
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం తుది ఘట్టానికి చేరుకోవడంతో నగరం నడిబొడ్డున ఉన్న ఎల్బీ స్టేడియం వేదికగా శనివారం భారీ బహిరంగ సభకు టీఆర్‌ఎస్ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ సభలో పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఎల్పీ స్టేడియం చుట్టూ పోలీస్ సిబ్బందిని పెట్టి భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు పోలీసు శాఖ నుంచి అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేశామని తెలిపారు. మొత్తం 50వేల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఇప్పటికే పలువురు రౌడీ షీటర్లును బైండోవర్ చేశామని, ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది కూడా సిద్దంగా ఉన్నారని వెల్లడించారు. వెపన్స్‌ను కూడా డిపాజిట్ చేయాలని ఆదేశింనట్లు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఎక్కడా ఇబ్బంది తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాని సీపీ తెలిపారు. చదవండి: నేడు కేసీఆర్ ‘గ్రేటర్’ సభ
Comments
Please login to add a commentAdd a comment