కాంగ్రెస్ పార్టీకే మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) మద్దతు ఇస్తుందని మాజీ మంత్రి శంకర్రావు అన్నారు.
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీకే మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) మద్దతు ఇస్తుందని మాజీ మంత్రి శంకర్రావు అన్నారు. ఆయన శుక్రవామిక్కడ మీడియాతో మాట్లాడుతూ బీజేపీ నేతలకు తెలంగాణపై మాట్లాడే హక్కు లేదని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు వారికి తెలంగాణ గుర్తుకు రాలేదా అని శంకర్రావు ప్రశ్నించారు. తెలంగాణలో ఆత్మహత్యలకు బీజేపీయే కారణమని ఆయన ఆరోపించారు.
కాగా రెండు రోజుల క్రితం రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించాలని కోరుకుంటున్న మజ్లిస్ అధినేత సోనియా ఆహ్వానంపైనే ఆమె నివాసంలోనే కలిసి రాష్ట్ర విభజన నిర్ణయాన్ని గురించి చర్చించినట్లు కాంగ్రెస్ వర్గాల ద్వారా తెలిసింది. హైద్రాబాద్ రాజధానిగా తెలంగాణలోని పది జిల్లాలతో ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానించినప్పటికీ రాయలసీమలోని కర్నూలు, అనంతపురం జిల్లాలను కూడా కలిపి 12 జిల్లాలతో రాయల తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేందుకున్న అవకాశాలను కూడా ఆంటోనీ కమిటీ పరిశీలిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే.