సీఎం అక్రమంగా వేలకోట్లు సంపాదించారు: శంకర్రావు | Kiran kumar reddy enmassed crores of rupees, alleges Shankar rao | Sakshi
Sakshi News home page

సీఎం అక్రమంగా వేలకోట్లు సంపాదించారు: శంకర్రావు

Published Mon, Sep 30 2013 1:17 PM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

సీఎం అక్రమంగా వేలకోట్లు సంపాదించారు: శంకర్రావు - Sakshi

సీఎం అక్రమంగా వేలకోట్లు సంపాదించారు: శంకర్రావు

శంకరన్న మళ్లీ తెరమీదకు వచ్చారు. ఈసారి నేరుగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపైనే తన అస్త్రాన్ని సంధించారు. సీఎం అక్రమంగా వేల కోట్లు సంపాదించుకున్నారంటూ కంటోన్మెంట్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత శంకర్ రావు ఆరోపణలు గుప్పించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినా తమకు అభ్యంతరం లేదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గతంలోనే కాంగ్రెస్
అధిష్టానానికి మాట ఇచ్చారని ఆయన అన్నారు.

కానీ ఇప్పుడు మాత్రం ఆయన సీమాంద్ర ప్రాంతంలో జరుగుతున్న సమైక్య ఉద్యమాన్ని చూసి.. విభజన వద్దని చెబుతున్నారని, ఆయన కేవలం తన సొంత ప్రయోజనాలు మాత్రమే చూసుకుంటున్నారని అన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడి, వేల కోట్ల రూపాయల ఆస్తులను అక్రమంగా సంపాదించుకున్న ముఖ్యమంత్రి కిరణ్కు అసలు ఆ పదవిలో కొనసాగే అర్హత లేదని శంకర్ రావు మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement