మాజీ మంత్రి శంకర్రావు తనపై కక్ష కట్టారని డీజీపీ దినేష్ రెడ్డి ఆరోపించారు. తనను, సీపీని బ్లాక్ మెయిల్ చేసి లబ్ధి పొందాలని చూస్తున్నారన్నారు. ఆయన చెప్పిన పోలీస్ అధికారులను బదిలీ చేయలేదనే తనపైఆరోపణలు చేస్తున్నారన్నారు. రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళ్లి తన ఆస్తుల వివరాలు తెలుసుకోవచ్చని చెప్పారు. రెడ్ల పేరు మీదున్న ఆస్తులన్నీ తనవే అంటే ఎలా? అని ఆయన ప్రశ్నించారు. తన ఆస్తులపై ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. అవసరమైతే శంకర్రావుపై పరువు నష్టం దావా వేస్తానని డిజిపి హెచ్చరించారు.