మటన్ కర్రీ సరిగా వండలేదని భార్యకు నిప్పు | Mutton Curry was not properly wife Wanda fire | Sakshi
Sakshi News home page

మటన్ కర్రీ సరిగా వండలేదని భార్యకు నిప్పు

Published Thu, Dec 24 2015 11:55 PM | Last Updated on Sun, Sep 3 2017 2:31 PM

మటన్ కర్రీ సరిగా వండలేదని భార్యకు నిప్పు

మటన్ కర్రీ సరిగా వండలేదని భార్యకు నిప్పు

చికిత్స పొందుతూ బాధితురాలి మృతి
 
కాటేదాన్ : మటన్ క ర్రీని రుచికరంగా వండలేదని ఓ తాగుబోతు భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. బాధితురాలు చికిత్సపొందుతూ ఆసుపత్రిలో మృతి చెందింది.  మైలార్‌దేవ్‌పల్లి పోలీసుల కథనం ప్రకారం... పద్మశాలిపురం టీఎన్జీవోఎస్‌కాలనీలో సులోచన(25), శంకర్‌రావు షిండే దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి సంతోష(8) సంతానం. శంకర్‌రావు హమాలీగా పని చేస్తున్నాడు. ఈనెల 20న శంకర్‌రావు మటన్ తెచ్చి భార్యకు ఇచ్చి కూర వండమన్నాడు. తర్వాత బయటకు వెళ్లి మద్యం తాగి వచ్చిన అతను మటన్‌కర్రీని రుచిగా వండలేదని భార్యపై చిందులు తొక్కాడు.

తప్పతాగి ఉన్న అతను తీవ్రఆగ్రహంతో ఊగిపోతూ సులోచనపై కిరోసిన్ పోసి నిప్పంటించి పారిపోయాడు. స్థానికులు మంటలను ఆర్పి సులోచనను 108లో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె గురువారం మధ్యాహ్నం మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు శంకర్‌రావు షిండేను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తల్లి మృతి చెందడం... తండ్రి జైలు పాలుకావడంతో వారి కుమారె ్త సంతోష అనాథగా మారింది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement