టుకున్న భార్యే అతడిని హతమార్చేందుకు పథకం రచించింది. అందుకోసం కన్న కొడుకుతో పాటు మరో ఇద్దరి సాయం తీసుకుంది. అంతా స్క్రిప్ట్ ప్రకారమే జరిగినా...చివరి నిమిషంలో బాధితుడికి అనుమానం రావడంతో సీన్ రివర్స్ అయింది. బాధితుడి ఫిర్యాదుతో భీమడోలు పోలీసులు అయిదుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.... పోలసానిపల్లి గ్రామానికి చెందిన గోవింద్ గురునాథ్ పాల వ్యాపారం చేస్తుంటాడు. అతని భార్య రాణి కిళ్లీ కొట్టు నిర్వహిస్తోంది. భర్త గురునాథ్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో భార్య రాణి, కుమారుడు..గురునాథ్‌తో గొడవలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో భార్య, కుమారుడు కలిసి గురునాథ్‌ను చంపాయాలని భావించారు. అదే గ్రామానికి చెందిన ఎ.ధనలక్ష్మి, శ్రీనివాసరావుల సహకారం కోరారు. దీంతో సైనేడ్‌తో చంపేయాలని నిర్ణయించి ద్వారకాతిరుమల మండలం జాజులకుంటకు చెందిన గంటా మోజెస్ సహకారంతో సైనేడ్ తెచ్చారు. సైనైడ్‌ను పరీక్షించేందుకు మొదట ఇంట్లోని కోడిపుంజుపై ప్రయోగించారు. సైనైడ్ తిన్న కోడిపుంజు రంగుమారి చనిపోయింది. దీంతో తమ పథకం ఫలిస్తుందని ఆశించారు. కోడిపుంజు వైరస్ తెగులు సోకి చనిపోయిందని గురునాథ్‌ను నమ్మించారు. పక్కాప్లాన్ వేసి ఆదివారం మటన్ కూరలో సైనేడ్ కలిపి పెట్టారు. మొదటి ముద్ద తిన్న గురునాథ్‌కు ఆహారం రుచిలో తేడా ఉన్నట్టు అనుమానం వచ్చింది. అక్కడితో ఆహారాన్ని వదిలేశాడు. తనపై జరుగుతున్న కుట్ర ఏంటో తెలుసుకోవాలనుకున్నాడు. అయితే పథకం వేసిన వాళ్లంతా ఇంటి ఆవరణలో మాట్లాడుకుంటుండగా గురునాథ్ గమనించాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనను చంపేందుకు కుట్రపన్నిన ఐదుగురిని కఠినంగా శిక్షించాలని గురునాధ్ కోరుతున్నాడు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు.... గోవింద్ గురునాథ్ ఇంటిలోని మటన్ కర్రీ, సైనైడ్ బాటిల్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఐదుగురిని అరెస్టు చేశారు. -
మటన్ ఫ్రై...మటన్ కుర్మా
మటన్ ఫ్రై కావలసినవి: మటన్ – 500 గ్రా.; కొబ్బరిపొడి – 150 గ్రా.; ఉల్లిపాయలు – 10 (చిన్నముక్కలుగా తరగాలి);పచ్చిమిర్చి– 5 (సన్నగా తరగాలి); లవంగాలు – 4,; దాల్చినచెక్క – చిన్న ముక్క; ఏలకులు – 4,;బిర్యానీ ఆకులు – 2; మిరప్పొడి – 4 టీ స్పూన్లు; దనియాల పొడి – నాలుగు టీ స్పూన్లు;పసుపు – టీ స్పూను; పచ్చిమిర్చి – రెండు (నిలువుగా చీరాలి గార్నిష్ కోసం); సన్నగా తరిగిన కొత్తిమీర – కప్పు; మెంతి ఆకు – 50 గ్రా.; నూనె – మూడు టేబుల్ స్పూన్లు; ఉప్పు – రుచికి తగినంత; తయారి: మటన్‌ను శుభ్రం చేయాలి. పాత్రలో నూనె వేడిచేసి గరం మసాలా దినుసులన్నీ వేసి వేగిన తరవాత ఉల్లిపాయ ముక్కలు వేసి సన్నమంట మీద మగ్గనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగిన తరవాత పచ్చిమిర్చి ముక్కలు,మెంతి ఆకులు, మిరప్పొడి, పసుపు, ధనియాల పొడి, ఉప్పువేసి బాగా కలపాలి. ఇప్పుడు మటన్ వేసి కలిపి సన్నమంట మీద ఉడకనివ్వాలి. మధ్యలో రెండు నిమిషాలకొకసారి కలియబెట్టి మూత పెడుతుండాలి. మాంసం ముక్క మెత్తబడిన తరవాత కొబ్బరిపొడి వేసి పది నిమిషాల పాటు దమ్ మీదఉడికించాలి. చివరగా కొత్తిమీర, పచ్చిమిర్చితో గార్నిష్ చేసి వడ్డించాలి. మటన్ కుర్మా కావలసినవి:మటన్ ముక్కలు – కేజీ; ఉల్లిపాయలు – 4 (సన్నగా తరగాలి); పెరుగు – 3 కప్పులు; కారం – 2 టేబుల్ స్పూన్లు; ధనియాల పొడి – 2 టేబుల్ స్పూన్లు; పసుపు – టీ స్పూన్; జీలకర్ర పొడి – పావు టీ స్పూన్; లవంగాలు – 5; ఏలకులు (పచ్చవి) – 6; దాల్చినచెక్క – అంగుళం; కుంకుమపువ్వు – కొన్నిరేకలు; ఉప్పు – తగినంత; అల్లం పేస్ట్ – టీ స్పూన్; వెల్లుల్లి పేస్ట్ – టీ స్పూన్; నూనె – కప్పు నెయ్యి – అర కప్పు; ఫ్రెష్ క్రీమ్ – 2 టేబుల్ స్పూన్లు; తయారి: పాన్‌లో నూనె వేసి, ఉల్లిపాయలను గోధుమరంగు వచ్చేవరకు వేయించుకోవాలి. బాగా వేగిన ఉల్లిపాయ ముక్కలను కిచెన్ పేపర్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఉల్లిపాయముక్కలు క్రిస్పీగా తయారయ్యాక వాటిని మిక్సర్‌లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. అదే పాన్‌లో మరికొంచెం నూనె వేసి మటన్‌ముక్కలు, అల్లంవెల్లుల్లి పేస్ట్ కలిపి, ఆరు నిమిషాలు తక్కువ మంట మీద ఉడకనివ్వాలి. దీంట్లో కారం, ధనియాల పొడి, పసుపు, ఉప్పు,నల్లమిరియాల పొడి, ఏలకులు, లవంగాలు, దాల్చినచెక్క, జీలకర్రపొడి, పెరుగు, రెండుకప్పుల నీళ్లు కలిపి అరగంట సేపు సన్ననిమంట మీద ఉడికించాలి. ఉల్లిపాయ పొడి వేసి కలపాలి. ముక్క ఉడికి, నూనె పైకి తేలుతునప్పుడు కుంకుమపువ్వు, ఫ్రెష్ క్రీమ్, నెయ్యి కలిపి మూత పెట్టి మరో పదిహేను నిముషాలు ఉడికించాలి. దించేముందు కొత్తిమీర చల్లుకోవాలి. నోరూరించే మటన్ కుర్మాను వేడి వేడిగా నాన్లేదా చపాతీలోకి వడ్డించాలి. -
మటన్ కర్రీ గొడవ.. భర్తను చంపేసిన భార్య
బనశంకరి: మద్యం మత్తులో ఉన్న భర్త మటన్ కూర చేసి పెట్టాలని హుకుం జారీ చేయడంతో పాటు దూషించడంతో కోపోద్రిక్తురాలైన భార్య అతన్ని అంతమొందించింది. ఈ ఘటన కుమారస్వామిలేఔట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు.... బనశంకరి సమీపంలోని ప్రగతిపురలో నివాసం ఉంటున్న గోపాల్(44)కు తమిళనాడు కు చెందిన రుద్రమ్మ(35)తో 15 ఏళ్లు క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు ఆడపిల్లలు. మద్యానికి బానిసైన గోపాల్ పనులకు వెళ్లకుండా జులాయిగా తిరిగేవాడు. రుద్రమ్మ పండ్ల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. ఆదివారం రాత్రి పీకల దాకా మద్యం సేవించిన గోపాల్ ఇంటికి చేరుకుని తనకు మటన్ కూర వండాలని భార్యకు సూచించాడు. ఈక్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కింది అంతస్తులో ఉంటున్న రుద్రమ్మ తల్లిదండ్రులు పైక ?చేరుకొని గోపాల్ కాళ్లు చేతులు కట్టివేసి బంధించారు. మద్యం మత్తులో ఉన్న గోపాల్ నిద్రలోకి జారుకున్నారు. అనంతరం రుద్రమ్మ తల్లిదండ్రులు వారి ఇంట్లోకి వెళ్లిపోయారు. అర్ధరాత్రి సమయంలో మెలుకువ వచ్చిన గోపాల్ భార్యను తీవ్రపరుషపదజాలంతో దూషించాడు. కోపోద్రిక్తురాలైన రుద్రమ్మ చీరతో గొంతుబిగించి భర్తను హత్య చేసింది. మరుసటిరోజు మృతదేహన్ని తమిళనాడు కు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించాలని పథకం పన్నింది. సాధ్యంకాక తన భర్త అనారోగ్యంతో మృతిచెందినట్లు నాటకమాడింది. ఈమేరకు పోలీసులకు కూడా సమాచారం ఇచ్చింది. అయితే మృతుడి గొంతుపై గాయం గుర్తు ఉండటంతో పోలీసులు రుద్రమ్మ, ఆమె తల్లిదండ్రులను తమదైనశైలిలో విచారణ చేపట్టారు. దీంతో తానే గోపాల్‌ను హత్యచేసినట్లు రుద్రమ్మ నోరువిప్పింది. కేసు దర్యాప్తులో ఉంది. -
మటన్ కర్రీ సరిగా వండలేదని భార్యకు నిప్పు
చికిత్స పొందుతూ బాధితురాలి మృతి కాటేదాన్ : మటన్ క ర్రీని రుచికరంగా వండలేదని ఓ తాగుబోతు భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. బాధితురాలు చికిత్సపొందుతూ ఆసుపత్రిలో మృతి చెందింది. మైలార్‌దేవ్‌పల్లి పోలీసుల కథనం ప్రకారం... పద్మశాలిపురం టీఎన్జీవోఎస్‌కాలనీలో సులోచన(25), శంకర్రావు షిండే దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి సంతోష(8) సంతానం. శంకర్రావు హమాలీగా పని చేస్తున్నాడు. ఈనెల 20న శంకర్రావు మటన్ తెచ్చి భార్యకు ఇచ్చి కూర వండమన్నాడు. తర్వాత బయటకు వెళ్లి మద్యం తాగి వచ్చిన అతను మటన్‌కర్రీని రుచిగా వండలేదని భార్యపై చిందులు తొక్కాడు. తప్పతాగి ఉన్న అతను తీవ్రఆగ్రహంతో ఊగిపోతూ సులోచనపై కిరోసిన్ పోసి నిప్పంటించి పారిపోయాడు. స్థానికులు మంటలను ఆర్పి సులోచనను 108లో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె గురువారం మధ్యాహ్నం మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు శంకర్రావు షిండేను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తల్లి మృతి చెందడం... తండ్రి జైలు పాలుకావడంతో వారి కుమారె ్త సంతోష అనాథగా మారింది. -
రూ. 6కే మసాలా దోశ
* రూ. 20కే మటన్ కర్రీ.. భారీ సబ్సిడీతో ఎంపీలకు తిండి * 60-150 శాతం రాయితీతో పసందైన వంటలు * గత ఐదేళ్లలో రూ. 60.7 కోట్ల మేర సబ్సిడీలు న్యూఢిల్లీ: మార్కెట్లో మటన్ కేజీ ధర రూ. 500 దాటింది. మసాలా దోసె రూ. 30-40 మధ్య ఉంది. కానీ మన ఎంపీలకు మాత్రం ఇవి పరమ కారుచవకగా అందుతున్నాయి. వారు పసందైన మటన్ కర్రీని రూ. 20కి, మసాలా దోశను రూ. 6కే లాగించేస్తున్నారు. ఇదంతా పార్లమెంట్ క్యాంటీన్ అందుకుంటున్న సబ్సిడీ మహిమ. ఎంపీలకు ఆహారాన్ని అందించే పార్లమెంటు క్యాంటీన్ గత ఐదేళ్లలో రూ.60.7 కోట్ల భారీ సబ్సిడీని అందుకుంది. 60 నుంచి 150 శాతం రాయితీతో ఇక్కడ ఆహార పదార్థాలను అందిస్తున్నారు. పూరీ సబ్జీ లాంటి పదార్థాలను 88 శాతం సబ్సిడీతో ఇస్తున్నారు. ఎంపీలకు ఆహారాన్ని ఎంత సబ్సిడీతో ఇస్తున్నారో తెలిపే జాబితా సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద వెల్లడైంది. ఫిష్ ప్రైడ్ చిప్స్‌ను 63 శాతం సబ్సిడీతో రూ.25కు, మటన్ క ట్లెట్ను 65 శాతం రాయితీతో రూ.18కి, ఆయిల్డ్ వెజిటబుల్స్‌ను 83 శాతం సబ్సిడీతో రూ.5కు, మటన్ కర్రీని 67 శాతం రాయితీతో రూ.20కి, మసాలా దోశను 75 శాతం సబ్సిడీతో రూ.6కు అందిస్తున్నట్లు వెల్లడైంది. పచ్చి కూరగాయలను రూ.41.25తో కొంటుండగా, వండిన పదార్థాలను రూ.4కే ఎంపీలకు ఇస్తున్నారని ఆర్టీఐ కార్యకర్త సుభాష్ అగర్వాల్ తెలిపారు. నాన్‌వెజ్ మీల్‌కు అవసరమైన పదార్థాల సేకరణకు రూ.99 అవుతుండగా, వండిన డిష్‌ను రూ.33కే ఇస్తున్నారన్నారు. పార్లమెంటులోని మొత్తం 5 క్యాంటీన్లు నోరూరించే 76 రకాల డిష్‌లను భారీ సబ్సిడీతో ఇస్తున్నాయన్నారు. సబ్సిడీ లేకుండా ఇస్తున్నది కేవలం రోటీ మాత్రమే. రోటీకి అవసరమైన సరుకులు 77పైసలకు వస్తోంటే రోటీని ఒక్క రూపాయికి విక్రయిస్తున్నారు. నార్తర్న్ రైల్వే నిర్వహిస్తున్న ఈ క్యాంటీన్లు సరుకులను ప్రభుత్వ సంస్థలైన కేంద్రీయ భండార్, మదర్ డైరీ, డీఎంఎస్ తదితరాల నుంచి సేకరిస్తాయి. జీతం, ఇతర అలవెన్సులు కలిపి నెలకు రూ. 1.4 లక్షలకు పైగా అందుకుంటున్న ఎంపీలకు మార్కెట్ ధరకే ఆహారాన్ని విక్రయించి సబ్సిడీలను తక్షణమే రద్దు చేయాలని ఆయన కోరారు.