కిరణ్ సర్కార్ ‘ప్రత్యేక నిధి’ నిలిపివేత | Kiran Sarkar 'special fund' suspension | Sakshi
Sakshi News home page

కిరణ్ సర్కార్ ‘ప్రత్యేక నిధి’ నిలిపివేత

Published Mon, Jun 23 2014 1:10 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

Kiran Sarkar 'special fund' suspension

 హైదరాబాద్: కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం తీసుకున్న ‘ప్రత్యేక నిర్ణయాలకు’ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఫుల్‌స్టాప్ పెట్టారు. కిరణ్ తన అనుచర ఎమ్మెల్యేలకు విచక్షణాధికారంతో పనులు మంజూరు చేసేందుకు ప్రత్యేక నిధి ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. గత బడ్జెట్‌లో ఇందుకోసం 600 కోట్ల రూపాయలు కూడా కేటాయించారు. గత ఎన్నికలకు ముందు ఈ నిధి నుంచి తన అనుంగు ఎమ్మెల్యేలకు వివిధ అభివృద్ధి పనుల పేరిట రూ. 150 కోట్లు మంజూరు చేశారు.

తనకు నచ్చిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలకే ఇష్టానుసారం ఒక పద్ధతి అంటూ లేకుండా నిధులను మంజూరు చేశారు. ఫిబ్రవరిలో ఈ పనులకు విడుదలైన నిధులు జిల్లా కలెక్టర్ల వద్ద వ్యక్తిగత ఖాతాల్లో నిల్వ ఉన్నాయి. ఇప్పుడు ఈ పథకం నిధుల విడుదల, పనులపైన సమీక్ష నిర్వహించాలని  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో 2013-14 ఆర్థిక సంవత్సరం చివరలో మంజూరైన 150 కోట్ల రూపాయల నిధులకు సంబంధించి పనులను ఎంతవరకు అయితే అక్కడికే నిలిపివేయాల ని, అలాగే నిధుల విడుదల కూడా ఆపాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement