Shankar Rao
-
‘కూటమి’ అరాచకాలను ప్రశ్నిస్తాం.. ఎదిరిస్తాం: అంబటి
సాక్షి, గుంటూరు: పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు(Namburu Sankara Rao) కార్యాలయంపై దాడి చేసిన టీడీపీ నాయకులను వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ ఎస్పీకి వైఎస్సార్సీపీ(YSRCP) నేతలు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆ పార్టీ నేతలు మీడియాతో మాట్లాడారు. కొందరు తన కార్యాలయంలోకి చొరబడి ఫ్లెక్సీలు చింపి, అక్కడ ఉన్న పార్టీ నాయకులు, కార్యాలయ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారని.. ఈ అంశంపై ఇవాళ(బుధవారం) జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసినట్లు నంబూరు శంకర్రావు తెలిపారు.సహించం.. కచ్చితంగా తిప్పి కొడతాం: నంబూరు శంకర్రావు..మా కార్యాలయంపై దాడి చేసి తమ సిబ్బందిపై తిరిగి కేసులు పెట్టారు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదు. గత కొన్ని నెలల క్రితం పెదకూరపాడులో వైఎస్సార్సీపీ నేత సాంబిరెడ్డి కాళ్లు నరికారు. మా పార్టీ, కార్యకర్తలపై పెదకూరపాడులో దాడులు జరుగుతున్నాయి. గతంలో కొమ్మలపాటి శ్రీధర్, కన్నా లక్ష్మీనారాయణ, నేను పనిచేశాం. ఇలాంటి ఘటనలను ఇకపై మేము సహించేది లేదు.. కచ్చితంగా తిప్పి కొడతాం.నియోజకవర్గంలో అవినీతి, అక్రమాలను ఉపేక్షించేది లేదు. తప్పకుండా ప్రశ్నిస్తాం. ప్రజల దృష్టికి తీసుకెళ్తాం. వచ్చిన పదవి అవకాశాన్ని మంచిగా ఉపయోగించాలి. నియోజకవర్గ అభివృద్ధిపై, ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టాలి’’ అని నంబూరు శంకర్రావు పేర్కొన్నారు.చంద్రబాబు ఇకనైనా కళ్లు తెరవాలి: అంబటి రాంబాబుమాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. పోలీసులు రాజకీయ ఒత్తిడికి గురవుతున్నారని.. కూటమి నేతలు ఏడు నెలల్లో చేయకూడని అరాచకాలు చేశారని మండిపడ్డారు. ‘‘ఐదేళ్లు పాటు పెదకూరపాడు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేసిన శంకర్రావుపై దాడి చేస్తామంటున్నారు. గతంలో నియోజకవర్గంలో రైతులను పరామర్శించేందుకు వెళ్లగా ఆయన కారుపై దాడికి పాల్పడ్డారు.. ఇది సహించరాని ఘటన. కచ్చితంగా పెదకూరపాడు వెళ్తాం.. కార్యకర్తల సమావేశం నిర్వహిస్తాం. పోలీసులే మాకు రక్షణ కల్పించాలి.ఇదీ చదవండి: ఇదేం బ్రొమాన్స్ బాబోయ్.. మోదీ పగలబడి నవ్వింది అందుకే!..రాష్ట్రంలో మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో అరాచక పాలన సాగుతుంది. చంద్రబాబు ఇకనైనా కళ్లు తెరవాలి. పిల్లిని గదిలో వేసి కొడితే పులి అవుతుంది ఆ విషయాన్ని కూటమి ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రంలో రోజు రోజుకీ సమస్యలు ముదురుతున్నాయి. పండుగ కూడా చేసుకోకుండా దాడులు చేస్తున్నారు. ఇలాంటి దాడులను ఎదిరించి, ధైర్యంగా నిలబడతాం. టీడీపీ చేసే ప్రతి దాడిని, దౌర్జన్యాన్ని ప్రజలకు వివరిస్తాం’’ అని అంబటి రాంబాబు తెలిపారు. -
టీడీపీ నేతల దాడులపై నంబూరు శంకర్ స్ట్రాంగ్ రియాక్షన్
-
వైఎస్సార్సీపీ నేతపై ఇనుపరాడ్డుతో దాడి.. నంబూరు శంకరరావు స్ట్రాంగ్ రియాక్షన్
-
Chhattisgarh Encounter: ఎన్కౌంటర్ మృతుల్లో చిన్నన్న లేడు
ఆత్మకూరు రూరల్ (నంద్యాల జిల్లా) / సాక్షి ప్రతినిధి, వరంగల్: ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మరణించిన 29 మంది మావోయిస్టుల్లో ఏపీలోని నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం వడ్ల రామాపురం గ్రామానికి చెందిన మావోయిస్టు అగ్రనేత సుగులూరి చిన్నన్న అలియాస్ శంకర్రావు అలియాస్ నాగన్న అలియాస్ విజయ్ లేరని బస్తర్ ఐజీ సుందర్రాజ్, కాంకేర్ సీనియర్ ఐపీఎస్ అధికారి ఇంద్ర కళ్యాణ్ ఎల్లిసెల వెల్లడించారు. బుధవారం రాత్రి వరకు 8 మంది మావోయిస్టులను గుర్తించామన్నారు. మృతుల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగెకు చెందిన మావోయిస్టు పార్టీ డీకే టాప్ కమాండర్ సిరిపల్లె సుధాకర్ అలియాస్ మురళి, అలియాస్ శంకర్, ఆయన భార్య ఉన్నారని చెప్పారు. ఈ ఎన్కౌంటర్లో 29 మంది మావోయిస్టులు మృతి చెందారని, వారిలో 15 మంది మహిళలు, 14 మంది పురుషులు ఉన్నారని చెప్పారు. ఘటన స్థలంలో ఏకే–47, ఎల్ఎంజీ, ఇన్సాస్ లాంటి అత్యాధునిక ఆయుధాలను స్వాదీనం చేసుకున్నట్లు తెలిపారు. మృతుల్లో చిన్నన్న లేడని ధ్రువీకరించిన సోదరులు ఈ ఎన్కౌంటర్లో సుగులూరి చిన్నన్న అలియాస్ శంకర్రావు ఉన్నట్లు పోలీసులు తొలుత భావించారు. అయితే నంద్యాల పోలీసులు చూపించిన ఎన్కౌంటర్ మృతుల ఫొటోల్లో చిన్నన్న లేడని ఆయన సోదరులు ధ్రువీకరించారు. సుగులూరి చిన్నన్న 1996లో అప్పటి పీపుల్స్‌వార్‌లో పూర్తికాల సభ్యుడిగా చేరారు. తొలుత కర్నూలు జిల్లాలో అప్పటి భవనాసిదళం సభ్యుడిగా ప్రస్థానం ప్రారంభించిన ఆయన.. 2006 తర్వాత దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీలోకి వెళ్లినట్లు సమాచారం. ఆ తర్వాత దండకారణ్యం స్పెషల్ జోనల్ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, రాజ్‌నంద్‌గావ్ – కాంకేర్ డివిజన్ కార్యదర్శిగా విజయ్ పేరుతో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. గుర్తించిన మృతులు 1. సిరిపల్లె సుధాకర్ అలియాస్ శంకర్ రావు, మావోయిస్టు పార్టీ డీకే టాప్ కమాండర్ 2. దాశశ్వర్ సుమన అలియాస్ రజిత, డీసీఎస్, సిరిపల్లె సుధాకర్ అలియాస్ శంకర్ భార్య, ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూరు 3. లలిత, డీవీసీ మెంబర్, జన తన సర్కార్ కమిటీ ఇన్చార్జి 4. మాధవి, నార్త్ బస్తర్ మెంబర్ 5. జగ్ను అలియాస్ మాలతి, పర్థాపూర్ ఏరియా కమిటీ 6. రాజు సలామ్ అలియాస్ సుఖాల్, పర్తాపూర్ ఏరియా కమిటీ మెంబర్ 7. వెల సోను అలియాస్ శ్రీకాంత్ సోను, పర్థాపూర్ ఏరియా కమిటీ మెంబర్ 8. రాణిత అలియాస్ జయమతి, రూపి, ప్రాగ్ ఎల్వోసీ కమాండర్ 9. రామ్ షీలా, నార్త్ బస్తర్ డివిజన్ కమిటీ మెంబర్ -
బాబు సభ అట్టర్ ఫ్లాప్.. టీడీపీ సానుభూతి రాజకీయాలు
-
టీడీపీ చేసిన అభివృద్ధి ఏంటో లోకేష్ చెప్పాలి ?
-
చర్చకు కాదు.. రచ్చకు.. కయ్యానికి కాలుదువ్విన టీడీపీ మాజీ ఎమ్మెల్యే
అమరావతి: ఇటీవల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా తరచూ అధికార పక్షంపై కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న టీడీపీ నేతలు తాజాగా పల్నాడు జిల్లా అమరావతిలోనూ కయ్యానికి కాలుదువ్వారు. అక్కడి టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ గత కొంతకాలంగా ప్రస్తుత పెదకూరపాడు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే నంబూరి శంకరరావుపై ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. వీటిపై చర్చకు తాను సిద్ధమని ప్రకటించి అమరేశ్వరస్వామి ఆలయానికి ఆయన చేరుకున్నారు. కానీ, కొమ్మాలపాటి చర్చకు కాకుండా తన బలగంతో రచ్చచేయడానికే అన్నట్లు అక్కడికి బయల్దేరారు. దీంతో పోలీసులు అప్రమత్తమై కొమ్మాలపాటిని అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ మూకలు రెచ్చిపోయి బస్సుపై దాడిచేశారు. పోలీసులు వెంటనే ఇరుపార్టీల వారిని వెనక్కి పంపడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఘటన పూర్వాపరాలు.. తనపై టీడీపీ నేతలు ఇటీవల కొన్నిరోజులుగా చేస్తున్న ఆరోపణలు, అభివృద్ధిపై చర్చకు తాను సిద్ధమని, ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలని ఆదివారం అమరావతి అమరేశ్వరస్వామి సన్నిధిలో ప్రమాణానికి సిద్ధమని ఎమ్మెల్యే నంబూరు శంకరరావు సవాల్ విసిరారు. ఇందుకు టీడీపీ నేతలు, కొమ్మాలపాటి శ్రీధర్ స్పందించి తాము కూడా సిద్ధమని ప్రకటించారు. దీంతో వారం రోజులుగా పెదకూరపాడు నియోజకవర్గంలో ఈ విషయం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో.. సత్తెనపల్లి డీఎప్పీ ఆదినారాయణ ఆధ్వర్యంలో ఇరుపార్టీల నాయకులకు నోటీసులు జారీచేసి ముఖ్య నేతలపై నిఘా పెట్టారు. అయితే, శనివారం అర్ధరాత్రి వరకు వారంతా ఎక్కడ ఉన్నారో తెలీక పోలీసులు విస్తృతంగా సోదాలు చేశారు. అమరావతితోపాటు మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో 144 సెక్షన్ విధించి అమరావతికి నాలుగు వైపులా చెక్‌పోస్టులు ఏర్పాటుచేశారు. అలాగే, ఆదివారం ఉదయం చుట్టుపక్కల గ్రామాల నుంచి అమరావతికి వచ్చే ఇరుపార్టీల నేతలను, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం ఉ.9.35కు ఎమ్మెల్యే శంకరరావు అమరేశ్వరస్వామి దేవస్థానం గాలిగోపురం వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో స్థానిక ముస్లిం కాలనీ నుంచి గాంధీబొమ్మ సెంటర్ వైపు దాడులకు తెగబడేందుకు అన్నట్లుగా పెద్దఎత్తున తన మందీమార్బలంతో కొమ్మాలపాటి శ్రీధర్ బయల్దేరారు. దీనిని పోలీసులు పసిగట్టి వారిని అడ్డుకున్నారు. దీంతో వారి మధ్య తోపులాట జరిగింది. అనంతరం.. కొమ్మాలపాటిని పోలీసులు అదుపులోకి తీసుకుని అమరావతి పోలీస్‌స్టేషన్ వైపు తరలిస్తుండగా టీడీపీ మూకలు రెచ్చిపోయాయి. ఒక్కసారిగా అక్కడున్న బస్సుపై వారు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో బస్సు అద్దం ధ్వంసమైంది. దీంతో కొమ్మాలపాటిని క్రోసూరు వైపునకు మళ్లించారు. ఇదే సమయంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు అమరేశ్వరస్వామి దేవస్థానం వద్ద నుంచి గాంధీబొమ్మ వైపు వస్తుండగా పోలీసులు వారినీ అడ్డుకున్నారు. ఎమ్మెల్యే నంబూరు శంకరరావుకు మద్దతుగా నినాదాలు చేస్తూ కొమ్మాలపాటి శ్రీధర్ దిష్టిబొమ్మను దగ్థం చేశారు. డీఎస్పీ ఆదినారాయణ సంయమనంతో వారిని నిలువరించడంతో పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. -
కన్నడ హాస్యనటుడు మృతి.. ప్రముఖుల సంతాపం
Kannada Actor,Comedian Shankar Rao Passes Away: కన్నడ హాస్యనటుడు శంకర్ రావు (84) అనారోగ్యంతో సోమవారం ఉదయం బెంగళూరుతో కన్నుమూశారు. పాప పాండు సీరియల్ ద్వారా చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. రంగభూమి కళాకారునిగా కూడా మంచి పేరు సంపాదిందిచారు. ఆయన మృతికి కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. చదవండి: తొలిసారి తన కొడుకును పరిచయం చేసిన నటి సమీరా అనసూయ డ్రెస్సింగ్‌పై వివాదాస్పద కామెంట్స్ చేసిన కోట శ్రీనివాసరావు -
సింగిల్ హ్యాండ్ స్నాచర్!
సాక్షి, సిటీబ్యూరో: సాధారణంగా చైన్ స్నాచింగ్ కేసుల్లో కనీసం ఇద్దరు నిందితులు ఉంటుంటారు. ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ పంజా విసురుతుంటారు. ఒకరు వాహనం నడిపితే... మరొకరు వెనుక కూర్చుని టార్గెట్ చేసిన వారి మెళ్లో గొలుసులు లాగేస్తుంటారు. అయితే మహారాష్ట్రకు చెందిన అంతరాష్ట్ర నేరగాడు శంకర్రావు బిరాదర్ స్టైలే డిఫరెంట్ ఇతగాడు సింగిల్‌గానే సంచరిస్తూ స్నాచింగ్స్ చేయడం మొదలెట్టాడు. ఈ ఘరానా నేరగాడిని తూర్పు మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ చక్రవర్తి గుమ్మితో కలిసి బషీర్‌బాగ్ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ వివరాలు వెల్లడించారు. పౌల్ట్రీ ఫామ్ సోదరుడి పాలుకావడంతో... మహారాష్ట్రలోని లాథూర్ జిల్లా, ప్రకాష్‌నగర్‌కు చెందిన శంకర్రావు తన స్వస్థలంలో సోదరుడితో కలిసి పౌల్ట్రీ ఫామ్ ఏర్పాటు చేశాడు. కొన్నేళ్ల పాటు వీరి వ్యాపారం సజావుగానే సాగింది. వ్యాపారంలో భారీ లాభాలు వస్తుండటంతో శంకర్రావు తమ్ముడి బుద్ధి మారింది. ఆ ఫౌల్ట్రీ ఫామ్‌ను సొంతం చేసుకున్న అతగాడు శంకర్రావును వెళ్లగొట్టాడు. దీంతో తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం నేరాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. లాథూర్‌కు చెందిన రాజు అనే పాత నేరగాడితో కలిసి రంగంలోకి దిగాడు. వీరిద్దరూ 2018లో కేవలం మూడు నెలల్లోనే 47 నేరాలు చేశారు. వీటిలో 33 చైన్ స్నాచింగ్స్ కాగా... 14 బైక్ చోరీ కేసులు ఉన్నాయి. పుణే కమిషనరేట్ పరిధిలోని 20 పోలీసుస్టేషన్లలో నేరాలకు పాల్పడిన వీరిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. వివిధ సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌ను పరిశీలించిన అక్కడి పోలీసులు రాజును గుర్తించారు. దీంతో వలపన్ని అతడితో పాటు శంకర్రావును 2018 సెప్టెంబర్‌లో పుణేలోని హడప్సర్ పోలీసులు అరెస్టు చేశారు. అలా కాకూడదనే... పుణేలో తాను చిక్కడానికి రాజుతో జట్టు కట్టడమే కారణమని భావించిన శంకర్రావు మరోసారి అలా జరగకూడదని జైల్లో ఉండగానే నిర్ణయించుకున్నాడు. యరవాడ సెంట్రల్ జైలు నుంచి ఈ ఏడాది జనవరిలో బెయిల్‌పై విడుదలయ్యాడు. ఆ తర్వాత కొన్ని రోజులు మిన్నకుండిపోయిన ఇతగాడు ఆపై తాను ఎవరో తెలియని హైదరాబాద్ నగరాన్ని టార్గెట్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. వరుసపెట్టి 20–30 స్నాచింగ్స్ చేసి స్వస్థలానికి వెళ్ళిపోవాలని పథకం వేశాడు. ఈ నెల మొదటి వారంలో నగరానికి వచ్చిన ఇతను దినసరి కూలీగా చెప్పుకుంటూ కాటేదాన్ ప్రాంతంలో ఓ చిన్న గది అద్దెకు తీసుకున్నాడు. ఈ నెల 19న లంగర్‌హౌస్ పరిధిలో ఓ బైక్ చోరీ చేశాడు. దానిపై తిరుగుతూ రెక్కీ చేసిన ఇతగాడు ఆదివారం రంగంలోకి దిగాడు. కాచిగూడ, ఎస్సార్‌నగర్ పరిధిల్లో రెండు స్నాచింగ్స్ చేశాడు. దీనిపై స్థానిక పోలీసుస్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాస్ నేతృత్వంలో ఎస్సైలు సి.వెంకటేష్, జి.శ్రీనివాస్‌రెడ్డి, గోవింద్ స్వామిలతో కూడిన బృందం రంగంలోకి దిగింది. ఘటనాస్థలాలతో పాటు వివిధ ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో ఫీడ్ సేకరించిన వారు దానిని ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేశారు. ఫలితంగా నిందితుడి గుర్తించి గురువారం పట్టుకున్నారు. ఇతడి నుంచి బైక్, 5.5 తులాల బంగారు గొలుసులు స్వాధీనం చేసుకున్నారు. -
చిదంబరం కేసు.. రెండ్రోజుల సంబరమేనా?
శక్తివంతమైన నేతలు వివిధ కేసుల్లో అరెస్టు కావడం, ఆ సమయంలో ప్రజలు ఏదో అద్భుతం జరిగిపోతుందని సంబరపడడం మామూలే. అయితే అలాంటి కేసులన్నీ తాత్కాలికంగా చప్పున వెలిగి తర్వాత ఆనవాలు లేకుండా ఆరిపోవడం జరుగుతున్న చరిత్ర. టూ జీ కుంభకోణమైనా, మరొకటైనా చివరకు జరిగింది మాత్రం ఇదే. యూపీఏ పాలనలో శక్తివంతమైన మంత్రి చిదంబరం తాజా అరెస్టు కూడా ఇందుకు మినహాయింపు కాకపోవచ్చు. ఆయన ఆర్థిక మంత్రిగా ఉండగా ఐఎన్ఎక్స్ మీడియాకు 307 కోట్లరూపాయల నల్ల ధన ప్రవాహం, ఆ డబ్బు ఆయన కుమారుడికే చేరి నట్టు ఒక అవినీతి కేసు. అలాగే ఎయిర్ సెల్ మాక్స్ ఒప్పందాల్లో అడ్డగోలు లబ్ధి చేకూర్చినట్టు తద్వారా ఆయన చేతివాటంపై మరో కేసు. ఈ అవినీతి కేసుల్లో సీబీఐ,ఈడీ ఆయన్ని అరెస్టు చేసింది. గతంలో ఇవే కేసుల్లో ఓ ఇరవై సార్లు ఆయనకు అరెస్టు కాకుండా బెయిల్ దొరికింది కానీ ఈసారి అలా జరగలేదు. ఈ ఉదంతాన్ని కాంగ్రెస్ కక్షసాధింపు అంటుండగా, బీజేపీ తన ప్రమేయం లేదు, ఇది దర్యాప్తు సంస్థల ద్వారా చట్టం తన పని తాను చేసుకుపోవడం మాత్రమే అంటుంది. అయితే ఒక సామాన్యుడిగా ఒక శక్తిమంతుడు అవినీతి కేసులో అరెస్టు కావడాన్ని హర్షించవచ్చు గానీ, అది తాత్కాలికమే. తర్వాత సదరు కేసు అవకాశం బట్టీ నత్త నడక, అవసరం బట్టీ పరుగు నడక పడుతుంది. ఎప్పుడూ స్థిరం గా ఒకే వేగం అన్నది ప్రముఖుల కేసుల్లో ఉండే ప్రసక్తే లేదు. చివరి ఫలితం అన్నది అయితే సాక్ష్యాలు చాలక కొట్టివేయడమో, లేదా దశాబ్దాల తర్వాత దోషిగా నిలబెట్టడమో జరుగుతుంది. అప్పటికి ఆ ప్రముఖుడు ఫలితమేదైనా ఒకే లా తీసుకునే మానసిక స్థితిలో ఉంటాడు. సమాజం ఎటూ మరి చి పోతుంది. ఈ ధోరణి మారాలి. దర్యాప్తు సంస్థలు, ప్రభుత్వం అన్ని కేసుల్నీ సమ దృష్టితో చూడాలి. కొన్ని ఇష్టం, కొన్ని కష్టంలా ఉండకూడదు. అంతవరకూ అవి నీతిని కట్టడి చెయ్యడం సాధ్యం కాదు. తాత్కాలిక సంబరాలు తప్ప, అంతిమ విజయాలు లేని అవినీతిపై పోరాటాలివి. డా.డి.వి.జి.శంకరరావు, మాజీఎంపీ, పార్వతీపురం -
ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తా : నంబూరు శంకర్రావు
సాక్షి, అచ్చంపేట : సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో అత్యధిక మెజార్టీ సాధించి ఎమ్మెల్యే స్థానాన్ని దక్కించుకున్న వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నంబూరు శంకర్రావు తాను ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తానని, తన విజయానికి కారకులైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. గురువారం రాత్రి ఆయన సాక్షికి ప్రత్యేక ఇంటర్యూ ఇచ్చారు. ప్రశ్న: మీరు ఈ విజయాన్ని ఎలా భావిస్తున్నారు.? జవాబు: ఈ విజయం జగన్మోహనరెడ్డి విజయంగా భావిస్తున్నా.. ప్రజా విజయంగా భావిస్తున్నాను. జగన్ అలుపెరగకుండా 14 నెలలపాటు పాదయాత్ర చేయడం, ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకోవడం, ప్రతి సమస్యను జగన్ అయితేనే పరిష్కరించగలడని ప్రజలు నమ్మడం వల్లే నాకు ఈ గెలుపు సాధ్యపడింది. ప్రశ్న: నియోజకవర్గంలో మీరు గమనించిన సమస్యలేంటి, వాటిని ఎన్ని రోజుల్లో పరిష్కరిస్తారు? జవాబు: నియోజకవర్గంలో ముఖ్యంగా సాగునీరు, తాగునీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇసుక అక్రమ రవాణా వల్ల మండల కేంద్రాలకు వెళ్లే రహదారులన్నీ చిన్నాభిన్నమై నడిచేందుకు కూడా వీలు లేకుండా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వాటిన్నింటినీ వచ్చే ఆరు నెలల కాలంలో పరిష్కరించేందుకు కృషిచేస్తా. ప్రతి చివరి భూమికీ సాగునీరు అందేల చూస్తా. పూర్తికాని మరమ్మతుల్లో ఉన్న ఇరిగేషన్ స్కీములను క్రమబద్దీకరించే ప్రయత్నం చేస్తా. ప్రశ్న: మీ విజయానికి ముఖ్యమైన కారణాలేవి. జవాబు: జగన్ కష్టమే నా విజయం. గత 10 సంవత్సరాల కాలంలో నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి చెందలేదు. జన్మభూమి కమిటీలతో అక్రమాలు, మట్టి, ఇసుక దోపిడీలు జరిగాయి. ప్రజలు టీడీపీ పాలనపై విరక్తి చెందారు. మార్పు కోరుకున్నారు. జగన్మోహనరెడ్డిని సీఎంగా చూడాలనుకున్నారు. అందువల్లనే విజయం సాధించగలిగాను. ప్రశ్న: నియోజకవర్గాన్ని మీరు ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? జవాబు: రాజధాని పరిధిలో ఉన్నదనేగాని, పెదకూరపాడు నియోజకవర్గంలో ఒక్క పరిశ్రమ లేదు, యువతకు ఉద్యోగ అవకాశాలు లేవు. ముఖ్యంగా నిరుద్యోగ సమస్యకు పరిష్కారంగా నియోజకవర్గంలో ఒక్క పరిశ్రమని నిర్మించి నిరుద్యోగులందరికి ఉపాధి అవకాశాలను కల్పించాలనుకుంటున్నారు. పార్టీలకు అతీతంగా ప్రతి సంక్షేమ పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరవేయాలన్నదే నా ఆశయం. ప్రశ్న: రైతులకోసం ఏమైనా చేయాలనుకుంటున్నారా? జవాబు: ప్రతి రైతు భూమికి సాగునీరు అందించాలన్నదే నా ఆశయం. రైతులు పండించిన పంటను నిల్వ ఉంచుకునేందుకు నియోజకవర్గంలో ఒక్క కోల్డు స్టోరేజీ కుడా లేదు. వెంటనే కోల్డు స్టోరేజ్ ఏర్పాటుకు కృషి చేయాలనుకుంటున్నా. ప్రశ్న: ఆధ్యాత్మికంగా ఏం చేయాలనుకుంటున్నారు? జవాబు: అమరావతిలో అమరలింగేశ్వరస్వామి దేవాలయం ఉంది. అందువల్ల అమరావతి ఆధ్యాత్మిక నగరంగా మరింత తీర్చి దిద్దాలనుకుంటున్నాను. అదే విధంగా అచ్చంపేట మండలం, మాదిపాడును పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దాలనుకుంటున్నా. ప్రశ్న: నియోజకవర్గంలో ఏఏ సదుపాయాలు కల్పించుకుంటున్నారు? జవాబు: నియోజకవర్గంలోని అచ్చంపేట, అమరావతి మండలాలు కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో ఉన్నాయి. కృష్ణానది దాటాలంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డితో సంప్రదించి కృష్ణా, గుంటూరు జిల్లాలను కలుపుతూ కృష్ణానదిపై బ్రడ్జి నిర్మించేందుకు ప్రయత్నం చేస్తా. ప్రశ్న: చివరగా ప్రజలకు మీరు ఏమి చెప్పదలచారు? జవాబు: ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతాను. ఇంకా ఏదైనా సమస్య ఉంటే మా దృష్టికి తీసుకురండి. వైఎస్సార్ సీపీ, జగన్మోహనరెడ్డి, నాపై విశ్వాసం ఉంచినందుకు కృతజ్ఞతలు. -
యూటర్న్ తీసుకున్న మాజీ మంత్రి
సాక్షి, రంగారెడ్డి : మాజీ మంత్రి శంకర్రావు యూటర్న్ తీసుకున్నారు. కాంగ్రెస్ నుంచి టికెట్ దక్కకపోవడంతో ఆయన షాద్‌నగర్ స్థానంలో ఎస్పీ నుంచి నామినేషన్ దాఖలు చేసిన చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోటీపై మనసు మార్చుకున్నట్లు శంకర్రావు తెలిపారు. కాంగ్రెస్ నేతల విజ్ఞప్తి మేరకు పార్టీలోనే కొనసాగుతున్నట్లు ఆయన మంగళవారం ప్రకటించారు. మహాకూటమి బలపరిచిన టీడీపీ, కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తానని ఆయన వెల్లడించారు. నామినేషన్ సందర్భంగా కాంగ్రెస్‌పై శంకర్రావు తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. నలభైఏళ్లు పార్టీకి సేవచేసిన తనకు టికెట్ ఇవ్వలేదని, పార్టీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి టికెట్లు అమ్మకున్నారని ఆయన ఆరోపించారు. పార్టీ మారి 24 గంటలు కూడా కాకముందు ఇలా ప్లేటు ఫిరాయించడంతో ప్రజలు అవాక్కయ్యారు. కాంగ్రెస్ రెబల్స్‌గా నామినేషన్ దాఖలు చేసిన మరికొంత మంది నేతలు కూడా ఉపసంహరించుకుంటారని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. దీని కొరకు ఇప్పటికే నేతలను బుజ్జగించేందుకు అధిష్టానం దూతలను రంగంలోకి దింపినట్లు సమాచారం. -
కాంగ్రెస్‌ను ఎవరూ అంతం చేయలేరు
మాజీ మంత్రి శంకర్రావు సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పని అయిపోయిందని టీఆర్ఎస్ నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడటం సరికాదని, సాధారణ ఎన్నికలు వస్తే బలాన్ని చూపిస్తామని మాజీ మంత్రి పి.శంకర్రావు అన్నారు. మంగళవారం నాడిక్కడ విలేకరులతో మాట్లాడుతూ పార్టీలో ఎలా పనిచేయాలనేది సోనియాగాంధీ నిర్ణయిస్తారన్నారు. వచ్చే ఎన్నికల్లో షాద్‌నగర్ నుంచి పోటీ చేస్తానన్నారు. తిరుమల తిరుపతిలో వికలాంగులకు, వృద్ధులకు దైవదర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని హైకోర్టు జడ్జికి రాసిన లేఖను సుమోటోగా తీసుకోవడం సంతోషమని శంకర్రావు అన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
గరుగుబిల్లి : మండలంలోని పెద్దూరులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. స్థానిక ఎస్ఐ ఎస్.హరిబాబునాయుడు గురువారం అందించిన వివరాలిలా వున్నాయి. బుధవారం రాత్రి పెద్దూరు గ్రామానికి చెందిన తాబేలు శంకరరావు(26) గరుగుబిల్లి నుంచి తన స్వగ్రామమైన పెద్దూరు మోటారు సైకిల్‌పై వెళ్తున్న సమయంలో రాచప్ప చెరువు చివర ఉన్న కల్వర్టును బలంగా ఢీకొనడంతో తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందారు. ఈ మేరకు స్థానిక ఎస్ఐ కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. దర్యాప్తును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శంకరరావు మృతితో తల్లి రవణమ్మ, తాత గంగయ్యలు కన్నీరుమున్నీరయ్యారు. -
ప్రభుత్వాసుపత్రుల్లో ఈ–ఆఫీస్
జిల్లాలోని అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో ఈ ఆఫీస్ అమలు చేయాలని జిల్లా ఆసుపత్రుల సమన్వయాధికారి డాక్టర్, కె.శంకరరావు స్పష్టం చేశారు. శుక్రవారం డీసీహె^Œ ఎస్ కార్యాలయంలో ఆయన జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల సూపరింటెండెంట్లతో సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకరరావు మాట్లాడుతూ పేదలకు నాణ్యమైన వైద్య, సేవలు చికిత్సలు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. ఈ క్రమంలో ఆసుపత్రుల్లో సేవలు పొందుతున్న ప్రతి పేషెంట్ వ్యాధి, అందుతున్న సేవలు, వాడుతున్న మందుల వివరాలు కేస్ షీట్లో నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. ఈ వివరాలను ఆన్లైన్ చేయడం వల్ల రోగికి మరింత మెరుగైన చికిత్సలు అవసరమైన సందర్భాల్లో ఈ వివరాలు సహకరిస్తాయని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే పేదలకు తక్కువ ధరలకే మందులు అందించేందుకు ఆసుపత్రుల్లో అన్న సంజీవని మందుల షాపులు ఏర్పాటు చేయాలని, ఆసుపత్రుల్లో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు స్పఛ్ఛ ఆసుపత్రి అభియాన్ కార్యక్రమం అమలు చేయాలని సూచించారు.ఏలూరు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్, ఏవీఆర్.మోహన్‌తో పాటు జిల్లాలోని 18 ప్రభుత్వాసుపత్రుల సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. -
ప్రభుత్వాసుపత్రుల్లో ఈ–ఆఫీస్
జిల్లాలోని అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో ఈ ఆఫీస్ అమలు చేయాలని జిల్లా ఆసుపత్రుల సమన్వయాధికారి డాక్టర్, కె.శంకరరావు స్పష్టం చేశారు. శుక్రవారం డీసీహె^Œ ఎస్ కార్యాలయంలో ఆయన జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల సూపరింటెండెంట్లతో సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకరరావు మాట్లాడుతూ పేదలకు నాణ్యమైన వైద్య, సేవలు చికిత్సలు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. ఈ క్రమంలో ఆసుపత్రుల్లో సేవలు పొందుతున్న ప్రతి పేషెంట్ వ్యాధి, అందుతున్న సేవలు, వాడుతున్న మందుల వివరాలు కేస్ షీట్లో నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. ఈ వివరాలను ఆన్లైన్ చేయడం వల్ల రోగికి మరింత మెరుగైన చికిత్సలు అవసరమైన సందర్భాల్లో ఈ వివరాలు సహకరిస్తాయని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే పేదలకు తక్కువ ధరలకే మందులు అందించేందుకు ఆసుపత్రుల్లో అన్న సంజీవని మందుల షాపులు ఏర్పాటు చేయాలని, ఆసుపత్రుల్లో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు స్పఛ్ఛ ఆసుపత్రి అభియాన్ కార్యక్రమం అమలు చేయాలని సూచించారు.ఏలూరు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్, ఏవీఆర్.మోహన్‌తో పాటు జిల్లాలోని 18 ప్రభుత్వాసుపత్రుల సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. -
బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఇవ్వాలి: శంకరరావు
కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శంకరరావు డిమాండు చేశారు. దీనికోసం కేంద్ర ప్రభుత్వంపై బీసీ ఎంపీలు ఒత్తిడి తేవాలని సూచించారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు, బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు తదితర అంశాలపై తమ సంఘం పోరాడుతోందని చెప్పారు. బీసీ సబ్‌ప్లాన్ కూడా ఏర్పాటు చేయాలన్నారు. బీసీ ఎంపీలు పార్లమెంటులో నోరెత్తకపోతే వారిని బయట తిరగనివ్వబోమని హెచ్చరించారు. జనాభా ప్రాతిపదికన విద్య, ఉద్యోగ, రాజకీయ, సామాజిక రంగాల్లో బీసీలకు సమాన వాటా కల్పించాలని డిమాండ్ చేశారు. దేశంలో 2600 బీసీ కులాలుండగా, ఇప్పటివరకూ 2550 కులాల నుంచి ఎవరూ పార్లమెంటులోకి ప్రవేశించనేలేదని చెప్పారు. బీసీలకు రాజ్యాంగ బద్దమైన హక్కుల సాధన కోసం జాతీయ స్థాయిలో మిలిటెంట్ ఉద్యమాలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు. బీసీ కార్పొరేషన్‌కు ఏటా రూ.20 వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలని, ప్రతి బీసీ కుటుంబానికి రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకూ రుణాలు మంజూరు చేయాలని శంకరరావు డిమాండ్ చేశారు. -
తండ్రిని నరికి చంపిన తనయుడు
పోలీసుల అదుపులో నిందితుడు? పోతరాజుపల్లిలో దారుణం చిన్నచిన్న గొడవలు.. క్షణికావేశం.. వెరసి బంధాలు, బంధుత్వాలను లెక్క చేయడం లేదు. ఆ కోపంలో ప్రవర్తించిన తీరు ప్రాణాలపైకి తెస్తుండగా.. పచ్చని సంసారాల్లో చిచ్చు పెట్టే పరిస్థితి నెలకొంటోంది. అరుుతే, ఇక్కడ ఓ కొడుకు కారణమేమిటో తెలియకున్నా తండ్రి తలపై గొడ్డలితో బాదడంతో ఆయన కన్నుమూయగా.. మరో ఘటనలో దత్తత తీసుకుని కన్నబిడ్డలా పెంచి పోషించాడన్న విషయూన్ని మరిచిపోరుున మరో వ్యక్తి... తండ్రిని నెట్టివేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గీసుకొండ : చిన్నచిన్న కుటుంబ కలహాలు పెద్దవి కావడంతో ఆవేశానికి లోనైన తనయుడు ఏకంగా కన్నతండ్రిని గొడ్డలితో నరికి చంపిన దారుణ సంఘటన ఇది. వరంగల్ రెండో డివిజన్ పోతరాజుపల్లిలో బుధవారం రాత్రి 8 గంటలకు జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నారుు. పోతరాజుపల్లికి చెందిన దొమ్మాటి శంకర్రావు(62)కు భార్య లింగాబాయి, కుమారుడు రాజు ఉన్నారు. కొన్ని రోజుల క్రితం కుమారుడు రాజు భార్య గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయింది. కాగా, శంకర్రావు తల్లి వీరమ్మ కోసం ఇంట్లోనే షెడ్ వేసి పోషిస్తున్నాడు. ఈక్రమంలో కొంతకాలంగా తండ్రిని ఇబ్బంది పెడుతూ ఇష్టారాజ్యంగా వ్యవహ రిస్తున్న రాజు.. బుధవారం రాత్రి తల్లి లింగాబారుుతో కలిసి గొడ్డలితో తండ్రి శంకర్రావు తలపై మోదడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మామునూరు ఏసీపీ మహేందర్, గీసుకొండ సీఐ శ్రీనివాస్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి మార్చురీకి తరలించారు. శంకర్రావు కుమారుడు, భార్యను అదుపులోని తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. కాగా ఈ విషయమై గీసుకొండ సీఐ శ్రీనివాస్‌ను వివరణ కోరగా కుటుంబ కలహాల కారణంగా హత్య జరిగి ఉంటుందని, పూర్తి వివరాల కోసం దర్యాప్తు జరుపుతున్నామని పేర్కొన్నారు. -
మటన్ కర్రీ సరిగా వండలేదని భార్యకు నిప్పు
చికిత్స పొందుతూ బాధితురాలి మృతి కాటేదాన్ : మటన్ క ర్రీని రుచికరంగా వండలేదని ఓ తాగుబోతు భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. బాధితురాలు చికిత్సపొందుతూ ఆసుపత్రిలో మృతి చెందింది. మైలార్‌దేవ్‌పల్లి పోలీసుల కథనం ప్రకారం... పద్మశాలిపురం టీఎన్జీవోఎస్‌కాలనీలో సులోచన(25), శంకర్రావు షిండే దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి సంతోష(8) సంతానం. శంకర్రావు హమాలీగా పని చేస్తున్నాడు. ఈనెల 20న శంకర్రావు మటన్ తెచ్చి భార్యకు ఇచ్చి కూర వండమన్నాడు. తర్వాత బయటకు వెళ్లి మద్యం తాగి వచ్చిన అతను మటన్‌కర్రీని రుచిగా వండలేదని భార్యపై చిందులు తొక్కాడు. తప్పతాగి ఉన్న అతను తీవ్రఆగ్రహంతో ఊగిపోతూ సులోచనపై కిరోసిన్ పోసి నిప్పంటించి పారిపోయాడు. స్థానికులు మంటలను ఆర్పి సులోచనను 108లో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె గురువారం మధ్యాహ్నం మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు శంకర్రావు షిండేను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తల్లి మృతి చెందడం... తండ్రి జైలు పాలుకావడంతో వారి కుమారె ్త సంతోష అనాథగా మారింది. -
ఓడింది కాంగ్రెస్ కాదు...సర్వే సత్యనారాయణ
హైదరాబాద్ : వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఓడింది కాంగ్రెస్ పార్టీ కాదని, అభ్యర్థి సర్వే సత్యనారాయణ అని మాజీ మంత్రి, సీనియర్ నేత శంకర్రావు వ్యాఖ్యానించారు. ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ సర్వే స్థానికుడు కాకపోవడం వల్లే అతడిని ప్రజలు ఓడించారన్నారు. గత ఏడాది మల్కాజ్గిరి నుంచి పోటీ చేసిన సర్వే సత్యనారాయణకు డిపాజిట్ కూడా దక్కలేదని శంకర్రావు ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాగా కాంగ్రెస్‌కు 1,56,311 ఓట్లు వచ్చిన విషయం తెలిసిందే. 2014 సాధారణ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కంటే ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు లక్షకుపైగా ఓట్లు తగ్గాయి. దీనిపై టీపీసీసీ నేతలు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇంతటి దారుణమైన ఫలితాలను ఊహించలేకపోయామని, ఇది తమను షాక్‌కు గురి చేసిందని టీపీసీసీ, సీఎల్పీ ముఖ్యులు వ్యాఖ్యానిస్తున్నారు. కాంగ్రెస్‌కు గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లలో సుమారు 2.7% టీఆర్ఎస్ వైపు మళ్లినట్టు ఎన్నికల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. -
హిమాన్షు, శంకర్ ఓటమి
కోల్‌కతా: జాతీయ సీనియర్ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్‌లో రెండో రోజు హిమాన్షు జైన్ (తెలంగాణ), శంకర్ రావు (ఆంధ్రప్రదేశ్) తమ లీగ్ మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూశారు. మంగళవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో శంకర్ రావు 0-3 ఫ్రేమ్‌ల తేడాతో ఆమీర్ హుస్సేన్ (బెంగాల్) చేతిలో; హిమాన్షు జైన్ 2-3 ఫ్రేమ్‌ల తేడాతో ధ్వజ్ హారియా (పీఎస్‌పీబీ) చేతిలో ఓటమి చెందారు. -
ఆశించిన స్థాయిలో టీఆర్ఎస్ గెలవలేదు: శంకర్ రావు
కంటోన్మెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఆశించిన స్థానాలు గెలవలేదని మాజీ మంత్రి శంకర్ రావు ఎద్దేవా చేశారు. కంటోన్మెంట్ లో ఎప్పుడూ అధికార పార్టీ అభ్యర్థులే గెలుపొందే వారన్నారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి వెళ్లినవారే మళ్లీ గెలిచారన్నారు. కంటోన్మెంట్ అసెంబ్లీ టికెట్ తనకిచ్చి ఉంటే తప్పకుండా గెలిచేవాడినన్నారు. ఒకవేళ అలా జరిగితే కంటోన్మెంట్ పరిస్థితి మరోలా ఉండేదన్నారు. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ అధిస్ఠానం తనను పీసీసీ ఛీఫ్ చేయాలని కొందరు కాంగ్రెస్ నేతలు కోరుకుంటున్నారన్నారు. ఎన్నికల సమయంలో దళితుడిని సీఎం చేస్తానన్న సీఎం కేసీఆర్ ఎస్సీల సంక్షేమం గురించి ఆలోచించాలని హితవు పలికారు. -
శంకర్రావుపై సీబీఐ విచారణ జరిపించాలి
హైదరాబాద్: గ్రీన్ ఫీల్డ్ ప్లాట్స్ కబ్జాకు పాల్పడుతున్న మాజీ మంత్రి శంకర్రావుపై వెంటనే సీబీఐ విచారణ జరిపించి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని గ్రీన్ ఫీల్డ్ ప్లాట్స్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు చంద్రశేఖర్ ప్రభుత్వాన్ని కోరారు. శనివారం ఆయన బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. మాజీ మంత్రి శంకర్రావు సోదరుడు దయానంద ఇటీవల గూండాలతో వచ్చి ఎనిమిది ప్లాట్లను ఆక్రమించి ప్రహరీ నిర్మించాడని, ఈ విషయమై నేరెడ్మెట్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. శంకర్రావును అరెస్టు చేయాలని మల్కాజ్గిరి పదో మెట్రోపాలిటన్ కోర్టు ఆదేశించినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గురుకుల ట్రస్టు భూముల విషయంలో చొరవ చూపిన విధంగానే గ్రీన్ ఫీల్డ్ కబ్జాల విషయమై చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో ప్లాట్స్ ఓనర్స్ సత్యనారాయణ మూర్తి, ఎంవీ నరిసింహరావు, కేశవమ్మ, గోవిందరాజుశర్మ, సీహెచ్ అంజయ్యతోపాటు గ్రీన్ ఫీల్డ్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు రాంబాబు, నాగరాజన్, ఇనాయక్ హాసన్, విజయానంద తదితరులు పాల్గొన్నారు. -
మెకానిక్ ఆత్మహత్యపై ఓఎస్డీతో విచారణ
గుంటూరు: శంకర్ అనే మెకానిక్ ఆత్మహత్య కేసులో హైదరాబాద్ లాలపేట పోలీసులపై వచ్చిన ఆరోపణలపై గుంటూరు జిల్లా ఎస్పీ విచారణకు ఆదేశించారు. విచారణాధికారిగా ఓఎస్డీ జగన్నాథరెడ్డిని నియమించారు. విజయవాడ విజేత ఆస్పత్రిలో విచారణ కొనసాగుతోంది. కాగా లాలాపేట పోలీసులపై కేసు నమోదు చేసినట్లు మంగళగిరి రూరల్ ఎస్ఐ అంకమ్మరావు తెలిపారు. లాలాపేట సీఐ వినయ్ కుమార్, ఎస్ఐ వీరాస్వామి, ఏఎస్ఐ నాయక్, కానిస్టేబుల్ మజారుల్లాలపై మృతుడు శంకరరావు భార్య గుణవాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పోలీసుల వేధింపులతో కార్మికుడి ఆత్మహత్య
మంగళగిరి రూరల్: పోలీసులు తనను దొంగగా చిత్రీకరించి అవమానించడాన్ని తట్టుకోలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం సాయంత్రం సంచలనాన్ని కలిగించింది. వివరాలిలా ఉన్నాయి... విజయవాడ కృష్ణలంకకు చెందిన నడకుదిటి శంకరరావు(40) ఆటోనగర్‌లో ఫౌండ్రీ పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. గత నెల 29 (మంగళవారం)న తన స్నేహితుడు ఎల్.వెంకటేశ్వరరావు దగ్గర ద్విచక్ర వాహనాన్ని తీసుకుని వ్యాపారం నిమిత్తం గుంటూరు నగరానికి వెళ్లాడు. వ్యాపార పనులు ముగించుకుని రాత్రి వేళ కావడంతో ఓ మద్యం దుకాణం వద్ద ద్విచక్ర వాహనాన్ని నిలిపాడు. ఇంతలో అక్కడికి లాలాపేట పోలీసులు చేరుకుని శంకరరావును ద్విచక్ర వాహనాలు కాగితాలు చూపించాలని కోరారు. ఇది తన స్నేహితుడి బండి అని, కాగితాలు తెప్పిస్తానని చెప్పాడు. అయినా వినిపించుకోని పోలీసులు శంకరరావును, ద్విచక్ర వాహనాన్ని స్టేషన్‌కు తీసుకువెళ్లారు. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో శంకరరావు స్నేహితుడు వెంకటేశ్వరరావు ద్విచక్ర వాహనానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు తీసుకువెళ్లి పోలీసులకు చూపించాడు. ద్విచక్ర వాహనాన్ని ఇచ్చేందుకు పోలీసులు రూ.5వేలు అడిగారు. అంత డబ్బు ఇచ్చుకోలేనని, ఇప్పుడు తనవద్ద లేవని శంకరరావు విన్నవించుకున్నాడు. పక్కనే వున్న స్నేహితుడు వెంకటేశ్వరరావు తన వద్ద వున్న రూ. 3,500 పోలీసులకు ఇచ్చినా శంకరరావును విడిచి పెట్టకపోగా ద్విచక్ర వాహనాన్ని కూడా ఇవ్వలేదు. అదే రోజు రాత్రి 11 గంటల సమయంలో శంకరరావు స్నేహితుడు వెంకటేశ్వరరావు చేసేది లేక తిరిగి విజయవాడకు వచ్చాడు. బుధవారం ఉదయం శంకరరావు బావగారైన రామ్మోహనరావుతో కలసి మళ్లీ లాలాపేట స్టేషన్‌కు వెళ్లి పోలీసులను బతిమిలాడారు. కనికరించని పోలీసులు కేసు నమోదు చేసి ఆగస్టు ఆరో తేదీ కోర్టుకు హాజరుకావాలని చెప్పి వదిలిపెట్టారు. దీంతో మనస్థాపం చెందిన శంకరరావు మండలంలోని యర్రబాలెం బసవతారకనగర్‌లోని తన స్నేహితురాలి ఇంటికి బుధవారం రాత్రి వచ్చి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అస్వస్థతతో ఉన్న ఆయన్ను స్థానికులు చికిత్స నిమిత్తం మంగళగిరిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే శంకరరావు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందాడు. మృతుడి భార్య గుణవాణి ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు విజయవాడ ఆస్పత్రికి చేరుకుని మృతుని జేబులోని సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లాలాపేట పోలీసులపై కేసు నమోదు లాలాపేట పోలీసులపై కేసు నమోదు చేసినట్లు మంగళగిరి రూరల్ ఎస్ఐ అంకమ్మరావు శుక్రవారం రాత్రి తెలిపారు. లాలాపేట సీఐ వినయ్‌కుమార్, ఎస్ఐ కె.వీరాస్వామి, ఏఎస్ఐ డి.నాయక్, కానిస్టేబుల్ మజారుల్లాలపై శంకరరావు భార్య గుణవాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
భద్రత పునరుద్దరించండి: కేసీఆర్ ను కోరిన శంకర్ రావు
హైదరాబాద్: తనకు భద్రత పునరుద్ధరించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మాజీ మంత్రి శంకర్ రావు విజ్ఞప్తి చేశారు. శనివారం సాయంత్రం కేసీఆర్ ను శంకర్ రావు కలిశారు. తనపై అకారణంగా కేసులు పెట్టారని కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు. అక్రమంగా తనపై పెట్టిన కేసుల్ని తొలగించాలని కేసీఆర్‌ను శంకర్ రావు కోరారు. గ్రీన్ ఫీల్స్ భూ వివాదంలో శంకర్ రావుపై కేసు నమోదు చేశారు. గత ప్రభుత్వ హయాంలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అక్రమంగా వేల కోట్లు సంపాదించుకున్నారంటూ ఆరోపణలు చేసిన శంకర్ రావు.. డీజీపీపై విమర్శలు సంధించిన సంగతి తెలిసిందే. -
గిదేందే శంకరన్న ....
అధిష్టానానికి వీర విధేయుడిగా పేరుగాంచిన శంకర్రావు అలియాస్ శంకరన్నకు కాంగ్రెస్ పార్టీ హ్యాండిచ్చింది. తనతో పాటు తన కుమార్తె సుస్మితకు టికెట్టు కోసం ఆయన చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. టిఆర్ఎస్ నుండి వచ్చిన వివేక్, వినోద్లకు టికెట్టు ఇచ్చి, శంకర్రావును దూరం పెట్టి చెయ్యి మార్కు చూపించి షాక్ ఇచ్చింది. దాంతో ఆరుసార్లు కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన తనకు టికెట్ నిరాకరించడంపై గుస్సాగా ఉన్న ఆయన తన అనుచరులతో కలిసి భవిష్యత్ కార్యచరణను రూపొందించుకోవటంలో బిజీగా ఉన్నారు. ఇక తమకు గిట్టనివాళ్లపై కేసులు పెట్టించటాని కాంగ్రెస్ అధిష్టానం శంకర్రావును ఆటలో అరటిపండుగా ఉపయోగించుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అధిష్టానం అనుగ్రహంతో మంత్రి పదవి అలంకరించిన శంకర్రావు తననోటికి వచ్చినట్టు మాట్లాడ్డం, ఇష్టమొచ్చినట్టు వ్యవహరించి అధిష్టానానికి తలనొప్పిగా మారటంతో ఆయన్ని పార్టీ పదవి నుంచి పీకేసి పక్కన కూర్చోపెట్టింది. దాంతో సోనియమ్మ భజన చేయటమే కాకుండా శంక్రరావు అవకాశం ఉన్నప్పుడల్లా తన విధేయతను చాటుకునేవారు. అంతటితో ఆగకుండా ఏకంగా ఆమెకు గుడి కూడా కట్టించేశారు. అంతేనా... సోనియా గాంధీని తెలంగాణ తల్లిగా అభివర్ణిస్తూ తెలంగాణ రాష్ట్రానికి సోనియా పేరు పెట్టాలంటూ శంకర్రావు ప్రతిపాదన కూడా తెచ్చారు. అయితే శంకరన్నని కాంగ్రెస్ అధిష్ఠానం సరిగ్గా అర్థం చేసుకోవడం లేదోమో అనిపిస్తోంది. తనకు సీటు ఇవ్వకపోయినా పర్లేదు మా అమ్మాయికైనా ఇవ్వండని శంకర్రావు వినయంగా విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. రాజకీయాలలో అతి చేస్తే పరిణామాలు ఎలా వుంటాయన్నదానికి శంకర్రావు ఇప్పుడు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. దాంతో గదేందే శంకరన్న సీన్ రివర్స్ అయ్యిందని చెవులు గుసగుసలాడుకుంటున్నారు. -
ఆదాల,సీఎం కిరణ్‌ల పై మండిపడ్డ శంకర్రావు
-
‘సర్వే’పై శివారు ఎమ్మెల్యేల శివాలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణపై శివారు ఎమ్మెల్యేలు కారాలు మిరియాలు నూరుతున్నారు. ఆయన వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న శాసనసభ్యులు తాడోపేడో తేల్చుకునేందుకు ఢిల్లీ బాట పట్టారు. మల్కాజిగిరి పార్లమెంటు స్థానం నుంచి ‘సర్వే’కు మరోసారి టికెట్ ఇవ్వవద్దనే డిమాండ్‌తో పార్టీ పెద్దలను కలవాలని నిర్ణయించారు. మల్కాజిగిరి లోక్‌సభ స్థానం పరిధిలోని ఐదుగురు శాసనసభ్యులు సర్వే సత్యనారాయణపై అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు హస్తిన వెళుతున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ అపాయింట్మెంట్ను కోరుతూ లేఖ రాశారు. మాజీ మంత్రి శంకర్రావు సహా ఎమ్మెల్యేలు కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, బండారి రాజిరెడ్డి, ఆకుల రాజేందర్, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఈ మేరకు డిగ్గీరాజాకు సంయుక్తంగా లేఖ రాశారు. అధికారికంగా దిగ్విజయ్ అపాయింట్మెంట్ ఖరారు కానప్పటికీ, ఆయనకు అందుబాటులో ఉండేందుకు ఎమ్మెల్యేలు శంకర్రావు, రాజిరెడ్డి ఇప్పటికే అక్కడ మకాం వేశారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, ఆకుల రాజేందర్ కూడా శుక్రవారం రాత్రి దేశ రాజధానికి పయనమయ్యారు. కాగా, రంగారెడ్డి జిల్లాలో పార్టీ వ్యవహారాలు, మల్కాజిగిరి పార్లమెంటరీ సీటు పరిధిలో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులు, పార్టీ పరిస్థితిని తమతో చర్చిస్తామని లేఖలో పేర్కొన్నప్పటికీ, కేంద్ర మంత్రి సర్వేపై ఫిర్యాదు చేసే అంశమే ప్రధానంగా కనిపిస్తోంది. కొన్నాళ్లుగా సర్వేపై తిరుగుబాటు జెండా ఎగురవేసిన ఎమ్మెల్యేలు... ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన కు ఈ సారి లోక్‌సభ టికెట్ రాకుండా ప్రయత్నించాలనే నిర్ణయానికి వచ్చారు. అవినీతి, గ్రూపు రాజకీయాలను కేంద్ర మంత్రి ప్రోత్సహిస్తున్నట్లు ఎమ్మెల్యేలు కొంతకాలంగా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. స్థానికంగా ఆయనపై ఉన్న వ్యతిరేకత కూడా తమ గెలుపు అవకాశాలపై ప్రభావం చూపుతుందనే భయం వీరిలో నెలకొంది. -
కోలాహలంగా ఎస్ఎస్కే సమాజ్ స్వర్ణోత్సవాలు
రాంగోపాల్‌పేట్, న్యూస్‌లైన్: శ్రీ సోమవంశ సహస్రార్జున క్షత్రియ సమాజ్ సికింద్రాబాద్ శాఖ స్వర్ణోత్సవాలు ఆదివారం హరిహరకళాభవన్‌లో కోలాహలంగా నిర్వహించారు. వందల మంది సమాజ్‌కు చెందిన మహిళలు, పురుషులు, పిల్లలతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్నారుల ఆటాపాటలతో, డ్యాన్సులతో అలరించారు. రాంగోపాల్‌పేట్‌లోని సమాజ్ కార్యాలయం నుంచి వందలాది మంది మహిళలు హారతులు చేతపట్టుకుని ర్యాలీ నిర్వహించారు. ఎంజీరోడ్, సుభాష్‌రోడ్, ఆర్పీరోడ్, బాటా గుండా హరిహరకళాభవన్ వరకు ర్యాలీ కొనసాగింది. అలాగే అర్జునుడి చిత్రపటాన్ని రథంలో ఉంచి కోలాహలంగా ఊరేగింపు చేశారు. అలాగే వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు, బహుమతులు అందించారు. మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సికింద్రాబాద్ ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్, ఎమ్మెల్యే పీ శంకర్రావులు హాజరై ఎస్కేఎస్ సమాజ్‌కు అండగా ఉంటామని అన్నారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ వీరిని బీసీ డీ నుంచి ఏ కులంలోకి మార్చాలని డిమాండ్ చేశారు. ఈ కులానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.500 కోట్ల నిధులు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సనత్‌నగర్ కో ఆర్డినేటర్ శీలం ప్రభాకర్, కార్పొరేటర్లు కిరణ్మయి, ముద్దం నరసింహాయాదవ్, సమాజ్ అధ్యక్షుడు శ్రావణ్‌కుమార్, ప్రతినిధులు పాల్గొన్నారు. -
కిరణ్ పార్టీలో చేరితే కైలాసం: శంకర్రావు
-
నా భర్తకు న్యాయం చేయండి
= గడ్డం శ్రీరామ్ భార్య స్వరూప = న్యాయ పోరాటం చేస్తాం : శంకర్రావు భోలక్‌పూర్, న్యూస్‌లైన్: ఒక కరపత్రాన్ని రూపొందించారని తన భర్తపై విచక్షణారాహితంగా దాడి చేశారని, ఆస్పత్రి పాలైన తన భర్తకు న్యాయం చేసి బాధ్యులను చట్టరీత్యా శిక్షించాలని ఉస్మానియా యూనివర్శిటీ ఎల్ఎల్బి విద్యార్థి, తెలంగాణ విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం శ్రీరామ్ భార్య స్వరూప డిమాండ్ చేశారు. సోమవారం రాత్రి మాజీ మంత్రి, ఎమ్మెల్యే శంకర్రావుతో కలిసి ఆయన నివాసంలో స్వరూప మీడియాతో మాట్లాడారు. తన భర్త రూపొందించిన కరపత్రంలో అభ్యంతరాలున్నాయని మంత్రి శ్రీధర్‌బాబు ఈ దాడులు చేయించారని ఆమె ఆరోపించారు. ఎటువంటి అరెస్టు వారెంట్ లేకుండా తన భర్తను రెండు రోజుల పాటు వేధించారన్నారు. కరీంనగర్ టూ టౌన్ పోలీసుస్టేషన్ సీఐను సస్పెండ్ చేయడంతో పాటు ఈ దాడి వెనుక ఉన్న పెద్ద వారిని సైతం విచిడిపెట్టవద్దని, వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికే హైకోర్టులో పిటీషన్ వేశామని, మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ఆమె తెలిపారు. బాధ్యులపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కమిషనర్‌కు ఫిర్యాదు కూడా చేశామని స్వరూప చెప్పారు. ఈ సందర్భంగా శంకర్రావు మాట్లాడుతూ ఈ ఘటనలో ఎంత పెద్ద వారున్నా, వారిని వదిలే ప్రశక్తి లేదని, చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
నన్ను ఆగంతకులు వెంటాడారు
మాజీ మంత్రి శంకర్రావు ఆరోపణ సాక్షి, హైదరాబాద్: తనను ఎవరో వెంటాడుతున్నారని, తనకు జెడ్ కేటగిరీ రక్షణ కల్పించాలని మాజీ మంత్రి శంకర్రావు డిమాండ్ చేశారు. శంకర్రావు సోమవారం రాత్రి తన కుమార్తె సుస్మితతో కలిసి విలేకరులతో మాట్లాడారు. సోమవారం మధ్యాహ్నం కంటోన్మెంట్ బోర్డు నుంచి మంకీ క్యాప్‌లు ధరించిన ఐదుగురు ఆగంతకులు తనను కారులో వెంబడించారని ఆరోపించారు. ఏపీ 9 టీఆర్ నెంబరుతో గల గ్రే కలర్ ఫార్చూనర్ కారులో ఆగంతకులు ఉన్నట్లు తెలిపారు. సీఎం ఎర్రచందనం కేసు, ఎమ్మార్ ప్రాపర్టీస్, రహేజా ప్రాపర్టీస్, గాలి జనార్దన్‌రెడ్డి, 26 జీవోలు తదితర అక్రమాలను తాను వెలుగులోకి తెచ్చానని... అది నచ్చనివారెవరో తనను వెంబడించారని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో తనకు జెడ్ కేటగిరి సెక్యూరిటీ కల్పించాలని డిమాండ్ చేశారు. తన తండ్రిని హతమొందించేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారని, ఆయనకేమైనా జరిగితే సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిదే బాధ్యత అని శంకర్రావు కుమార్తె సుస్మిత సోమవారం రాత్రి మారెడ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. -
రాహుల్ ప్రధాని అవుతారు
-
సోనియాకు గుడి కట్టిస్తున్న శంకర్రావు
-
కిరణ్ సాధించిందేమీ లేదు: శంకర్రావు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రిగా ఉన్న మూడేళ్ల కాలంలో పార్టీని భూస్థాపితం చేయడం తప్ప కిరణ్ కుమార్ రెడ్డి సాధించిందేమీలేదని రాష్ట్ర మాజీ మంత్రి శంకర్రావు అన్నారు. సోమవారం ఆయన సీఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో 51 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగ్గా, 49 చోట్ల కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందన్నారు. -
నరసాపురం, రామచంద్రాపురంలో కాంగ్రెస్ గెలుపు టీడీపీ వల్లే
హైదరాబాద్: ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన మూడేళ్ల కాలంలో పార్టీని భూస్థాపితం చేయడం తప్ప ఆయన సాధించిందేమిలేదని మాజీ మంత్రి శంకర్రావు అన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొత్తం 51 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగితే 49 చోట్ల పార్టీ ఓటమి పాలయిందన్నారు. పార్టీ గెలిచిన నరసాపురం, రామచంద్రాపురంలోనూ టీడీపీ, పీఆర్పీ, కాంగ్రెస్ కాంబినేషన్ కారణంగానే గెలుపు దక్కిందన్నారు. సోమవారం కాంగ్రెస్ శాసనసభాపక్ష కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ ముఖ్యమంత్రిని ఎంత తర్వగా తపిస్తే పార్టీ అంతగా బలం పుంజుకుంటుందన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌పై నాలుగు రోజుల క్రితం శంకర్రావు అవిశ్వాసం ప్రకటించిన విషయం తెలిసిందే. శాసనసభ బిజినెస్ రూల్స్ 75 (1) ప్రకారం ముఖ్యమంత్రిపై, ఆయన మంత్రివర్గంపై తాను అవిశ్వాసం ప్రకటిస్తున్నట్టు నోటీసులో పేర్కొన్నారు. వీలైనంత త్వరగా అసెంబ్లీని సమావేశ పరిచి, తన నోటీసుపై తదుపరి చర్యలు తీసుకోవాలన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి, శంకర్రావు, అవిశ్వాసం, Kiran Kumar Reddy, Legislative Assembly, Shankar Rao, no-confidence motion -
కిరణ్‌పై అవిశ్వాసానికి శంకర్రావు నోటీసు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యే పి. శంకర్రావు అవిశ్వాసం ప్రకటించారు. రాష్ట్ర శాసనసభ కార్యదర్శికి ఈమేరకు నోటీసు ఇచ్చారు. శాసనసభ బిజినెస్ రూల్స్ 75 (1) ప్రకారం ముఖ్యమంత్రిపై, ఆయన మంత్రివర్గంపై తాను అవిశ్వాసం ప్రకటిస్తున్నట్టు నోటీసులో పేర్కొన్నారు. వీలైనంత త్వరగా అసెంబ్లీని సమావేశ పరిచి, తన నోటీసుపై తదుపరి చర్యలు తీసుకోవాలన్నారు. అసెంబ్లీ కార్యదర్శికి తాను ఇచ్చిననోటీసును బుధవారం కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) కార్యాలయంలో విలేకరులకు విడుదల చేశారు. సీఎం కిరణ్ రాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని, కాంగ్రెస్ అధిష్టాన వర్గం విశ్వాసాన్ని కోల్పోయారన్నారు. నెహ్రూ, గాంధీ కుటుంబానికి అత్యంత నమ్మకస్తుడుగా ఈ నోటీసుకు తనంతట తానుగా సిద్ధపడినట్టు శంకర్రావు చెప్పారు. మంత్రిపదవినుంచి బర్తరఫ్ చేసి ముఖ్యమంత్రి తనను మానసికంగా హింసించారన్నారు. టీడీపీ, వైఎస్ఆర్సీపీ, ఎంఐఎం, బీజేపీ వంటి పార్టీల సభ్యులతో పాటు శాసన సభ్యులంతా తనకు మద్దతు ఇస్తారని విశ్వసిస్తున్నానని, మద్దతు కోసం ఎమ్మెల్యేలకు లేఖ రాస్తానని చెప్పారు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా అవిశ్వాస తీర్మానం కోసం నోటీసును గవర్నర్‌కు కూడా పంపుతానన్నారు. అనంతరం నోటీసును ఫ్యాక్స్ ద్వారా గవర్నర్‌కు పంపారు. -
నేతన్నలపై చిన్న చూపు
కనిగిరి, న్యూస్‌లైన్: కనిగిరి ప్రాంత చేనేత కార్మికులపై నేతలు, అధికారులు చిన్నచూపు చూస్తున్నారు. చేనేత కార్మికుల అభివృద్ధికి రూ.60 లక్షల ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్న అప్పటి చేనేత జౌళి శాఖ మంత్రి శంకర్రావు హామీ నీటి మీదరాతగానే మారింది. 2011 జనవరి 22న శంకర్రావు కనిగిరిలో పర్యటించారు. చేనేత కార్మికులతో సమావేశమయ్యారు. వారి సంక్షేమం కోసం రూ.60 లక్షలతో ప్రత్యేక ప్యాకేజీ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. నెల రోజుల్లోపు అమలు చేసి ఆదుకుంటామని చెప్పారు. ఈమేరకు అప్పటి ఏడీఏను ఆదేశించారు. కానీ మూడేళ్లు కావస్తున్నా అతీ గతి లేదు. శంకర్రావు మారి ఆ శాఖకు మరో మంత్రి ప్రసాద్ కుమార్ వచ్చి రెండేళ్లు కావస్తున్నా వాటిపై దృష్టి సారించలేదు. అదే వేదిక పై ఉన్న ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి కూడా పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. ఇదిలా ఉండగా గత జూన్ నెలలో చేనేత కార్మికులకు హామీలేని రుణాలిస్తున్నట్లు ఎమ్మెల్యే ఉగ్ర హడావుడి చేశారు. ఈ ఏడాది జిల్లాలో 2,020 మందికి రూ.6 కోట్లు హామీలేని రుణాలిచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికారులు వెల్లడించారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ ఆయా బ్యాంకుల పరిధిలోని చేనేతలకు తప్పక హామీలేని రుణాలివ్వాలని ఆదేశించారు. ఒక్కొక్కరికి రూ. 30 వేలు రుణం, రూ. 4,500 సబ్సిడీ ఇస్తున్నట్లు ప్రకటించారు. దీంతో కనిగిరి ప్రాంతంలోని చేనేత కార్మికులు ఎంతో ఆశతో పోటీ పడి దరఖాస్తు చేసుకున్నారు. సుమారు 1,500 దరఖాస్తులు వచ్చాయి. కానీ నేటికి ఒక్కరికీ రుణం అందలేదు. బ్యాంకర్ల విముఖత: పాలకుల, అధికారుల నిర్లక్ష్యం కనిగిరి ప్రాంత చేనేతలకు శాపంగా మారింది. వేదికలపై మాటలు చెప్పే నాయకులు వాటిని అమలు చేసేందుకు ప్రయత్నించడం లేదనే విమర్శలున్నాయి. చీరాల నియోజకవర్గంలోని కొంతమందికి తప్ప మిగతా ప్రాంతాల్లోని చేనేతలకు బ్యాంకర్లు హామీ లేని రుణాలు ఇవ్వలేదు. కనిగిరి నియోజకవర్గ పరిధిలోని ఏ బ్యాంకర్ కూడా చేనేతలకు హామీ లేని రుణాలిచేందుకు ముందుకు రావడం లేదు. బ్యాంక్‌ల చుట్టూ రోజూ తిరుగుతున్నా స్పందించడం లేదని చేనేత సంఘ నాయకులు చెప్తున్నారు. కనిగిరి చేనేతలపై చిన్న చూపా... జిల్లాలో చేనేత కార్మికులు చీరాల తర్వాత బేస్తవారిపేట, కనిగిరి ప్రాంతాల్లోనే అధికంగా ఉన్నారు. అధికారిక లెక్కల ప్రకారం కనిగిరి ప్రాంతంలో 1500 మగ్గాలున్నా యి. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో సుమారు 47 గ్రామాల్లో చేనేత కార్మికులు జీవిస్తున్నారు. దాదాపు 2వేలకు పై గా కుటుంబాలున్నాయి. 10 సొసైటీలకు సంబంధించి 2 వేల మంది సభ్యులు ఉన్న ట్లు అంచనా. వీరికి ఆర్థిక వనరులు, ప్రభు త్వ సహాయం లేక, బ్యాంక్ రుణాలు అందక నానా అవస్థలు పడుతున్నారు. ప్రత్యామ్నాయ బాటలో చేనేతలు.. కనిగిరి ప్రాంతంలోని చేనేత కార్మికులు నూటికి 70 మంది ప్రత్యామ్నాయ కూలీలుగా మారి జీవిస్తున్నారు. ఇప్పటికే సగం మంది వలస బాటపట్టి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. మరి కొంత మంది బేల్దారి పని, మట్టి పని, మిక్చర్ బండ్లను, ఐస్ బండ్లను వేసుకుంటూ బతుకు తున్నారు. దేవాంగనగర్, యడవల్లి, వాగుపల్లి గ్రామాల్లో చేనేతల గృహాలు వలసలతో ఖాళీగా దర్శనమిస్తున్నాయి. -
సీఎం అక్రమంగా వేలకోట్లు సంపాదించారు: శంకర్రావు
శంకరన్న మళ్లీ తెరమీదకు వచ్చారు. ఈసారి నేరుగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపైనే తన అస్త్రాన్ని సంధించారు. సీఎం అక్రమంగా వేల కోట్లు సంపాదించుకున్నారంటూ కంటోన్మెంట్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత శంకర్ రావు ఆరోపణలు గుప్పించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినా తమకు అభ్యంతరం లేదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గతంలోనే కాంగ్రెస్ అధిష్టానానికి మాట ఇచ్చారని ఆయన అన్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన సీమాంద్ర ప్రాంతంలో జరుగుతున్న సమైక్య ఉద్యమాన్ని చూసి.. విభజన వద్దని చెబుతున్నారని, ఆయన కేవలం తన సొంత ప్రయోజనాలు మాత్రమే చూసుకుంటున్నారని అన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడి, వేల కోట్ల రూపాయల ఆస్తులను అక్రమంగా సంపాదించుకున్న ముఖ్యమంత్రి కిరణ్‌కు అసలు ఆ పదవిలో కొనసాగే అర్హత లేదని శంకర్ రావు మండిపడ్డారు. -
మజ్లీస్ మద్దతు కాంగ్రెస్‌కే: శంకర్రావు
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీకే మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) మద్దతు ఇస్తుందని మాజీ మంత్రి శంకర్రావు అన్నారు. ఆయన శుక్రవామిక్కడ మీడియాతో మాట్లాడుతూ బీజేపీ నేతలకు తెలంగాణపై మాట్లాడే హక్కు లేదని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు వారికి తెలంగాణ గుర్తుకు రాలేదా అని శంకర్రావు ప్రశ్నించారు. తెలంగాణలో ఆత్మహత్యలకు బీజేపీయే కారణమని ఆయన ఆరోపించారు. కాగా రెండు రోజుల క్రితం రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించాలని కోరుకుంటున్న మజ్లిస్ అధినేత సోనియా ఆహ్వానంపైనే ఆమె నివాసంలోనే కలిసి రాష్ట్ర విభజన నిర్ణయాన్ని గురించి చర్చించినట్లు కాంగ్రెస్ వర్గాల ద్వారా తెలిసింది. హైద్రాబాద్ రాజధానిగా తెలంగాణలోని పది జిల్లాలతో ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానించినప్పటికీ రాయలసీమలోని కర్నూలు, అనంతపురం జిల్లాలను కూడా కలిపి 12 జిల్లాలతో రాయల తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేందుకున్న అవకాశాలను కూడా ఆంటోనీ కమిటీ పరిశీలిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. -
ఎర్రచందనం కేసులో సీఎంకు ఊరట
ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించి మాజీ మంత్రి పి.శంకర్రావు దాఖలుచేసిన వ్యాజ్యం నుంచి ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డికి ఉపశమనం లభించింది. ముఖ్యమంత్రి సహా పలువురిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతివాదులుగా పేర్కొంటూ శంకర్రావు వేసిన పిటిషన్‌ను గురువారం జస్టిస్ హెచ్.ఎల్.దత్తు, జస్టిస్ ఎం. వై.ఇక్బాల్‌తో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం విచారించింది. పిటిషన్‌ను పరిశీలించిన న్యాయమూర్తులు.. సీఎం కిరణ్ సహా నలుగురి పేర్లను ప్రతివాదుల జాబితా నుంచి తొలగించారు. రాష్ట్ర ప్రభుత్వానికి, ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీచేస్తూ నెల రోజుల్లోగా జవాబివ్వాలని ధర్మాసనం ఆదేశించింది. -
వేధింపుల కేసులో శంకర్రావు అరెస్ట్
-
మాజీ మంత్రి శంకర్రావు అరెస్ట్
-
బ్లాక్మెయిల్ చేస్తున్న శంకర్రావు:డిజిపి