ఎర్రచందనం కేసులో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి ఊరట
Published Fri, Aug 9 2013 3:06 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించి మాజీ మంత్రి పి.శంకర్రావు దాఖలుచేసిన వ్యాజ్యం నుంచి ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డికి ఉపశమనం లభించింది. ముఖ్యమంత్రి సహా పలువురిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతివాదులుగా పేర్కొంటూ శంకర్రావు వేసిన పిటిషన్‌ను గురువారం జస్టిస్ హెచ్.ఎల్.దత్తు, జస్టిస్ ఎం. వై.ఇక్బాల్‌తో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం విచారించింది. పిటిషన్‌ను పరిశీలించిన న్యాయమూర్తులు.. సీఎం కిరణ్ సహా నలుగురి పేర్లను ప్రతివాదుల జాబితా నుంచి తొలగించారు. రాష్ట్ర ప్రభుత్వానికి, ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీచేస్తూ నెల రోజుల్లోగా జవాబివ్వాలని ధర్మాసనం ఆదేశించింది.
Advertisement