సాక్షి, రంగారెడ్డి : మాజీ మంత్రి శంకర్‌రావు యూటర్న్ తీసుకున్నారు. కాంగ్రెస్ నుంచి టికెట్ దక్కకపోవడంతో ఆయన షాద్‌నగర్ స్థానంలో ఎస్పీ నుంచి నామినేషన్ దాఖలు చేసిన చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోటీపై మనసు మార్చుకున్నట్లు శంకర్‌రావు తెలిపారు. కాంగ్రెస్ నేతల విజ్ఞప్తి మేరకు పార్టీలోనే కొనసాగుతున్నట్లు ఆయన మంగళవారం ప్రకటించారు. మహాకూటమి బలపరిచిన టీడీపీ, కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తానని ఆయన వెల్లడించారు. నామినేషన్ సందర్భంగా కాంగ్రెస్‌పై శంకర్‌రావు తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే.
నలభైఏళ్లు పార్టీకి సేవచేసిన తనకు టికెట్ ఇవ్వలేదని, పార్టీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి టికెట్లు అమ్మకున్నారని ఆయన ఆరోపించారు. పార్టీ మారి 24 గంటలు కూడా కాకముందు ఇలా ప్లేటు ఫిరాయించడంతో ప్రజలు అవాక్కయ్యారు. కాంగ్రెస్ రెబల్స్‌గా నామినేషన్ దాఖలు చేసిన మరికొంత మంది నేతలు కూడా ఉపసంహరించుకుంటారని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. దీని కొరకు ఇప్పటికే నేతలను బుజ్జగించేందుకు అధిష్టానం దూతలను రంగంలోకి దింపినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment