పోలవరం ఆర్డినెన్స్, శాంతి భద్రతలపై గవర్నర్కు అధికారాల అంశం తెలంగాణ బిల్లులోనే ఉందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్ : పోలవరం ఆర్డినెన్స్, శాంతి భద్రతలపై గవర్నర్కు అధికారాల అంశం తెలంగాణ బిల్లులోనే ఉందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఆ అంశాలు ఇప్పుడు కొత్తగా చేర్చినవి కాదని, ఆయన సోమవారమిక్కడ వ్యాఖ్యానించారు. అప్పుడు ఇదే అంశాలను బీజేపీ వ్యతిరేకిస్తే తెలంగాణ వస్తే చాలని, ఇప్పుడు నెపం బీజేపీపైకి నెట్టడం సరికాదన్నారు. మజ్లీస్ మెప్పు కోసమే టీఆర్ఎస్ ఆరాటపడుతోందని కిషన్ రెడ్డి ఆరోపించారు. అయినా తెలంగాణ ఆస్తుల కోసం బీజేపీ కట్టుబడి ఉందని ఆయన అన్నారు.