= గడ్డం శ్రీరామ్ భార్య స్వరూప
= న్యాయ పోరాటం చేస్తాం : శంకర్‌రావు
భోలక్‌పూర్, న్యూస్‌లైన్: ఒక కరపత్రాన్ని రూపొందించారని తన భర్తపై విచక్షణారాహితంగా దాడి చేశారని, ఆస్పత్రి పాలైన తన భర్తకు న్యాయం చేసి బాధ్యులను చట్టరీత్యా శిక్షించాలని ఉస్మానియా యూనివర్శిటీ ఎల్‌ఎల్‌బి విద్యార్థి, తెలంగాణ విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం శ్రీరామ్ భార్య స్వరూప డిమాండ్ చేశారు. సోమవారం రాత్రి మాజీ మంత్రి, ఎమ్మెల్యే శంకర్‌రావుతో కలిసి ఆయన నివాసంలో స్వరూప మీడియాతో మాట్లాడారు.
తన భర్త రూపొందించిన కరపత్రంలో అభ్యంతరాలున్నాయని మంత్రి శ్రీధర్‌బాబు ఈ దాడులు చేయించారని ఆమె ఆరోపించారు. ఎటువంటి అరెస్టు వారెంట్ లేకుండా తన భర్తను రెండు రోజుల పాటు వేధించారన్నారు. కరీంనగర్ టూ టౌన్ పోలీసుస్టేషన్ సీఐను సస్పెండ్ చేయడంతో పాటు ఈ దాడి వెనుక ఉన్న పెద్ద వారిని సైతం విచిడిపెట్టవద్దని, వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికే హైకోర్టులో పిటీషన్ వేశామని, మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ఆమె తెలిపారు.
బాధ్యులపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కమిషనర్‌కు ఫిర్యాదు కూడా చేశామని స్వరూప చెప్పారు. ఈ సందర్భంగా శంకర్‌రావు మాట్లాడుతూ ఈ ఘటనలో ఎంత పెద్ద వారున్నా, వారిని వదిలే ప్రశక్తి లేదని, చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
నా భర్తకు న్యాయం చేయండి
Published Tue, Dec 24 2013 6:05 AM | Last Updated on Sun, Apr 7 2019 4:30 PM
Advertisement
Advertisement