కోడలిని వేధించినట్లు నమోదైన కేసులో మాజీ మంత్రి శంకర్రావును సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. శంకర్రావు కుమారుడు శశాంకకు, వంశీప్రియకు 2005లో పెళ్లి జరిగింది. అప్పటి నుంచి తమ కాపురం సజావుగానే సాగినట్లు ఆమె తెలిపింది. శంకర్రావు కూతురు భర్త నుంచి విడిపోయి ఇంటికి వచ్చినప్పటి నుంచి తనపై వేధింపులు మొదలయ్యాయని వంశీ ప్రియ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మామ శంకర్రావు, అత్త, ఆడబిడ్డలు తనని వరకట్నం కోసం వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు. పోలీసులు తగిన చర్యలు తీసుకోకపోవడంతో ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాంతో సీసీఎస్ పోలీసులు ముషీరాబాద్లోని శంకర్రావు నివాసానికి వెళ్లి అరెస్ట్ చేశారు. ఈ సంఘటన నగరంలో సంచలనం సృష్టించింది.