నరసాపురం, రామచంద్రాపురంలో కాంగ్రెస్ గెలుపు టీడీపీ వల్లే
హైదరాబాద్: ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన మూడేళ్ల కాలంలో పార్టీని భూస్థాపితం చేయడం తప్ప ఆయన సాధించిందేమిలేదని మాజీ మంత్రి శంకర్రావు అన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొత్తం 51 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగితే 49 చోట్ల పార్టీ ఓటమి పాలయిందన్నారు. పార్టీ గెలిచిన నరసాపురం, రామచంద్రాపురంలోనూ టీడీపీ, పీఆర్పీ, కాంగ్రెస్ కాంబినేషన్ కారణంగానే గెలుపు దక్కిందన్నారు. సోమవారం కాంగ్రెస్ శాసనసభాపక్ష కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ ముఖ్యమంత్రిని ఎంత తర్వగా తపిస్తే పార్టీ అంతగా బలం పుంజుకుంటుందన్నారు.
ముఖ్యమంత్రి కిరణ్‌పై నాలుగు రోజుల క్రితం శంకర్రావు అవిశ్వాసం ప్రకటించిన విషయం తెలిసిందే. శాసనసభ బిజినెస్ రూల్స్ 75 (1) ప్రకారం ముఖ్యమంత్రిపై, ఆయన మంత్రివర్గంపై తాను అవిశ్వాసం ప్రకటిస్తున్నట్టు నోటీసులో పేర్కొన్నారు. వీలైనంత త్వరగా అసెంబ్లీని సమావేశ పరిచి, తన నోటీసుపై తదుపరి చర్యలు తీసుకోవాలన్నారు.
కిరణ్‌కుమార్‌రెడ్డి, శంకర్రావు, అవిశ్వాసం, Kiran Kumar Reddy, Legislative Assembly, Shankar Rao, no-confidence motion