భద్రత పునరుద్దరించండి: కేసీఆర్ ను కోరిన శంకర్ రావు
హైదరాబాద్: తనకు భద్రత పునరుద్ధరించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మాజీ మంత్రి శంకర్ రావు విజ్ఞప్తి చేశారు. శనివారం సాయంత్రం కేసీఆర్ ను శంకర్ రావు కలిశారు. తనపై అకారణంగా కేసులు పెట్టారని కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు.
అక్రమంగా తనపై పెట్టిన కేసుల్ని తొలగించాలని కేసీఆర్‌ను శంకర్ రావు కోరారు. గ్రీన్ ఫీల్స్ భూ వివాదంలో శంకర్ రావుపై కేసు నమోదు చేశారు. గత ప్రభుత్వ హయాంలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అక్రమంగా వేల కోట్లు సంపాదించుకున్నారంటూ ఆరోపణలు చేసిన శంకర్ రావు.. డీజీపీపై విమర్శలు సంధించిన సంగతి తెలిసిందే.