CP
-
మంచు ఫ్యామిలీ మెంబర్స్ పై 3 కేసులు : సీపీ సుధీర్ బాబు
-
నాకు సీపీని కలవాల్సిన అవసరం లేదు.. కానీ కలుస్తా..
-
హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్..
-
8.5 కోట్ల విలువ చేసే డ్రగ్స్ పట్టివేత.. యువతకు సీపీ వార్నింగ్..
-
హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు: వైజాగ్ చేరుకున్న బాధితులు
విశాఖపట్నం: కంబోడియా కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని విశాఖపట్నం పోలీసు కమిషనర్ రవి శంకర్ తెలిపారు. ఆయన గురువారం మీడియాతో ఈ కేసు సంబంధించిన విషయాలు తెలిపారు. ‘‘మొత్తం 68 మంది బాధితులను రక్షించాము. ఇంకా 90 మంది కంబోడియాలో ఉన్నారు. 68 మందిలో 25 మంది వైజాగ్ వాళ్ళూ. దేశ వ్యాప్తంగా 25 మంది ఏజెంట్లు ఉన్నారు. 12 మంది ఏజెంట్లను అరెస్ట్ చేశాం. ఆరుగురు ఏజెంట్లుపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశాము. ఈ మొత్తం స్కాంలో సిమ్ సప్లయార్స్ ముగ్గురుని గుర్తించాం. ... ఒక సిమ్ కార్డు భారత్ నుంచి తీసుకొని వెళ్లి ఇస్తే 10 నుంచి 15 వేలు కమిషన్ ఇస్తారు. నకిలీ బ్యాంక్ అకౌంట్స్.. తయారు చేస్తున్న ముఠాపై కూడా నిఘా పెట్టము. ఎమర్జెన్సీ పాస్ పోర్టు కూడా ఇండియా ఎంబసీ అధికారులు జారీ చేస్తున్నారు’’ అని తెలిపారు.కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగమని తీసుకువెళ్లి అక్కడ బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తున్న చైనా గ్యాంగ్‌పై తిరుగుబాటు చేసిన బాధితులు జైలు పాలయ్యారు. అక్కడ నిర్వాహకులు తమను చిత్ర హింసలకు గురి చేస్తున్నారని కొంత మంది బాధితులు విశాఖ పోలీసులకు వాట్సాప్‌తో పాటు ‘ఎక్స్’ ద్వారా వీడియో సందేశాలు పంపించిన విషయం తెలిసిందే.విదేశాల్లో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు అంటూ గాజువాకకు చెందిన చుట్టా రాజేష్ విజయ్‌కుమార్ సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చాడు. అది నిజమని నమ్మి విశాఖ నుంచే కాకుండా రాష్ట్రంలో సుమారు 150 మంది నిరుద్యోగులు రూ.1.5 లక్షలు చొప్పున చెల్లించారు. వారిని బ్యాంకాక్, సింగపూర్ల మీదుగా కంబోడియాకు పంపించారు.అక్కడ మరో గ్యాంగ్ బాధితులను రిసీవ్ చేసుకొని కంబోడియాలో పాయిపేట్ వీసా సెంటర్‌కు తీసుకెళ్లింది. ఓ నెలకు టూరిస్ట్ వీసా చేయించి ఆ గ్యాంగ్ చైనా ముఠాకు విక్రయించింది. నిరుద్యోగుల నైపుణ్యం ఆధారంగా వారిని రూ.2,500 నుంచి రూ.4వేల అమెరికన్ డాలర్లకు చైనా కంపెనీలకు అమ్మేశారు. అక్కడ పని చేసి చైనా వారి చెర నుంచి తప్పించుకున్న నగరానికి చెందిన బొత్స శంకర్ అనే వ్యక్తి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు సైబర్ నేరాలతో పాటు మానవ అక్రమ రవాణా వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు.ఈ నేపథ్యంలో హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు విచారణకు విశాఖపట్నం సీపీ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు అయిన విషయం తెలిసిందే. -
ఆపరేషన్ కంబోడియాపై విశాఖ సీపీ కీలక వ్యాఖ్యలు
సాక్షి, విశాఖపట్నం: దేశంలో సంచలన రేపిన హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ కేసులో కీలక పురోగతి సాధించామని విశాఖ సీపీ రవిశంకర్ అన్నారు. ఆయన సాక్షి మీడియాతో మాట్లాడుతూ, కంబోడియా నుంచి విశాఖకి చెందిన 58 మందిని మేము భారత్ కి తీసుకొని వచ్చామని వెల్లడించారు.ఇప్పటికే వారు ఢిల్లీకి వచ్చి ఉన్నారు. ఈ రోజు సాయంత్రం 5:15 నిమిషాలకు విశాఖకి బాధితులు వస్తారు. ఎన్.ఐ.ఎలో నాకున్న అనుభవంతో దర్యాప్తు వేగవంతం చేస్తున్నా. ఈ ముఠా వెనుక ఉన్న చైనా గ్యాంగ్‌ను పట్టుకుంటామని సీపీ తెలిపారు.కాగా, హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు విచారణకు విశాఖపట్నం సీపీ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటైన సంగతి తెలిసిందే. 20 మందితో సిట్ బృందం ఏర్పడింది. జాయింట్ సీపీ, ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్సైలు, 12 మంది హెడ్ కానిస్టేబుళ్లతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఈ కేసును లోతుగా దర్యాప్తు చేపట్టింది.ఇది జరిగింది..గాజువాక ప్రాంతానికి చెందిన కన్సల్టెన్సీ ఏజెంట్ చుక్కా రాజేష్ (32) 2013 నుంచి 2019 వరకు గల్ఫ్ దేశాల్లో ఫైర్ సేఫ్టీ అండ్ ప్రికాషన్ మేనేజర్‌గా పనిచేశాడు. ఆ తరువాత విశాఖలోనే ఉంటూ గల్ఫ్‌దేశాలకు ఫైర్ సేఫ్టీ ఉద్యోగాలకు మానవవనరులను సరఫరా చేసేవాడు. 2023 మార్చిలో కాంబోడియా నుంచి సంతోష్ అనే వ్యక్తి ఫోన్ చేసి, కాంబోడియాలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేయడానికి 30 మందిని పంపాలని రాజేష్‌ను కోరాడు. ఆసక్తి చూపే వారి నుంచి ఫ్లైట్ టికెట్లు, వీసా, ఇతర ఖర్చుల కోసం రూ.1.5 లక్షల వంతున తీసుకోవాలని, అందులో కొంత కమిషన్‌గా ఇస్తామని ఆశ చూపాడు. రాజేష్ అందుకు అంగీకరించి సోషల్ మీడియా ద్వారా విదేశాల్లో డేటా ఎంట్రీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలు ఇచ్చాడు. నిజమని నమ్మిన 27 మంది నిరుద్యోగులు రూ.1.5 లక్షల వంతున కట్టారు. రాజేష్ వారిని కాంబోడియా ఏజెంట్ సంతోష్‌కు అప్పగించాడు.ఇలా మూడు దఫాలుగా నిరుద్యోగులకు కాంబోడియాకు పంపించాడు. కొద్ది రోజులకు ఆర్య అనే పేరుతో ఒక మహిళ రాజేష్‌కు ఫోన్ చేసింది. సంతోష్ కంటే ఎక్కువ కమిషన్ ఇస్తానని తమకూ మానవవనరులను సరఫరా చేయాలని కోరింది. ఇలా రాజేష్.. సంతోష్, ఆర్య, ఉమా మహేష్, హబీబ్ అనే ఏజెంట్ల ద్వారా 150 మంది నిరుద్యోగులను కాంబోడియాకు పంపించాడు.ఒప్పందం అనంతరం వారిని కాంబోడియాలోనే ఈ ముఠా ఒక చీకటి గదిలో బంధించింది. ఫెడెక్స్, టాస్క్‌గేమ్స్, ట్రేడింగ్‌తో పాటు అనేక ఆన్లైన్ స్కాములు చేయాలని నిరుద్యోగులను బలవంతం చేసింది. ఈ స్కామ్స్ ఎలా చేయాలో వారం రోజుల పాటు శిక్షణ ఇచ్చింది. అక్రమాలకు పాల్పడబోమని మొండికేసిన వారికి తిండి పెట్టకుండా చిత్ర హింసలకు గురి చేసింది.సైబర్ నేరాలు చేసిన వారికి వచ్చిన డబ్బులో ఒక శాతం కమిషన్‌గా ఇస్తూ.. 99 శాతం చైనా గ్యాంగ్ దోచుకునేది. అక్కడ ఉత్సాహంగా పనిచేసేందుకు అదే కాంపౌండ్‌లో పలు రకాల పబ్, క్యాసినో గేమ్స్, మద్యం, జూదంతో పాటు వ్యభిచారం వంటి సదుపాయాలను ఈ ముఠా కల్పించింది. అక్కడ సంపాదించిన డబ్బు అక్కడే ఖర్చు చేసేలా చేసేది. చైనా ముఠా చెరలో 5వేల మంది..చైనా ముఠా చెరలో సుమారు 5 వేల మంది భారతీయులు ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే 150 మంది చైనా గ్యాంగ్ ఆధీనంలో ఉన్నట్లు గుర్తించారు. బాధితులు ఎక్కువగా శ్రీకాకుళం, విశాఖ, రాజమండ్రి, అనంతపురాలతో పాటు తెలంగాణ, కోల్‌కత్తాకు చెందిన వారూ ఉన్నారు. -
మియాపూర్ సీఐ సస్పెండ్.. కారణం ఇదే..!
-
Panjagutta PS: సిబ్బందిపై వేటు వెనక కారణాలివే?
హైదరాబాద్, సాక్షి: రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఇదో సంచలనం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే పీఎస్ లోని మొత్తం 86 మందిని బదిలీచేస్తూ ఉత్తర్వులిచ్చారు పోలీస్ కమీషనర్. ఇన్స్పెక్టర్ నుంచి హోంగార్డ్ వరకు అందరినీ బదిలీ చేశారు. పంజాగుట్ట పోలీసులపై పలు ఆరోపణలు రావడంతో.. తొలిసారి పీఎస్ లో ఉన్న 80శాతం సిబ్బందిని బదిలీచేస్తూ సీపీ శ్రీనివాసరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ట్రాన్స్‌ఫర్స్‌తో పోలీసులు అవినీతికి పాల్పడితే ఇలాంటి పరిణామాలే ఉంటాయని రాష్ట్రవ్యాప్తంగా వార్నింగ్ ఇచ్చినట్లయింది. సిటీలో ప్రధాన పోలీస్ స్టేషన్స్ లో పంజాగుట్ట ఒకటి. నాలుగేళ్ల క్రితం దేశంలోనే రెండో ఉత్తమ పోలీస్ స్టేషన్ గా అవార్డు పొందింది. మూడున్నర లక్షల మంది జనాభా.. ఐదు సెక్టార్లు.. వందకు పైగా పోలీస్ సిబ్బంది.. అంతటి పేరున్న పంజాగుట్ట పీఎస్ రీసెంట్ గా వివాదాల్లో నిలిచింది. రాజకీయ పలుకుబడితో ఈ పోలీస్ స్టేషన్ లో పోస్టింగ్స్ కోసం ఆఫీసర్లు వెంటబడేవారు. ఇట్లాంటి పోలీస్ స్టేషన్స్ లోని సిబ్బంది పలు కీలక కేసులను తప్పుదారి పట్టిస్తున్నారు. దీంతో స్టేషన్ సిబ్బందిని భారీగా ట్రాన్స్ఫర్స్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. నిన్న జరిగిన ఇన్స్పెక్టర్ల బదిలీల్లో పంజాగుట్ట ఇన్స్పెక్టర్ ని బదిలీ చేస్తూ శోభన్ అనే కొత్త ఇన్స్పెక్టర్ ని సీఐగా నియమించారు. ఈరోజు పీఎస్‌లోని ఆరుగురు ఎస్సైలు, 9 మంది ఏఎస్సైలు, 16 మంది హెడ్ కానిస్టేబుల్స్ తో పాటు కానిస్టేబుల్స్, హోమ్ గార్డులను బదిలీ చేస్తూ సర్క్యులర్ జారీ చేశారు సీపీ. పీఎస్‌లో మొత్తంగా వందకు పైగా సిబ్బంది ఉండగా అందులో 85 మందిని ఈరోజు ట్రాన్స్ ఫర్ చేశారు. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్, ఎస్సైలను మినహా మిగతా అందరినీ ట్రాన్స్ ఫర్ చేశారు. ట్రాన్స్ ఫర్ అయిన వారి స్థానంలో కొత్తగా 82 మందిని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు కమీషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. ప్రజాభవన్ ముందు జరిగిన యాక్సిడెంట్ కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్‌ని తప్పించి మరొకరిపై కేసు పెట్టారని అప్పట్లో పని చేస్తున్న సీఐ దుర్గారావును సస్పెండ్ చేశారు సీపీ. సీఐ దుర్గారావుకు మరికొంత మంది సిబ్బంది సహకరించారనే ఆరోపణలు వచ్చాయి. రీసెంట్ గా పంజాగుట్టలో ఒక వ్యక్తి ఫుల్లుగా తాగి తన కారుతో రోడ్డుపై ఉన్నవారందరినీ గుద్దుకుంటూ వెళ్లాడు. అతడ్ని పట్టుకుని స్థానికులు పోలీసులకు అప్పగించారు. ఆ తర్వాత ఆ వ్యక్తిని రిమాండ్ కి తరలిస్తుండగా పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. పోలీసుల నిర్లక్ష్యంతోనే ఇలా జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. వివిధ కేసుల్లో అరెస్టయిన నిందితులను కోర్టులకు, జైళ్లకు తరలించే టైమ్ లో పంజాగుట్ట పోలీసులు ఏమరపాటుగా ఉంటున్నారనే విమర్శలు వచ్చాయి. నిందితులకు సహకరిస్తూ వారి బంధువులతో మాట్లాడే అవకాశం కల్పిస్తున్నట్లు ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. నెల క్రితం డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడి.. న్యూసెన్స్ క్రియేట్ చేసిన ఇద్దరిని ట్రాఫిక్ పోలీసులు పంజాగుట్ట పోలీసులకు అప్పగించగా.. వారిద్దరూ పోలీసుల నుంచి పారిపోయారు. గతంలో ఇదే పీఎస్ కి చెందిన ఇద్దరు కానిస్టేబుల్స్ పెట్రోలింగ్ డ్యూటీ చేస్తూ, లిక్కర్ తాగుతూ పట్టుబడ్డారు. ఇదే పీఎస్ లోని ఓ ఎస్సై.. మహిళా బాధితుల పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. అలాగే సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటీ కదలికల్ని సైతం లీక్ చేస్తున్నారని సమాచారం అదింది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని ఒకేసారి భారీగా ట్రాన్స్ ఫర్స్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు నగర కమీషనర్. అవినీతికి పాల్పడ్డా.. సివిల్ వివాదాల్లో తలదూర్చినా.. ట్రాన్స్ ఫర్స్ తో పాటు సస్పెన్షన్స్ ఉంటాయంటున్నారు పోలీస్ ఉన్నతాధికారులు. ఆరోపణలు వచ్చిన ప్రతీ పోలీస్ పై స్పెషల్ బ్రాంచ్ పోలీసులతో ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ చేయించి, రుజువైతే చర్యలు తీసుకుంటామంటున్నారు. ఇదీ చదవండి: తెలంగాణ ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువు మళ్లీ పెంపు -
సిఫారసు లేఖలతో పోస్టింగ్‌లు: సైబరాబాద్ కమిషనర్ కొరఢా
హైదరాబాద్: సిఫారసు లేఖలతో పోస్టింగ్‌లు పొందిన పోలీసులపై సైబరాబాద్ కమిషనర్ కొరఢా ఝళిపిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజాప్రతినిధుల పలుకుబడితో పోస్టింగ్‌లు కొట్టేసిన అధికారులను సాగనంపే దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ దిశగా ఇప్పటికే పలువురిపై బదిలీ/సస్పెన్షన్ వేటు వేసిన కమిషనర్ అవినాశ్ మహంతి..మరికొంత మంది చిట్టాను కూడా రూపొందించారు. రూల్స్ బుక్ కమిషనర్‌గా పేరొందిన మహంతి..విధుల్లో నిర్లక్ష్యం, బాధితులపై విచక్షణారహితంగా దాడులు, అవినీతికి పాల్పడుతున్న వారిపై పోలీసు మాన్యువల్ ప్రకారం చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే స్పెషల్ బ్రాంచ్ సిబ్బందితో సమాచారం సేకరించిన సీపీ..త్వరలోనే సంబంధిత అధికారులకు చెక్‌చెప్పే అవకాశాలున్నట్లు పోలీసువర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రతిభావంతులకు పట్టం.. పోలీసు స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులు, బాధితులతో ఠాణా సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారు. కేసుల దర్యాప్తులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో బాధితులు సామాజిక మాధ్యమాల ద్వారా లేదా నేరుగా పోలీసు బాస్‌లను కలుస్తున్నారు. వీరి ఫిర్యాదులను సీపీలు స్వయంగా పరిశీలిస్తున్నారు. బాధితులు చెప్పే వివరాల ఆధారంగా ఏసీపీ స్థాయి అధికారులతో అంతర్గత విచారణ జరుపుతున్నారు. పోలీసు సిబ్బంది చేసింది తప్పని తేలితే వెంటనే సస్పెన్షన్ వేటు వేస్తున్నారు. కొత్త బాస్ రాకతో అప్రాధాన్యత పోస్టులలో ఏళ్ల తరబడి కొనసాగుతున్న ప్రతిభావంతులలో ఆశలు చిగురించాయి. చాలా వరకు ఠాణాలలో కొత్త ఇన్స్పెక్టర్లు బాధ్యతలు చేపట్టే సూచనలున్నాయి. -
ఈసీ ఫేవరేట్ మహంతి: ప్యామిలీలో ఐపీఎస్‌లు ఎందరో..!
సాక్షి, హైదరాబాద్: రాచకొండ కమిషనరేట్‌లో ట్రాఫిక్ డీసీపీ–1గా పనిచేస్తున్న 2011 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అభిషేక్ మహంతిని కరీంనగర్ పోలీసు కమిషనర్‌గా బదిలీ చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అక్కడ పనిచేస్తున్న సుబ్బారాయుడిపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. ఆ పోస్టులో నియమించే అధికారులకు సంబంధించి వచ్చిన జాబితాను పరిశీలించిన ఈసీ అభిషేక్ మహంతి పేరును ఖరారు చేసింది. ఎన్నికల సమయంలో, ఇలాంటి పరిస్థితుల్లో పోస్టింగ్ ఇవ్వాలంటే ఈసీ ఆయా అధికారులకు సంబంధించిన అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది. వారి సమర్థతతో పాటు నిజాయతీ తదితరాలను చూసిన తర్వాతే ఖరారు చేస్తుంది. గత ఏడాదే తెలంగాణ కేడర్‌కు వచ్చిన అభిషేక్ మహంతి 2019లో ఆంధ్రప్రదేశ్ కేడర్‌లో ఉన్నారు. 2019 నాటి ఏపీ ఎన్నికల సమయంలో ఈయన తిరుపతి అర్బన్ ఎస్పీగా పనిచేస్తున్నారు. అప్పట్లో ఏపీలో పనిచేసిన ఎస్పీలపై ఈసీకి అనేక ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో వివిధ జిల్లాల వారిని బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్న ఎన్నికల సంఘం కడప ఎస్పీగా అభి మహంతిని నియమించింది. ఆ కుటుంబంలో ఎన్నో ‘ఎన్నికల పోస్టింగ్స్’ అభిషేక్ మహంతితో పాటు ఆయన కుటుంబంలో కూడా ‘ఎన్నికల పోస్టింగ్స్’ సాధారణ అంశంగా మారడం గమనార్హం. అభిషేక్ తండ్రి అజిత్ కుమార్ మహంతి (ఏకే మహంతి) 1975 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఈయన హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గానూ పని చేశారు. 2009 ఎన్నికల సమయంలో అప్పటి డీజీపీ ఎస్ఎస్పీ యాదవ్ విచక్షణారహితంగా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయనపై వేటు వేసిన ఈసీ ఆ స్థానంలో ఏకే మహంతిని నియమించింది. ఇక అభిషేక్ మహంతి సోదరుడు అవినాష్ మహంతి కూడా 2005 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఈయన ప్రస్తుతం సైబరాబాద్‌లో పరిపాలన విభాగం సంయుక్త పోలీసు కమిషనర్‌గా ఉన్నారు. అవినాష్ మహంతికి కూడా గతంలో ఇదేవిధంగా ఎన్నికల పోస్టింగ్ వచ్చింది. 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొడంగల్‌లోని రేవంత్ ఇంటిపై పోలీసులు చేసిన దాడి తీవ్ర వివాదాస్పదమైంది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న ఎన్నికల సంఘం వికారాబాద్ ఎస్పీ అన్నపూర్ణపై బదిలీ వేటు వేసింది. ఆ స్థానంలో నగర నేర పరిశోధన విభాగంలో (సీసీఎస్) డీసీపీగా పనిచేస్తున్న అవినాష్ మహంతిని నియమించింది. ఎన్నికల క్రతువును విజయవంతంగా పూర్తి చేసిన ఆయన సీసీఎస్‌కే తిరిగి వచ్చారు. మహంతి ఫ్యామిలీలో ఎందరో ఐపీఎస్‌లు ఏకే మహంతి మామ (భార్య తండ్రి) దామోదర్ చోట్రాయ్ తొలి సివిల్ సర్వీసెస్ బ్యాచ్ అయిన 1948 బ్యాచ్ ఒడిషా కేడర్ అధికారి. డీజీపీగా పదవీ విరమణ చేశారు. ఏకే మహంతి బావమరిది పీకే సేనాపతి 1967 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఒడిషా కేడర్లోనే డీజీపీగా రిటైర్ అయ్యారు. -
హైదరాబాద్ సీపీగా బాధ్యతలు స్వీకరించిన సందీప్ శాండిల్య
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగర కమిషనర్‌గా సందీప్ శాండిల్య బాధ్యతలు చేపట్టారు. ఆయన్ని సీపీగా నియమిస్తూ తెలంగాణ సీఎస్ శాంతికుమారి శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. తొలుత ఆయన శనివారం బాధ్యతలు స్వీకరిస్తారని పోలీస్ శాఖ ప్రకటించింది. అయితే.. ఉత్తర్వులు వెలువడిన గంటల వ్యవధిలోనే ఆయన బాధ్యతలు స్వీకరించడం గమనార్హం. ఢిల్లీకి చెందిన సందీప్ శాండిల్య.. ఇంతకు ముందు పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా ఆయన పనిచేశారు. గతంలో సైబరాబాద్ సీపీగా, రైల్వే అడిషనల్ డీజీగా విధులు నిర్వహించారు. సంతోషంగా ఉంది.. హైదరాబాద్ నగర కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందని సందీప్ శాండిల్య అన్నారు. ‘‘ఎలక్షన్ కమీషన్ ఇచ్చిన బాధ్యత ను సక్రమంగా నిర్వహిస్తాం. టెక్నాలజీకి తగ్గట్టుగా పని చేస్తాం. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ నిర్వహిస్తాం’’ అని తెలిపారాయన. గుంటూరులో ఫస్ట్ పోస్టింగ్ 1993 ఐపీఎస్ బ్యాచ్‌కి చెందిన సందీప్ శాండిల్య గుంటూరులో మొదటి పోస్టింగ్ పొందారు. నల్గొండ, ఆదిలాబాద్, కృష్ణా, సౌత్ జోన్, డీసీపీగా చేశారు. సీఐడీ, ఇంటిలిజెంట్ సెక్యూరిటీ వింగ్‌లో, అడిషనల్ పోలీస్ కమిషనర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో పనిచేశారు. 2016 నుంచి 2018 వరకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా విధులు నిర్వహించారు. అడిషనల్ డీజీ రైల్వే అండ్ రోడ్ సేఫ్టీగా విధులు నిర్వహించిన శాండిల్య.. జైళ్ల శాఖ డీజీగానూ మూడు నెలల పాటు పనిచేశారు. కాగా, రానున్న తెలంగాణా ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఈసీ ఏకంగా 20 మంది ఉన్నతస్థాయి అధికారులను బదిలీ చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సహా నలుగురు జిల్లాల కలెక్టర్లు, 13 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. వారి స్థానంలో కొత్త వారిని నియమించాలని ప్రభుత్వానికి సూచించింది. గురువారం సాయంత్రం 5 గంటలలోపు పూర్తిస్థాయి ప్రిన్సిపల్ సెక్రటరీల నివేదికను పంపించాలని కోరింది. ఈ మేరకు ప్రతిపాదిక జాబితా చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి ఈసీకి పంపగా ఇందులోని పలువురి పేర్లను ఖరారు చేసింది. తెలంగాణా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీకి సంబంధించి అన్ని పోస్టుల నియామకాలపై ఉత్తర్వులు జారీ అయ్యాయి. పది జిల్లాలకు కొత్త ఎస్పీలు, వరంగల్, నిజమాబాద్‌కు కొత్త కమిషనర్ల నియామకం జరిగింది. యాదాద్రి కలెక్టర్‌గా హనుమంత్, నిర్మల్ కలెక్టర్‌గా ఆశీష్ సంగ్వాన్, రంగారెడ్డి కలెక్టర్‌గా భారతీ హోలీకేరి, మేడ్చల్ కలెక్టర్‌గా గౌతం, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణీ ప్రసాద్, ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ ముఖ్యకార్యదర్శిగా సునీల్ శర్మ, ఎక్సైజ్ కమిషనర్‌గా జ్యోతి బుద్ధ ప్రకాశ్, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌గా క్రిస్టినా నియమితులయ్యారు. అలాగే వరంగల్ కమిషనర్‌గా అంబర్ కిషోర్ ఝా , నిజామాబాద్ కమిషనర్‌గా కల్మేశ్వర్‌ని ఎంపిక చేశారు. పోలీసు కమిషనర్లు, ఎస్పీల జాబితా వివరాలు ►సంగారెడ్డి - చెన్నూరి రూపేష్ ►కామారెడ్డి- సింధు శర్మ ►జగిత్యాల- సన్‌ప్రీత్ సింగ్ ►మహబూబ్ నగర్ - హర్షవర్ధన్ ►నాగర్ కర్నూల్- గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ►జోగులాంబ గద్వాల్- రితిరాజ్ ►మహబూబాద్ - డాక్టర్ పాటిల్ సంగ్రామ్ ►నారాయణపేట - యోగేష్ గౌతమ్ ►జయశంకర్ భూపాలపల్లి - ఖరే కిరణ్ ప్రభాకర్ ►సూర్యాపేట- బీకే రాహుల్ హెగ్డే ►వరంగల్ పోలీసు కమిషనర్-అంబర్ కిషోర్ ఝా ►నిజామాబాద్ పోలీసు కమిషనర్ -కల్మేశ్వర్ సింగేనేవర్ చదవండి: కాంగ్రెస్ పార్టీకి పొన్నాల లక్ష్మయ్య రాజీనామా -
హైదరాబాద్ సీపీ రేసులో నలుగురి పేర్లు
హైదరాబాద్: హైదరాబాద్‌లో సీపీ కోసం నలుగురి పేర్లను కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం పంపినట్లు తెలుస్తోంది. సీపీ రేసులో సందీప్ శాండిల్యా, వీవీ శ్రీనివాస్, కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి, శివధర్‌రెడ్డిలతో కూడిన జాబితాను సీఈసికి సర్కార్ పంపించింది. 17 మంది అడిషనల్ డీజీల పేర్లను కూడా ప్రభుత్వం సీఈసికి ప్రభుత్వం సూచించింది. ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రానున్న ఆదేశాలు రానున్నాయి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో పలువురు ఏపీఎస్, ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. నలుగురు కలెక్టర్లు, 13 మంది ఎస్పీలు, కమిషనర్లను బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, వరంగల్ సీపీ రంగానాథ్, నిజామాబాద్ సీపీ సత్యనారాయణ, ఖమ్మం సీపీ విష్ణు వారియర్ బదిలీ అయ్యారు. అదే విధంగా రంగారెడ్డి కలెక్టర్ హరీష్, మేడ్చల్ కలెక్టర్ అమోయ్ కుమార్, యాదాద్రి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, నిర్మల్ కలెక్టర్ల వరుణ్ రెడ్డిలు ట్రాన్స్ఫర్ అయ్యారు. బదిలీ అయిన 13 మంది పోలీసు అధికారుల్లో తొమ్మిది మంది నాన్ క్యాడర్ వారు ఉన్నారు. మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఇటీవల జరిగిన ఉప ఎన్నిక సందర్భంగా ధనబలాన్ని దుర్వినియోగం చేసినట్లు పెద్ద ఎత్తున ఈసీకి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: ఈసీ ఆదేశం.. తెలంగాణలో పలువురు ఎస్పీలు, కలెక్టర్ల బదిలీ -
నందిగామ ఘటనపై సీపీ కాంతి రాణా స్పందన..
-
హైదరాబాద్‌లో మరో కొత్తరకం మోసం
-
నో బెయిల్.. 7 ఏళ్లు జైలు శిక్ష విజయవాడ యువతకి సీపీ స్వీట్ వార్నింగ్
-
పేరు పెట్టమన్న హైదరాబాద్ సీపీ.. ఆ పోస్టుకు అనూహ్య స్పందన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికే తలమానికంగా బంజారాహిల్స్‌లో రూపుదిద్దుకుంటున్న కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌కు (సీసీసీ) పేరు సూచించాలంటూ హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ నెటిజనులను కోరారు. ఈ మేరకు హైదరాబాద్ సిటీ పోలీసు అధికారిక ఫేస్బుక్ ఖాతాలో పోస్టు చేశారు. రోడ్ నం.12లో 20 అంతస్తుల ఎత్తుతో నిర్మితమవుతున్న ఈ భవనాన్ని ప్రస్తుతం ట్విన్ టవర్స్‌గా పిలుస్తున్నాయి. అయితే వాస్తవంగా ఇందులో మొత్తం నాలుగు టవర్స్ ఉంటాయని పోలీసులు తెలిపారు. కేవలం హైదరాబాద్ పోలీసుకే కాకుండా తెలంగాణ పోలీసు విభాగానికే ఇది కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌గా పనిచేస్తుందని స్పష్టం చేసిన ఆనంద్... ఆ మేరకు సరైన పేరు సూచించాలని కోరారు. చదవండి: మళ్లీ లాక్‌డౌనా అనేలా హైదరాబాద్ పరిస్థితి ఈ పోస్టుకు నెటిజనుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. పోస్ట్ చేసిన ఐదు గంటల్లోనే 1500 మంది లైక్ చేయగా...1100 మంది వివిధ పేర్లను సూచించారు. కమాండో హిల్స్, 4 లయన్స్, సీ4, ఫెడ రల్ టవర్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ (ఎఫ్‌టీటీ ఎస్), చార్మినార్ ప్రొటెక్షన్ సెంటర్ (సీపీసీ) తదితర పేర్లను నెటిజనులు సూచించారు. మా ర్చి 31లోగా నిర్మాణం పూర్తి చేసి, సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని ఆనంద్ ఇటీవలే కాంట్రాక్టర్‌కు సూచించిన విషయం విదితమే. -
ట్యాంక్ బండ్ లో గణేష్ నిమజ్జన ట్రయల్ రన్
-
కొత్త టెక్నాలజీ ద్వారా ఈ ఏడాది గణేష్ నిమజ్జనాలు
-
Cyberabad CP: బాధ్యతలు స్వీకరించిన స్టీఫెన్ రవీంద్ర
హైదరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి సైబరాబాద్ సీపీగా బాధ్యతలు ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఇచ్చిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని అన్నారు. సైబరాబాద్ ఐటీ కారిడార్ భద్రత, సైబర్ క్రైమ్స్, రోడ్ సేఫ్టీలపై ప్రత్యేక దృష్టి పెడతామని అన్నారు. అదే విధంగా, సిటిజెన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ కొనసాగిస్తామని తెలిపారు. సైబరాబాద్ లో ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్ ని కంటిన్యూ చేస్తూ.. తెలంగాణా పోలీస్ కి మంచి పేరు తీసుకోస్తామని తెలిపారు. చదవండి: సైబరాబాద్ సీపీ సజ్జనార్ బదిలీ, ఆర్టీసీ ఎండీగా నియామకం -
విజయవాడ: కర్ఫ్యూ అమలను పరిశీలించిన సీపీ బత్తిన శ్రీనివాసులు
-
సమర్థవంతంగా లాక్డౌన్ అమలు: సీపీ అంజనీకుమార్
సాక్షి, హైదరాబాద్: ప్రతి ఒక్కరి సహకారంతో లాక్డౌన్ సమర్థవంతంగా అమలవుతుందని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా పోలీసులు పనిచేస్తున్నారని తెలిపారు. ప్రతిరోజు సీఎం కేసీఆర్ లాక్డౌన్ పరిస్థితులపై సమీక్ష చేస్తున్నారని, చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి 24 గంటలూ పరిస్థితిని సమీక్షిస్తున్నామని పేర్కొన్నారు. ‘‘20 వేల మందికి ఈ పాసులు జారీ చేశాం. అవసరమైతేనే ప్రజలు బయటకు రావాలి. కోవిడ్ కట్టడిని అడ్డుకునేందుకే ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. ప్రజలు కూడా లాక్‌డౌన్‌కు సహకరించాలి. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ప్రజలకు వెసులుబాటు కల్పించాం. చిన్న కారణాలతో ప్రజలు బయటకు వచ్చి ఇబ్బందులు కలిగించొద్దు. ఈ-పాసులను కొందరు మిస్ యూజ్ చేస్తున్నారు. ఈ-పాస్‌లను అనవసరంగా వాడితే వాహనాలను సీజ్ చేస్తున్నాం. 3 కమిషనరేట్ల పరిధిలో చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు జరుగుతున్నాయి. ప్రతి జోన్లో పోలీసుల టీమ్ ఉంది. బ్లాక్మార్కెట్లో ఇంజక్షన్లు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటాం. బ్లాక్మార్కెట్లో ఇంజక్షన్లు అమ్మితే 100కు ఫోన్ చేయాలని’’ సీపీ తెలిపారు. 94.5 శాతం పోలీసు అధికారులకు వ్యాక్సినేషన్ కంప్లీట్ అయిందని ఆయన తెలిపారు. ప్రతి హైవేలో సీనియర్ పోలీసు అధికారి నేతృత్వంలో పర్యవేక్షణ ఉందని పేర్కొన్నారు. అంతర్రాష్ట్రాల నుంచి హైదరాబాద్ వస్తున్న రోగులకు అనుమతిస్తున్నామన్నారు. అంబులెన్స్‌లకు ఎలాంటి ఇబ్బందులు కలిగించడం లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలనే మేం పాటిస్తున్నామన్నారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు ప్రజల భద్రత, ఆరోగ్యమే తమకు ముఖ్యమని సీపీ అంజనీకుమార్ అన్నారు. చదవండి: బీజేపీలో ఈటల చేరిక దాదాపు ఖరారు కరోనా కాటు: సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ మృతి -
ఎవరి ఇళ్లలో వారు ప్రార్థనలు చేసుకోవాలి: సీపీ అంజనీ కుమార్
-
Kukatpally: పట్టపగలే దోపిడి, ఒకరు మృతి
-
హైదరాబాద్ అత్యంత సేఫ్: సీపీ అంజనీకుమార్
సాక్షి, హైదరాబాద్: దేశంలో అత్యంత సేఫ్ సిటీల్లో హైదరాబాద్ నంబర్-2లో ఉందని సీపీ అంజనీకుమార్ అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రపంచంలో అత్యంత సురక్షిత నగరాల్లో హైదరాబాద్ ఒకటని అమెరికాకు చెందిన సర్వే కంపెనీ కూడా చెప్పిందని ఆయన గుర్తు చేశారు. నేరస్తులను గుర్తించడంలో సీపీ కెమెరాలు ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు. హైదరాబాద్‌లో 6 లక్షల సీసీ కెమెరాలున్నాయని.. ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని సీపీ పేర్కొన్నారు. రాత్రి సమయాల్లో కూడా రికార్డు అయ్యేలా టెక్నాలజీని వాడుతున్నామన్నారు. ఎన్నో నేరాలను ఛేదించడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషించాయని పేర్కొన్నారు. కోర్టుల్లో ఆధారాలుగానూ ఉపయోగపడుతున్నాయన్నారు. సీసీ కెమెరాలు ఉండటంతో 2018 నుంచి బహిరంగ ప్రదేశాల్లో నేరాల శాతం తగ్గుతూ వస్తోందని సీపీ అంజనీకుమార్ వెల్లడించారు. చదవండి: ట్యాంక్‌బండ్‌పై చూస్తుండగానే కాలిపోయిన కారు లాక్డౌన్ పెట్టం: సీఎం కేసీఆర్ -
సీపీ అంజనీకుమార్ కుమారుడి వివాహ ఫోటోలు
-
కేసీఆర్ సభకు భారీ బందోబస్త్: అంజనీ కుమార్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం తుది ఘట్టానికి చేరుకోవడంతో నగరం నడిబొడ్డున ఉన్న ఎల్బీ స్టేడియం వేదికగా శనివారం భారీ బహిరంగ సభకు టీఆర్ఎస్ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ సభలో పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఎల్పీ స్టేడియం చుట్టూ పోలీస్ సిబ్బందిని పెట్టి భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు పోలీసు శాఖ నుంచి అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేశామని తెలిపారు. మొత్తం 50వేల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఇప్పటికే పలువురు రౌడీ షీటర్లును బైండోవర్ చేశామని, ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది కూడా సిద్దంగా ఉన్నారని వెల్లడించారు. వెపన్స్‌ను కూడా డిపాజిట్ చేయాలని ఆదేశింనట్లు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఎక్కడా ఇబ్బంది తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాని సీపీ తెలిపారు. చదవండి: నేడు కేసీఆర్ ‘గ్రేటర్’ సభ -
బీజేపీ నేతల ఆరోపణలు అవాస్తవం: సీపీ
సాక్షి, సిద్దిపేట: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సిద్దిపేట పోలీసులపై చేసిన ఆరోపణలపై పోలీసు కమిషనర్ జోయల్ డేవిస్ స్పందించారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పోలీసులపై బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని, పోలీసులే డబ్బు పెట్టారని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఎన్నికల నియమావళి ప్రకారం నోటీసులు ఇచ్చాకే సోదాలు నిర్వహించామని తెలిపారు. సోదాలపై అధికారులు పంచనామా కూడా నిర్వహించారన్నారు. సురభి అంజన్రావుకు నోటీసులు ఇచ్చాకే సోదాలు చేశామని, మొత్తం వీడియోలో చిత్రీకరించినట్లు చెప్పారు. బయట నుంచి వచ్చిన కార్యకర్తలు తమపై దాడి చేశారని, ఎన్నికల నియమావళి జిల్లా మొత్తానికి వర్తిస్తుందన్నారు. ఎన్నికల సమయంలో సీజ్ చేసిన డబ్బును ఎత్తుకెళ్లడం నేరమన్నారు. (చదవండి: పోలీసులే ఆ డబ్బు పెట్టారు: సంజయ్) శాంతి భద్రతల నేపథ్యంలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ను జిల్లాకు రావొద్దని కోరినట్లు ఆయన పేర్కొన్నారు. ఆయనకు రక్షణ కల్పించే పంపామని, ఎలాంటి దాడి జరగేదని సీపీ వెల్లడించారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు, ఆయన బంధువుల ఇళ్లలో పోలీసులు సోమవారం సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. దీంతో ఎంపీ బండి సంజయ్ పోలీసులే డబ్బులు పెట్టి దొరికినట్లు చూపించారని ఆరోపించారు. ఇక రెచ్చగొట్టే చర్యలకు దిగినా, కార్యకర్తలు సమన్వయం పాటించి దుబ్బాక నియోజకవర్గంలోని బూత్ లెవల్ కార్యకర్తలు యథావిధిగా ప్రచారం కొనసాగించాలని సంజయ్ కోరారు. సిద్దిపేట సంఘటనపై ఎన్నికల సంఘం స్పందించాలని, కేంద్ర బలగాలను పంపించి ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చూడాలని బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. (చదవండి: ఓటమి భయంతో అడ్డదారులు) -
హిట్‌లిస్ట్‌లో రాజాసింగ్.. భద్రత పెంపు
సాక్షి, హైదరాబాద్: టెర్రరిస్ట్‌ల నుంచి ముప్పు ఉందని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తనకు భద్రత పెంచుతూ లేఖ రాశారని గోశామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల అరెస్టైన ఉగ్రవాదుల హిట్ లిస్టులో తన పేరు ఉన్నట్లు పోలీసులు ద్వారా తన దృష్టికి వచ్చిందని, ఈ నేపథ్యంలో భద్రత కల్పించాలని కోరినట్లు పేర్కొన్నారు. తన విజ్ఞప్తి మేరకు పోలీసులు తన ఇంటి వద్ద నూతన ఆయుధాలతో భద్రత ఏర్పాటు చేశారని వెల్లడించారు. బైక్‌పై తిరగవద్దని, ప్రభుత్వం ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ కారులోనే ప్రయాణించాలని సూచనలు చేశారని రాజాసింగ్ తెలిపారు. డీసీపీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో తన భద్రత పర్యవేక్షణ చేస్తున్నారని చెప్పారు. (రాజాసింగ్ గన్‌మెన్‌కు కరోనా పాజిటివ్) తెలంగాణ పోలీసులు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని అన్నారు. గతంలో హైదరాబాద్ సీపీకి లైసెన్స్ గన్ ఇవ్వాలంటూ లేఖ రాశానని, ఇప్పటికైనా తనకు గన్ లైసెన్స్ మంజూరు చేయాలని పోలీసుశాఖకు రాజాసింగ్ విజ్క్షప్తి చేశారు. స్లమ్ ఏరియా కాబట్టి తన నియోజకవర్గంలో కారులో వెళ్లలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఎవరితో ముప్పు ఉందనే విషయాన్ని తెలియపరచాలని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తానని చెప్పారు. ముప్పు విషయంలో కేంద్రం, ఐబీ, ఇంటలిజెన్స్ నుంచి తనకు తరచూ ఫోన్ కాల్స్ వస్తున్నాయని తెలిపారు. -
ప్రచారంలో ఆరుగురు..
సాక్షి ప్రతినిధి, వరంగల్ : వరంగల్ నూతన పోలీసు కమిషనర్ ఎవరనే అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత పోలీసు కమిషనర్ డాక్టర్ విశ్వనాథ రవీందర్ ఈనెల 30న ఉద్యోగ విరమణ చేయనున్నారు. దీంతో నూతన కమిషనర్‌గా ఎవరిని నియమించనున్నారనే విషయం పోలీసులతో పాటు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మూడు జిల్లాల పరిధి.. హైదరాబాద్ తర్వాత అతి పెద్ద నగరంగా ఉన్న వరంగల్‌కు పేరు ఉంది. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ జిల్లాలకు విస్తరించిన పోలీసు కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో ఉంది. ఈ నేపథ్యంలో కొత్త కమిషనర్ నియామకం విషయంలో సీఎం కేసీఆర్ నిర్ణయమే కీలకమన్న చర్చ జరుగుతోంది. అయితే ఇప్పటికే ప్రచారంలో ఉన్న ఆశావహుల పేర్లపై జిల్లాకు చెందిన కొందరు కీలక ప్రజాప్రతినిధుల అభిప్రాయం కూడా సీఎం తీసుకున్నట్లు సమాచారం. నూతన కమిషనర్ నియామకంపై రెండు, మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రచారంలో ఆరుగురు.. అత్యంత కీలకమైన వరంగల్ పోలీసు కమిషనర్‌గా ఎవరు రానున్నారనే అంశంపై పోలీసు శాఖతోపాటు ప్రజల్లో చర్చ జరుగుతుండగా, పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ప్రస్తుతం కరీంనగర్ పోలీసు కమిషనర్‌గా పనిచేస్తున్న వీబీ.కమలాసన్ రెడ్డి, రామగుండం సీపీ వి.సత్యనారాయణ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. దాదాపు కమలాసన్ రెడ్డి పేరు ఖరారైనట్లేనన్న వాదన కూడా ఉంది. అయితే సుమారు నాలుగేళ్లుగా కరీంనగర్ కమిషనర్‌గా పని చేస్తున్న కమలాసన్‌రెడ్డి హైదరాబాద్ వెళ్లాలన్న ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం. ఆయన ప్రయత్నం ఫలిస్తే సత్యనారాయణకుఅవకాశం ఉండొచ్చని తెలుస్తోంది. అదే విధంగా గతంలో వరంగల్‌లో డీఎస్పీగా పనిచేసి ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఎస్పీగా ఉన్న బి. సుమతి, నిజామాబాద్ సీపీ కార్తికేయ, హైదరాబాద్ సెంట్రల్ జోన్ డిప్యూటీ కమిషనర్ పి.విశ్వప్రసాద్, హైదరాబాద్‌లో జాయింట్ కమిషనర్(స్పెషల్ బ్రాంచ్) డాక్టర్ తరుణ్‌జోషి పేర్లను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. రెండేళ్ల క్రితమే పదోన్నతి పొంది డీఐజీ హోదాలో కరీంనగర్ సీపీగా వీబీ.కమలాసన్ రెడ్డి పని చేస్తుండగా, నిజామాబాద్ సీపీ కార్తికేయ, ఎస్పీ(ఉమెన్ ప్రొటెక్షన్ సెల్) బి.సుమతి, రామగుండం సీపీ వి.సత్యనారాయణకు ఈ ఏడాది ఫిబ్రవరి 6న డీఐజీలుగా పదోన్నతి లభించింది. -
ఢిల్లీ పోలీస్ చీఫ్‌గా ఎస్ఎన్ శ్రీవాస్తవ
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా ఐపీఎస్ అధికారి ఎస్ఎన్ శ్రీవాస్తవ నియమితులయ్యారు. ప్రస్తుత సీపీ అమూల్య పట్నాయక్ శనివారం పదవీవిరమణ చేయనున్నారు. ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన ఘర్షణలను అదుపు చేయడంలో అమూల్య విఫలమయ్యారని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. మరోవైపు సీఆర్పీఎఫ్ నుంచి స్పెషల్ కమిషనర్ (శాంతిభద్రతలు)గా హోంమంత్రిత్వ శాఖ శ్రీవాస్తవను తీసుకొచ్చిన కొద్దిరోజులకే ఆయనకు ఢిల్లీ పోలీస్ చీఫ్ బాధ్యతలను కట్టబెట్టారు. మరోవైపు ఢిల్లీ అల్లర్లలో మృతుల సంఖ్య 38కి చేరింది. చదవండి : ఐబీ అధికారి హత్య : గంటల తరబడి అరాచకం -
విశాఖ, తిరుపతిలో కొత్తగా ఫోరెన్సిక్ ల్యాబ్‌లు
సాక్షి, విశాఖపట్నం: ప్రారంభోత్సవ తేదీ ఖరారైన వెంటనే విశాఖలో దిశ పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించనున్నామని విశాఖ నగర సీపీ ఆర్కే మీనా తెలిపారు. శనివారం నగర కమిషనరేట్ కాన్ఫరెన్స్ హాలులో ’దిశ’ చట్టంపై ప్రభుత్వం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయనతో పాటు డీసీపీ రంగారెడ్డి, పలువురు అధికారులు, మహిళ మిత్రలు హాజరయ్యారు. ఈ సందర్భంగా నగర సీపీ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇప్పటికే పోలీస్స్టేషన్ల ఏర్పాటు, వాహనాలు, కోర్టులు, పిపీలు, ఫోరెన్సిక్ ల్యాబ్‌ల కోసం నిధులు మంజూరు చేసిందని వెల్లడించారు. (అందుకే దిశ చట్టం తీసుకువచ్చాం: సీఎం జగన్) రాష్ట్రంలో తిరుపతి, విశాఖల్లో కొత్తగా ఫోరెన్సిక్ ల్యాబ్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందన్నారు. ‘డయల్ 100’ కూడా చురుగ్గా పనిచేస్తోందని.. ఫిర్యాదు అందిన వెంటనే 3 నుంచి 5 నిమిషాల్లో సిబ్బంది చేరుకుంటున్నారని చెప్పారు. విశాఖ లో ఇద్దరు డిఎస్పీలు, ఐదుగురు ఎస్ఐలు, ఆరుగురు హెచ్‌సీలు, 38 మంది మహిళా కాని స్టేబుళ్ల తో ‘దిశ’ పీఎస్ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఆధునాతన విదేశీ పరికరాలతో మార్చి చివరి నాటికి ఫోరెన్సిక్ ల్యాబ్ అందుబాటులోకి వస్తోందన్నారు. ప్రస్తుతం కంట్రోల్ రూమ్‌లో అన్ని భాషలపైన అవగాహన కలిగిన సిబ్బంది ఉన్నారని సీపీ ఆర్కే మీనా పేర్కొన్నారు. (మహిళల సంరక్షణ కోసమే దిశ చట్టం: సుచరిత) -
అరిస్తే చంపేస్తానని బెదిరించాడు..
సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన ఫార్మాసీ విద్యార్థిని సోనీ కిడ్నాప్ కేసును పోలీసులు చేధించారు. కిడ్నాపర్ రవిశేఖర్‌ను పోలీసులు అద్దంకిలో అరెస్ట్ చేసి మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. కిడ్నాప్‌కు సంబంధించి సోని స్టేట్మెంట్ను రికార్డు చేశామని, ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించామని తెలిపారు. కిడ్నాపర్ రవిశేఖర్ తన పట్ల దారుణంగా ప్రవర్తించాడని సోని తెలిపిందన్నారు. ‘గత ఏడు రోజులుగా కారులోనే ఉంచిన కిడ్నాపర్.. నిన్న చిలకలూరిపేటలో సోనీని వదిలేశాడు. బస్ కండక్టర్ సాయంతో అద్దంకి వచ్చి అక్కడి నుంచి ఈ రోజు హైదరాబాద్ చేరుకుంది. రెండు రోజుల పాటు కిడ్నాప్ అయిన విషయం తెలుసుకోలేకపోయిన సోనీ.. తన నాన్న, తమ్ముడు గురించి రవిశంకర్‌ను ప్రశ్నిస్తే నీ ఉద్యోగం పనిపై వెళ్లారని నమ్మబలికాడు. మొదటగా సోనీని కడపకి తీసుకెళ్లిన అనంతరం తిరుపతి, అద్దంకి, చిలకలూరిపేట తదితర ప్రాంతాల్లో తిప్పాడు. ఉద్యోగం పేరుతో సోనీని మభ్యపెట్టాలని చూసిన రవిశంకర్.. ఆమె మాట వినకపోవడంతో చంపేస్తానని బెదిరించాడు. రోజూ పెట్రోల్ బంక్, నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశాలను ఎంచుకొని చంపేస్తానని బెదిరించి కారులో ఉంచాడు. రోజుకు ఒక్కసారే భోజనం పెట్టేవాడు. ఏదైనా కావాలంటే బయట ఉన్నవారినే కారు దగ్గరికి పిలిచేవాడు. అరిస్తే చంపేస్తానని బెదిరించాడని’ ఆమె స్టేట్మెంట్లో వెల్లడించిన విషయాన్ని పోలీస్ కమిషనర్ మీడియాకు తెలిపారు. వైద్య పరీక్షలు పూర్తి కిడ్నాప్ గురైన సోనీకి పేట్ల బుర్జ్ ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. దాదాపు 3 గంటల పాటు ఆమెకు డాక్టర్లు వైద్య పరీక్షలు చేశారు. వైద్య పరీక్షల అనంతరం హాస్పిటల్ నుంచి మీడియా కంట కనపడుకుండా ముసుగు వేసి ఆమెను అక్కడి నుంచి రాచకొండ పోలీసులు రహస్యంగా తీసుకెళ్లారు. -
దయచేసి... అటువంటి ఫిర్యాదులు చేయొద్దు!
సాక్షి, ముంబై : ‘ మేము దొంగలించబడిన వస్తువులను తిరిగి తీసుకురాగలం. కానీ కొంతమంది మాత్రం మేము పరిష్కరించలేని, అసాధారణ ఫిర్యాదులు చేస్తుంటారు’ అంటూ తమకు ఎదురైన విచిత్రమైన అనుభవం గురించి నాగ్‌పూర్ పోలీస్ కమిషనర్ భూషణ్ కుమార్ ఉపాధ్యాయ చెప్పుకొచ్చారు. ఇటీవల జరిగిన సంవత్సరాంతపు పత్రికా సమావేశంలో మాట్లాడుతూ... ఈ ఏడాది దొంగిలించబడిన 82 లక్షల రూపాయల విలువైన వస్తువులను యజమానులకు అప్పగించగలిగామని తెలిపారు. అయితే అదే సమయంలో ఓ యువకుడు చేసిన ఫిర్యాదుతో మాత్రం తమ టీమ్ ఇబ్బంది పడిందని పేర్కొన్నారు. నా గుండె దొంగిలించింది సార్! తన గుండెను ఓ అమ్మాయి దొంగిలించందంటూ సదరు యువకుడు చేసిన ఫిర్యాదును నమోదు చేసుకునేందుకు ఎటువంటి సెక్షన్లు లేకపోవడంతో అతడిని వెనక్కి పంపించాల్సి వచ్చిందని భూషణ్ కుమార్ పేర్కొన్నారు. ఎంతో మంది ప్రజలు సమస్యలతో అల్లాడుతూ పరిష్కారం కోసం తమ వద్దకు వస్తుంటారని, అయితే ఇటువంటి విచిత్ర కేసుల్లో మాత్రం తాము చేసేదీ ఏమీ ఉండదని.. దయచేసి ఇటువంటి విషయాలతో విలువైన సమయాన్ని వృథా చేయవద్దని కోరారు. -
హైదరాబాద్‌లో క్రైమ్‌రేటు తగ్గింది : సీపీ
సాక్షి, హైదరాబాద్ : గతేడాదితో పోలిస్తే 2018లో నగరంలో క్రైమ్ రేటు 6 శాతం తగ్గిందని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. బుధవారం ఆయన సంవత్సరాంతపు పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ ఏడాది నమోదైన కేసులు, వాటిని ఛేదించిన తీరు, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ సజావుగా సాగడంలో పోలీసుల పాత్ర తదితర వివరాలను వెల్లడించారు. క్రైమ్ రేటు తగ్గింది.... గతేడాదితో పోలిస్తే ప్రాపర్టీ క్రైమ్‌లో 20 శాతం, వరకట్న చావులు 38 శాతం, కిడ్నాప్ కేసులు 12 శాతం, లైంగిక వేధింపుల కేసుల్లో 7 శాతం తగ్గిందని సీపీ అంజనీ కుమార్ పేర్కొన్నారు. అయితే మర్డర్ కేసులు మాత్రం 2017తో పోలిస్తే 8 శాతం పెరిగాయని తెలిపారు. ఈ ఏడాది సొత్తు 92 శాతం సొత్తు రికవరీ సాధించగలిగామన్నారు. ఎన్నికల సమయంలో 29 హవాలా సొత్తుని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. 4777 గన్ లైసెన్స్‌లకు, సిటీ లో ఉన్న 2లక్షల 48వేల 528 సీసీటీవీలకు జియో టాగింగ్ చేసినట్లు పేర్కొన్నారు. కరడుగట్టిన నేరస్తులపై 2017లో 53 మందిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తే ఈ ఏడాది102 మంది మీద నమోదు చేశామని పేర్కొన్నారు. వుమెన్ ఆన్ వీల్స్ ఉపయోగపడింది షీటీమ్స్ భరోసా సెంటర్లలో 1028 కేసులు నమోదు చేశామని సీపీ పేర్కొన్నారు. ఆకతాయిల ఆట కట్టించడంలో, నేరాలను తగ్గించడంలో వుమెన్ ఆన్ వీల్స్ , వెరీ ఫాస్ట్ యాప్ ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టం ఎంతగానో ఉపయోగపడ్డాయని తెలిపారు. 2018లో మొట్టమొదటిసారిగా 40 మంది పోలీసులతో సిటీ రాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. టాస్క్‌ఫోర్స్ ఆధ్వర్యంలో 20 మర్డర్ కేసులు ఛేదించినట్లు తెలిపారు. 101 మంది క్రికెట్ బూకీలను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఆ కేసుల్ని తక్కువ సమయంలో ఛేదించాం రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నిజాం మ్యూజియంలో చోరీ కేసు, కోఠి ఆస్పత్రిలో శిశువు కిడ్నాప్ కేసు అతి తక్కువ సమయంలో ఛేదించామని సీపీ అంజనీకుమార్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వీవీఐపీల సందర్శన, రాష్ట్రపతి రాక, పర్వదినాలకు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు తదితర సమయాల్లో సమర్థవంతంగా పని చేశామన్నారు. ఎన్నికల సమయంలో 29 కోట్ల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రెండు అవార్డులు సాధించాం 2018 సంవత్సరానికి గాను స్మార్ట్ సిటీ అవార్డు ,ఈ- గవర్నెన్స్ అవార్డులను హైదరాబాద్ పోలీస్ శాఖ సాధించిందని సీపీ హర్షం వ్యక్తం చేశారు. వివిధ దేశాల ప్రతినిధులు హైదరాబాద్ పోలీసుల పనితీరుపై అధ్యయనం చేసేందుకు నగరానికి వచ్చారన్నారు. ట్యాంక్‌బండ్‌లో ఆత్మహత్య చేసుకోడానికి వచ్చిన 336 మందిని లేక్ పోలీసులు కాపాడారని తెలిపారు. ఇక గతేడాదితో పోలిస్తే చైన్ స్నాచింగ్ కేసులు 62 శాతం తగ్గాయని పేర్కొన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వారిపై 26779 కేసులు నమోదు కాగా.. 1368 మంది లైసెన్స్ రద్దు అయినట్లు తెలిపారు. మొత్తంగా 26407 చార్జిషీట్లు నమోదు కాగా... 5148 మందికి జైలు శిక్ష పడిందని.. జరిమానా రూపంలో ఐదు కోట్ల రూపాయలు వసూలు అయ్యాయని వెల్లడించారు. -
నేర రహిత పోలీస్ కమిషనరేట్ లక్ష్యం
సాక్షి, కాజీపేట అర్బన్: వరంగల్ కమిషనరేట్‌ను నేర రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ రవీందర్ తెలిపారు. హన్మకొండ డివిజనల్ పోలీసుల ఆధ్వర్యంలో ఆదివారం కాజీపేట మండలంలోని న్యూశాయంపేటలో 150 మంది సిబ్బందితో కార్డన్ సర్చ్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన సీపీ రవీందర్ న్యూ శాయంపేట ప్రజలతో మాట్లాడి పోలీసుల పనితీరుపై ఆరా తీశారు. తొలుత న్యూశాయంపేటలోని రౌడీషీటర్లు, పాత నేరస్తులు, అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా సీపీ రవీందర్ మాట్లాడారు. శాంతి భద్రతల పరీరక్షణలో ప్రజలకు భరోసా అందించేందుకు కార్డన్ సర్చ్ నిర్వహించినట్లు తెలిపారు. నేరాల నివారణకు పోలీసుల భాగస్వామ్యంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కార్డన్ సర్చ్‌లో నేరస్తులను గుర్తించి పీడీ యాక్ట్‌లు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 45 మంది నేరస్తులపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు తెలిపారు. ప్రజలకు ప్రశాంతమైన జీవనాన్ని, పూర్తి భద్రత కలిగించేందుకు 24 గంటల పెట్రోలింగ్, నిరంతర నిఘాకు గస్తీ వాహానాలు, బ్లూకోట్స్ సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఫేస్ రికగ్నైజింగ్ సాఫ్ట్‌వేర్‌తో నేరస్తులను ఫింగర్ స్కానర్ సాయంతో గుర్తించడం జరుగుతుందని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. కార్డన్ సర్చ్‌లో సెంట్రల్ జోన్ డీసీపీ వెంకట్‌రెడ్డి, హన్మకొండ ఏసీపీ చంద్రయ్య, ఇన్స్పెక్టర్ సదయ్య, సంపత్‌రావు, రాఘవేందర్, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పత్రాలు లేని 40 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని సుబేదారి పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. -
‘ఇడియట్’ సినిమా గుర్తుందా..?
బుధవారం రాత్రి 10 గంటలు బషీర్‌బాగ్‌లోని కమిషనరేట్... అప్పుడే పని ముగించుకున్న హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్... ఇంటికి బయలుదేరడానికి సిద్ధం కావడంతో రెడీ అయిన వాహన శ్రేణి... తన వెహికిల్‌ను వదిలి కాలినడకన అంబర్‌పేట్‌లోని ఇంటికి వెళ్లిన సీపీ... దాదాపు గంటన్నర పాటు సాగిన ఈ ‘పాదయాత్ర’లో అనేక కీలకాంశాలు తన దృష్టికి వచ్చాయని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ శుక్రవారం ‘సాక్షి’కి తెలిపారు. సాక్షి, సిటీబ్యూరో: రవితేజ హీరోగా నటించిన ‘ఇడియట్’ సినిమా గుర్తుందా..? అందులో పోలీసు కమిషనర్ పాత్ర పోషించిన ప్రకాష్‌రాజ్ బాధ్యతలు స్వీకరించడానికి వచ్చిన రోజు రాత్రి నగరంలో మారువేషంలో తిరుగుతూ కొన్ని లోపాలను గుర్తిస్తారు. నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ సైతం బుధవారం రాత్రి దాదాపు ఇదే పని చేశారు. కమిషనర్ కార్యాలయం నుంచి ఆయన తన ఇంటి వరకు గంటన్నరపాటు కాలినడకనే వెళ్లారు. సాధారణ దుస్తుల్లో బయటకు... బుధవారం రాత్రి 10 గంటలకు తన కార్యాలయం నుంచి బయలుదేరిన సమయంలో కొత్వాల్ అంజనీకుమార్ సాధారణ దుస్తుల్లో ఉన్నారు. నీలిరంగు ట్రాక్, ఎర్రరంగు టీషర్ట్‌తో పాటు స్పోర్ట్ షూస్ ధరించి, ఓ చేతిలో తన సెల్‌ఫోన్‌తో బయలుదేరారు. ఈయనకు దాదాపు 100 మీటర్ల దూరంలో సఫారీ దుస్తుల్లో ఉన్న గన్‌మెన్ అనుసరించగా...అర్ధగంట గ్యాప్ ఇచ్చిన తర్వాత ఆయన కాన్వాయ్ వెంట వెళ్ళింది. బషీర్‌బాగ్ నుంచి హిమాయత్‌నగర్, నారాయణగూడ, తిలక్‌నగర్, ఛే నంబర్, శ్రీ రమణ థియేటర్, అంబర్పేట్ మీదుగా దాదాపు ఆరు కిలోమీటర్లు నడిచిన కొత్వాల్ రాత్రి 11.30 గంటల ప్రాంతంలో సెంట్రల్ పోలీసు లైన్స్‌లో ఉన్న తన ఇంటికి చేరుకున్నారు. మార్గమధ్యంలో కొందరు చిరు వ్యాపారులతోనూ ఆయన ముచ్చటించారు. అత్యధికులు సాధారణ దుస్తుల్లో, నడుచుకుంటూ వస్తున్న పోలీసు కమిషనర్‌ను గుర్తించలేదు. మందుబాబులు... ట్రాఫిక్ ఇబ్బందులు... ఈ మార్గంలోని పరిస్థితులను గమనించాలనే ఉద్దేశంతో ‘పాదయాత్ర’ చేసిన కొత్వాల్ ముఖ్యంగా రెండు ఇబ్బందుల్ని గుర్తించారు. నారాయణగూడ, కాచిగూడ ఠాణాల పరిధుల్లో ఉన్న రెండు వైన్‌షాపుల వద్ద ఆ సమయంలోనూ భారీగా జనం ఉన్నారు. వీరిలో కొందరు మద్యం ఖరీదు చేసుకుని రోడ్లపై వాహనాలు ఆపి తాగుతూ కొత్వాల్‌కు కనిపించారు. మరికొందరు మద్యం సీసాలు తీసుకుని రాంగ్రూట్స్లో దూసుకుపోతూ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారని ఆయన పరిశీలించారు. వీటికి తోడు ఆ సమయంలోనూ రహదారులపై పాదచారులు ఎక్కువగా ఉంటున్నారని సీపీ దృష్టికి వచ్చింది. అయితే రాత్రివేళ కావడంతో వాహనాలు వేగంగా దూసుకుపోతున్నాయి. దీంతో కొన్ని జంక్షన్లతో పాటు కీలక ప్రాంతాల్లో రోడ్డు దాటేందుకు పాదచారులు చాలా ఇబ్బందులు పడుతున్నారని కొత్వాల్ గ్రహించారు. ఆ ఇద్దరిపై తీవ్ర ఆగ్రహం... ఈ ‘పాదయాత్ర’ మార్గంలోని రెండు ఠాణాలకు చెందిన అధికారులపై నగర పోలీసు కమిషనర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మద్యం దుకాణాలు ఉన్న చోట్ల గస్తీ సక్రమంగా లేదని, ఆ కారణంగానే మందుబాబులు రెచ్చిపోతున్నారని అభిప్రాయపడినట్లు సమాచారం. గురువారం ఉదయం జరిగిన టెలీకాన్ఫరెన్స్‌లో అంజనీ కుమార్ తన ‘వాక్ ఆన్ స్ట్రీట్స్’ అనుభవాన్ని జోనల్ డీసీపీలతో పాటు ఇతర ఉన్నతాధికారులకు పంచుకున్నారు. తన దృష్టికి వచ్చిన లోపాలను ఆయా విభాగాలు, జోన్లకు చెందిన అధికారులతో స్పష్టం చేశారు. తక్షణం వాటిని సరిదిద్దాలంటూ ఆదేశించారు. ‘దాదాపు గంటన్నర పాటు నడుస్తూ ఇంటికి చేరుకున్నా. దీని వల్ల నాకు అనేక విషయాలు తెలిశాయి. వాటిపై అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. నగర ప్రజల భద్రత, ప్రశాంత జీవనమే మా ప్రధాన లక్ష్యం’ అని అంజనీ కుమార్ ‘సాక్షి’తో అన్నారు. లిఫ్ట్ కావాలా.. కారు పంపాలా... కొత్వాల్ సాబ్ వాకింగ్‌లో ఉండగా గుర్తించిన వారు అతి తక్కువే ఉన్నారు. అలా ఆయన్ను గుర్తుపట్టిన వారు వెనుక వస్తున్న సిబ్బంది వద్దకు వెళ్ళి ఏం జరుగుతోందని ఆరా తీశారు. కొందరు ద్విచక్ర వాహనచోదకులు అయితే లిఫ్ట్ కావాలేమో అడగాలంటూ సిబ్బందిని కోరారు. ఇంకొందరు ఆయన వాహనం చెడిపోయినందుకు నడుస్తున్నారని భావించారు. దీంతో తమ వాహనాలు ఇస్తామని, లేదా మరో కారు ఏర్పాటు చేస్తామంటూ ఆఫర్లు కూడా ఇచ్చారు. అయితే వీటిపై స్పందించలేదు. -
ఆ ముగ్గురిలో ఎవరు ?
విజయవాడ నగర కొత్త పోలీస్ కమిషనర్ ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరింది. రేసులో ఉన్న ముగ్గురు అధికారులను సీఎం చంద్రబాబు పిలిపించి మాట్లాడారు. శాంతి భద్రతలు, రాజధాని ప్రాముఖ్యత, రాజకీయ పరిస్థితులు, ఎన్నికలు తదితర అంశాలపై సీఎం తన ఉద్దేశాన్ని వారికి పరోక్షంగా చెప్పినట్లు తెలిసింది. ఒకటి రెండు రోజుల్లోనే సీపీని నియమిస్తారని పోలీసువర్గాలు చెబుతున్నాయి. సాక్షి, అమరావతిబ్యూరో : విజయవాడ పోలీస్ కమిషనర్ (సీపీ) పోస్టు ఆశావాహుల్లో ముగ్గురు అధికారులను సీఎం చంద్రబాబు పిలిపించుకుని మాట్లాడటం ప్రాధాన్యం సంతరించుకుంది. విశ్వసనీయవర్గాల సమాచారంమేరకు....సీఐడీ అదనపు డీజీ ద్వారకా తిరుమల రావు, ఇంటిలిజెన్స్ అదనపు డీజీ నళినీప్రభాత్, అమిత్‌గార్గ్‌లు సీఎం చంద్రబాబుతో శనివారం విడివిడిగా భేటీ అయ్యారు. సీఎం పిలుపు మేరకే వీరు ఆయనతో సమావేశమయ్యారు. 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పోలీసు అధికారుల నియామకంలో చంద్రబాబు ఓ కొత్త విధానానికి తెరతీశారు. ఎస్పీ, కమిషనర్ స్థాయి అధికారులను నియమించే ముందు ఆయనే నేరుగా వారిని పిలిపించి మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో ఇంతకుముందు ఇలాంటి సంప్రదాయం లేదు. అదే రీతిలో ముగ్గురు అధికారులతో చంద్రబాబు మాట్లాడారు. సీఎం అభీష్టం మేరకే... డీజీపీ ఎస్పీ ఠాకూర్ కూడా సీఎం చంద్రబాబుతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించకుంది. ద్వారకా తిరుమలరావు, నళినీప్రభాత్, అమిత్‌గార్గ్‌లతో మాట్లాడిన తరువాత డీజీపీ ఠాకూర్‌ను సీఎం పిలిపించి మాట్లాడారు. విజయవాడ సీపీ ఎంపిక మీద డీజీపీ అభిప్రాయం తెలుసుకునేందుకే ఆయన్ని పిలిపించారని సమాచారం. సీపీ నియామకం పూర్తిగా సీఎం అభీష్టం మేరకే జరుగుతుంది. డీజీపీ ఠాకూర్ అభిప్రాయాన్ని తెలుసుకోవడం కేవలం సంప్రదాయం మాత్రమే. ఆసక్తికరంగా సీపీ ఎంపిక.... తాజా పరిణామాల నేపథ్యంలో ద్వారకా తిరుమల రావు, నళినీ ప్రభాత్, అమిత్‌గార్గ్‌లతో ఒకరిని సీపీగా ఎంపిక చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అగ్రిగోల్డ్ కేసు దర్యాప్తు కొనసాగుతున్నందున సీఐడీ అదనపు డీజీ ద్వారకా తిరుమలరావును సీపీగా నియమిస్తారా అన్నది మీమాంశగా మారింది. మరో వైపు ఉత్తర భారతానికి చెందిన అధికారినే సీపీగా నియమించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. వారు అయితేనే స్థానిక అంశాలతో నిమిత్తం లేకుండా వ్యవహరిస్తారన్నది ఆయన ఉద్దేశం. అదే భావనతో మూడేళ్ల కిందట గౌతం సవాంగ్‌ను విజయవాడ సీపీగా నియమించారు. ప్రస్తుతం కూడా అదే విధానాన్ని అనుసరించాలని నిర్ణయించారని సమాచారం. అదే జరిగితే నళినీ ప్రభాత్, అమిత్‌గార్గ్‌లలో ఒకరికి అవకాశాలు మెరుగుపడతాయి. అమిత్‌గార్గ్ 2015 నుంచి 16 వరకు విశాఖపట్నం సీపీగా పని చేశారు. ఆయన పట్ల సీఎం చంద్రబాబు సానుకూలంగానే ఉన్నారు. మరోవైపు నళినీ ప్రభాత్ చాలా ఏళ్లుగా సీఎం చంద్రబాబుకు సన్నిహితుడిగా ముద్ర పడ్డారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఒకటి రెండు రోజుల్లో సీపీ నియామకంపై అధికారిక ఉత్తర్వులు వెలువడతాయని తెలుస్తోంది. -
జస్లిన్ కౌర్.. డాటర్ ఆఫ్ హైదరాబాద్
సాక్షి, సిటీబ్యూరో : ‘నీట్’లో సరైన ర్యాంకు రాలేదన్న కారణంతో మంగళవారం ఆత్మహత్య చేసుకున్న జస్లిన్ కౌర్ ఉదంతంపై నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ స్పందించారు. ఆమెను ‘డాటర్ ఆఫ్ హైదరాబాద్’ అంటూ సంబోధించిన ఆయన.. విద్యార్థిని అకాల మరణం తీవ్రంగా కలచి వేసిందని వ్యాఖ్యానించారు. బుధవారం కొత్వాల్ విడుదల చేసిన ఆడియోలోని అంశాలు ఇలా.. ‘మెడికల్ ఎంట్రన్స్‌లో మంచి ర్యాంకు రాలేదనే కారణంతో ఓ బాలిక ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం. తన అత్యంత విలువైన జీవితాన్ని చాలా చిన్న వయసులోనే కోల్పోవడం నా గుండెను కదిలించింది. ఈ నష్టాన్ని, బాధను తట్టుకునే శక్తిని ఆమె కుటుంబీకులకు ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నా. వివిధ రంగాల్లో నెలకొన్న అనారోగ్యకరమైన పోటీ చిన్ని హృదయాలపై ఎంతటి ప్రభావం చూపుతోందో, ఎంత ఒత్తిడికి గురిచేస్తోందో సమాజం ఆలోచించాల్సిన సమయం వచ్చింది. జీవితం కేవలం చదువుల కోసం కాదనే విషయాన్ని అర్థమయ్యేలా వివరించాలి. భవనాల యజమానులు తమ టెర్రాస్‌లకు ఉన్న తలుపులకు తాళం వేసి ఉంచడం ద్వారా ఆత్మహత్య చేసుకునే వారికి ఆ అవకాశం లేకుండా చేయాలని కోరుతున్నా. రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్స్, కమ్యూనిటీలు దీన్ని అమలు చేయాలి. ఈ కోణంలో అవగాహన కల్పించాల్సింగా అధికారులు, సిబ్బందిని ఆదేశిస్తున్నా. డాటర్ ఆఫ్ హైదరాబాద్ ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరం. ప్రతికూల సమయాలు, సవాళ్లు భవిష్యత్తులో గుర్తుకు వస్తే మనం సాధించిన విజయాలు జ్ఞప్తికి వస్తాయనేది యువత గుర్తించాలి. ప్రతి రాత్రి వెనుక ఓ సూర్యోదయం ఉంటుందని మరువద్దు. సమస్యలు ఎదురైనప్పుడు జీవితంపై నమ్మకం ఉంచి ముందుకు వెళ్ళండి.’ అని ఆయన సూచించారు. చాటింగ్స్‌పై మరో ఆడియో.. ‘ఆన్లైన్ చాటింగ్‌కు సంబంధించి ఇటీవల వెలుగులోకి వచ్చిన కొన్ని ఉదంతాలు దాని తీవ్రత, దాని వల్ల జరిగే ప్రమాదాలను మాట్లాడేలా చేశాయి. టెక్టŠస్ మెసేజ్‌లతో కూడిన ఈ చాటింగ్ వల్ల తక్షణం సమాచార మార్పిడి జరుగుతుంది. అయితే అనేక సందర్భాల్లో ఒకరితో మరొకరికి పరిచయం ఉండట్లేదు. నిత్యం కొత్త స్నేహితులను పరిచయం చేసుకోవడం శుభపరిణామమే. అయితే సమాజంలో మంచి వాళ్లు ఉన్నట్టే చెడ్డ వాళ్లూ ఉంటున్నారు. వీరు నకిలీ ఐడీలు తయారు చేసుకుని ఇంటర్నెట్ ద్వారా కొందరితో పరిచయాలు చేసుకుని స్నేహితులుగా మారుతున్నారు. ఆపై అదును చూసుకుని పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. విద్యార్థులు ఈ ఉచ్చులో చిక్కుకోకూడదని కోరుతున్నా. సోషల్ మీడియాలో కామన్ ఫ్రెండ్స్ ఉన్న కొత్త వారినే స్నేహితులుగా మార్చుకోండి. అలా కాకుంటే మీరు మోసపోయే ప్రమాదం ఉంది. యువ విద్యార్థుల్లో ఈ కోణంలో అవగాహన పెంచాల్సిందిగా పోలీసులను కోరుతున్నా. నకిలీ ఐడీలు సృష్టించడం కూడా నేరమే అని స్పష్టం చేయాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు యువ విద్యార్థుల్లో అవగాహన పెంచడానికి ప్రయత్నించాలి. దేశ నిర్మాణానికి భవిష్యత్తు తరాలే నిజమైన ఆస్తులు. అంతా కలిసి ఎలాంటి మోసాల బారినా పడకుండా వారిని కాపాడుకుందాం.’ అంటూ కొత్వాల్ అంజనీకుమార్ పేర్కొన్నారు. -
విజయవాడలో మరో భూకబ్జా
సాక్షి, విజయవాడ: నగరంలో మరో భూబాగోతం వెలుగులోకి వచ్చింది. కబేళా సమీపంలోని కొండ ప్రాంతంలో 500 గజాల స్థలాన్ని కబ్జా చేశారంటూ దళితులు విజయవాడ సీపీకి ఫిర్యాదు చేశారు. తమ స్థలల్లోకి రానీయకుండా దౌర్జన్యం చేస్తున్నారంటూ సీపీ దగ్గర వాపోయారు. అనంతరం బాధితులు మీడియాతో మాట్లాడుతూ..టీడీపీ నేతల సహకారంతో తమ భూమిని కాజేయాడానికి కుట్రపన్నుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఇచ్చిన భూములను లాక్కొని తమ స్థలం వద్దకు రానీయకుండా కొంత మంది దౌర్జన్యానికి పాల్పడుతున్నారని పేర్కొనారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ప్రభుత్వం స్పందించకుంటే తమ స్థలాల్లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు. -
పేపర్‌లెస్ పోలీసింగ్
దేశంలోని మరే ఇతర పోలీసు కమిషనరేట్‌లోనూ లేనటువంటి ‘ఈ–ఆఫీస్’ విధానం మంగళవారం నుంచి సిటీలో అందుబాటులోకి రానుంది. ఇకపై పేపర్‌లెస్ పద్ధతిలోనే కార్యకలాపాలు జరపాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఫైళ్లు, పిటిషన్లు ఈ మెయిల్స్ రూపంలోనే పరస్పర మార్పిడి జరుగుతుంది. పేపర్ లెస్ విధానంలో ఫైళ్లన్నీ డిజిటల్ రూపంలోకి మారిపోతాయి. సాక్షి,సిటీబ్యూరో: దేశంలోని మరే ఇతర పోలీసు కమిషనరేట్‌లోనూ అమలులో లేని ఈ–ఆఫీస్ విధానం మంగళవారం నుంచి నగరంలో అందుబాటులోని రానుంది. దీనికి సంబం«ధించి ఉన్నతాధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సాంకేతిక ఇబ్బందులను అధిగమించేందుకు ప్రతి జోనల్ కార్యాలయంలోనూ ప్రత్యేకంగా సహాయక బృందాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ పేపర్ లెస్ విధానం అమలుతో ఏటా లక్ష చెట్లను రక్షించినట్లే అవుతుందని నగర పోలీసు కమిషనర్ అంజినీ కుమార్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం కమిషనరేట్‌లో జరిగే అధికారిక వ్యవహారాలన్నీ పేపర్ల మీదుగానే సాగుతున్నాయి. ఓ బాధితుడు వచ్చి పిటిషన్ల నుంచి అనుమతులు కోరుతూ వచ్చే దరఖాస్తుల వరకు ప్రతి ఫైల్ ఎందరో సిబ్బంది, అధికారుల వద్దకు వెళ్తుంటుంది. ప్రస్తుతం ఇది కాగితాల రూపంలోనే సాగుతుండటంతో ఏటా క్వింటాళ్ల కొద్దీ పేపర్లు వాడాల్సి వస్తోంది. మరోపక్క సదరు ఫైల్ ఎవరి వద్ద పెండింగ్‌లో ఉంది? ఎన్ని రోజులు ఆగింది? తదితర అంశాలు గుర్తించడం కష్టసాధ్యం. వీటిని పరిగణలోకి తీసుకున్న నగర పోలీసు కమిషనర్ అంజినీ కుమార్ ఈ–ఆఫీస్‌ను అమలు చేయాలని నిర్ణయించారు. మంగళవారం నుంచి అమలులోకి వస్తున్న పేపర్ లెస్ విధానంలో ఫైళ్లన్నీ డిజిటల్ రూపంలోకి మారిపోతాయి. ఓ బాధితుడు ఠాణాకు వచ్చి ఫిర్యాదు చేసిన తర్వాత దాన్ని స్కాన్ చేసే సిబ్బంది ఇంట్రానెట్‌లోని ప్రత్యేక అప్లికేషన్లో పొందుపరుస్తారు. అక్కడ నుంచి ఈ పిటిషన్ ఎవరి వద్దకు వెళ్లింది? వారు తీసుకున్న చర్యలు ఏంటి? ఎన్ని రోజులుగా, ఎక్కడ పెండింగ్‌లో ఉంది? అనే అంశాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్డేట్ అవుతూ ఉంటాయి. అనుమతులకు సంబంధించి ఠాణాలు, డివిజన్లు, జోనల్ అధికారులకు వచ్చిన దరఖాస్తులు సైతం ఇలానే డిజిటల్ డాక్యుమెంట్‌గా మారిపోతా యి. ఒకరి నుంచి మరొకరికి మార్పిడి మొత్తం ఈ–మెయిల్స్ ద్వారానే జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రత్యేకంగా డ్యాష్‌బోర్డ్ ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా ప్రతి ఉన్నతాధికారి ఓ ఫైల్/పిటిషన్ ఎక్కడ ఉంది? దర్యాప్తు ఏ స్థాయికి చేరింది? జాప్యం ఎక్కడ జరుగుతోంది? అనే అంశాలను తన కంప్యూటర్ తెరపైనే చూస్తూ మానిటర్ చేసుకోవచ్చు. ఈ–ఆఫీస్ విధివిధానాలకు సంబంధించి సిబ్బంది, అధికారులకు శిక్షణ ఇచ్చారు. ఆన్లైన్లోని ఈ–ఆఫీస్ పూర్తి భద్రంగా ఉండేలా, హ్యాకింగ్స్ బారినపడకుండా పోలీసు విభాగం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందుకుగాను కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) సర్వర్‌ను వినియోగిస్తున్నారు. ప్రతి అధికారికి ప్రత్యేకంగా యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లతో పాటు డిజిటల్ సిగ్నేచర్ కేటాయించారు. ప్రాథమికంగా సిటీ పోలీసు విభాగంలోనే అమలయ్యే ఈ విధానాన్ని భవిష్యత్తులో మరింత విస్తరించనున్నారు. పోలీస్ స్టేషన్లో నమోదయ్యే కేసుల దర్యాప్తు పూర్తయిన తర్వాత నిందితులపై న్యాయస్థానంలో అభియోగపత్రాలు దాఖలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి వీటిని మాత్రం ప్రింట్‌ఔట్స్ తీసి పత్రాల రూపంలోనే దాఖలు చేయనున్నారు. భవిష్యత్తులో పోలీసు ఈ–ఆఫీస్‌ను న్యాయ విభాగానికి చెందిన ఈ–కోర్ట్స్‌తో అనుసంధానించాలని యోచిస్తున్నారు. ఇది జరిగితే అభియోగపత్రాలు సైతం ఆన్లైన్లోనే దాఖలు చేయడానికి ఆస్కారం ఏర్పడనుంది. జవాబుదారీతనం, వేగం ఎకో ఫ్రెండ్లీ, పేపర్ లెస్‌గా ఉండే ఈ–ఆఫీస్ విధానం అమలు చేయడంతో నగర పోలీసు విభాగం ఏటా లక్ష చెట్లను రక్షించినట్లే. గత 35 రోజులుగా దీనికి సంబంధించిన కసరత్తులు చేస్తున్నాం. ప్రతి పిటిషన్, ఫైల్ డిజిటల్ రూపంలో ఉండే ఈ సరికొత్త విధానంతో జవాబుదారీతనంతో పాటు పని వేగం సైతం పెరుగుతుంది. ఈ విధానంతో మొదట్లో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే ఆస్కారం ఉంది. వీటిని పరిష్కరించడానికి ప్రతి డీసీపీ ఆధీనంలో బ్యాక్ఎండ్ టీమ్, హెల్ప్ డెస్క్‌ల్ని ఏర్పాటు చేస్తున్నాం. కొన్ని రోజుల్లోనే ఈ విధానం విజయవంతం అవుతుందనే నమ్మకం ఉంది. – అంజినీ కుమార్, సిటీ పోలీస్ కమిషనర్ -
కరడుగట్టిన చైన్ స్నాచింగ్ గ్యాంగ్ అరెస్ట్
హైదరాబాద్ : కరడుగట్టిన చైన్ స్నాచింగ్ గ్యాంగ్‌ను అరెస్ట్ చేసినట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడించారు. విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. రెండేళ్ల నుంచి ఈ గ్యాంగ్ సభ్యులు నేరాలకి పాల్పడుతున్నారని చెప్పారు. పట్టుబడిన ఐదుగురు నిందితులు నుంచి 800 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని, మొత్తం మూడు కమిషనరేట్ల పరిధిలో వీరిపై 180 కేసులు ఉన్నాయని తెలిపారు. జైలుకి వెళ్లి వచ్చిన తరువాత తిరిగి 32 చైన్ స్నాచింగ్‌లు చేశారని అన్నారు. చైన్ స్నాచింగ్ చేస్తున్న సమయంలో ఎవరైనా ఎదురు తిరిగితే వారిని కత్తులతో బెదిరించి పరారవుతున్నారని వివరించారు. బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నాలుగు ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారని తెలిపారు. నిందితులు సలీం, సయ్యద్ నజిమ్, సల్లాఉద్దీన్, సయ్యద్ జహంగీర్, అముల్ కోలేకర్లపై పీడీ యాక్ట్ నమోదు చేస్తున్నట్లు సజ్జనార్ తెలిపారు. -
స్టేషన్ అడ్రస్ దొరక్క తికమక..
నాంపల్లి: నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ బుధవారం రాత్రి నాంపల్లి శాంతిభద్రతల పోలీసు స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్థానికంగా నివాసం ఉండే రౌడీషీటర్‌పై ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన ఎవ్వరికీ సమాచారం ఇవ్వకుండా నేరుగా పోలీసు స్టేషన్‌కు వచ్చారు. అయితే స్టేషన్ చిరునామా దొరక్క ఆయనతోపాటు సిబ్బంది కూడా కాసేపు తికమక పడ్డారు. తొలుత నిలోఫర్ దగ్గర నిర్మాణంలో ఉన్న పోలీసు స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ స్టేషన్ లేదని తెలుసుకున్నాక కొంతదూరం ముందుకు వెళ్లారు. మార్గమధ్యలో స్థానికులు ఇచ్చిన సమాచారంతో శాంతిభద్రతల పోలీసు స్టేషన్ అనుకుని నాంపల్లి ట్రాఫిక్ పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. ట్రాఫిక్ పోలీసులు నగర కమిషనర్‌ను చూసి అవాక్కయ్యారు. తదుపరి శాంతినగర్ పోలీసు క్వార్టర్స్‌లో ఉన్న నాంపల్లి శాంతిభద్రతల పోలీసు స్టేషన్‌కు చేరుకున్నారు. కాన్వాయ్ దిగిన కొత్వాల్ అంజనీకుమార్ నాంపల్లి ఇన్స్పెక్టర్ ఛాంబర్లోకి వెళ్లారు. అక్కడ కాసేపు ఇన్స్పెక్టర్ సంజయ్ కుమార్‌తో మాట్లాడారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. రౌడీ షీటర్ల కదలికలపై దృష్టిసారించడానికి తాను నాంపల్లి పోలీసు స్టేషన్‌కు వచ్చినట్లు వివరించారు. -
విజయవాడకు కొత్త పోలీస్ కమీషనర్ !
-
పోలీసుల తీరు జుగుప్సాకరం!
లేని రికార్డులు సృష్టించడం దారుణం: హైకోర్టు పీడీ కేసుల్లో సకాలంలో నిర్బంధ కారణాలను వెల్లడించని పోలీసులు ధర్మాసనం పరిశీలనకు ముందు రికార్డుల్లో మార్పులు తీవ్రంగా పరిగణించిన న్యాయస్థానం.. ప్రభుత్వానికి రూ.50 వేల జరిమానా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీపీకి ఆదేశం సాక్షి, హైదరాబాద్: తెలివైన నేరస్తులైనా ఏదో ఒక చిన్న తప్పు చేసి పోలీసులకు దొరికిపోతూ ఉంటారు. మరి పోలీసులే తప్పు చేసి కోర్టుకు దొరికిపోతే..? హైదరాబాద్ పోలీసులు తప్పుడు రికార్డులు సృష్టించి హైకోర్టుకు అడ్డంగా దొరికిపోయారు. దీనిపై విస్మయం వ్యక్తం చేసిన హైకోర్టు.. ఇటువంటి చర్యల వల్ల అధికార యంత్రాంగంపై పౌరులకు ప్రతికూల భావన ఏర్పడుతుందని స్పష్టం చేసింది. న్యాయ ప్రక్రియను కూడా కలుషితం చేస్తుందని ఆక్షేపించింది. పోలీసుల తప్పునకు గాను ప్రభుత్వానికి రూ.50 వేల జరిమానా విధించింది. ఈ మొత్తం వ్యవహారంపై శాఖాపరమైన విచారణ జరపాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్ ఎం.ఎస్.కె.జైశ్వాల్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. నిర్బంధం వివరాలివ్వనందుకు.. హర్యానాకు చెందిన సురేందర్సింగ్, ఫూల్సింగ్లను తెలంగాణ పీడీ యాక్ట్ కింద నిర్బంధిస్తూ ఈ ఏడాది మార్చి 7న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. అరుుతే సురేందర్, ఫూల్సింగ్ల నిర్బంధంపై వారి తల్లి, భార్య హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై ఇటీవల న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది బి.మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. సురేందర్, ఫూల్సింగ్ల చర్యలు శాంతిభద్రతల సమస్య కిందకు వస్తాయే తప్ప, పబ్లిక్ ఆర్డర్ ఉల్లంఘన కిందకు రావని తెలిపారు. పీడీ చట్టం ప్రకారం.. నిర్బంధించిన కారణాలను ఆ వ్యక్తులకు నిర్బంధ ఉత్తర్వులు వెలువరించిన ఐదు రోజుల్లోపు వారికి అర్థమయ్యే భాషలో అందచేయాల్సి ఉంటుందని నివేదించారు. ఈ కేసులో సురేందర్, ఫూల్సింగ్లకు హిందీ మాత్రమే వచ్చునని, పోలీసులు వారికి నిర్ణీత గడువులోపు ఆ భాషలో నిర్బంధ కారణాలను తెలియచేయలేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అరుుతే తాము గడువులోపే హిందీ కాపీలను సురేందర్, ఫూల్సింగ్లకు అందచేశామని పోలీసులు కోర్టుకు నివేదించారు. దీంతో మొత్తం రికార్డులను తెప్పించుకుని పరిశీలించిన ధర్మాసనం.. పోలీసులు తప్పుడు రికార్డులను చేర్చినట్లుగా గుర్తించింది. ‘‘10వ పేజీలో సురేందర్‌సింగ్‌కు ఇంగ్లిష్ కాపీలను చంచల్‌గూడ జైలర్ సమక్షంలో అందజేశారనేందుకు అక్నాలడ్జ మెంట్ ఉంది. దానిపై సురేందర్ వేలిముద్ర, జైలర్ సంతకం ఉన్నారుు. 11వ పేజీలో మార్చి 12న హిందీ కాపీలను అందుకున్నట్లు సురేందర్ వేలిముద్ర ఉంది. దానిపై జైలర్ సంతకంగానీ, సీల్గానీ లేదు. 12వ పేజీలో సురేందర్ నిర్బంధ ఉత్తర్వులు, కారణాల కాపీలను స్థానిక భాషలో అందచేసినట్లు మార్చి 8వ తేదీన జైలర్ ధ్రువీకరించినట్లు ఉంది. 12వ తేదీన హిందీలో కాపీలను అందచేసి ఉంటే.. అందుకు సంబంధించిన అక్నాలజ్డ్మెంట్ 10, 12 పేజీల మధ్యకు ఎందుకు వచ్చినట్లు?..’’ అని ధర్మాసనం పోలీసులను నిలదీసింది. ఇదంతా వెలుగు లోకి వచ్చాకైనా జైలర్ సమక్షంలోనే హిందీ కాపీలను ఇచ్చామనేందుకు ఆధార పూర్వకం గా జైలర్ అఫిడవిట్‌ను కూడా పోలీసులు దాఖలు చేయలేదని పేర్కొంది. అంటే కోర్టు ను తప్పుదోవ పట్టించేందుకే పోలీసులు రికార్డులు మార్చినట్లు అర్థమవుతోందని స్పష్టం చేసింది. పోలీసుల తీరు చెప్పడానికే రోతగా ఉందని, ప్రతివాదులు ప్రభుత్వం, పోలీసుశాఖ అయి ఉండీ ఇటువంటి తప్పుడు పద్ధతుల ద్వారా కోర్టును మోసం చేసేందుకు యత్నించాయని ఆక్షేపించింది. గడువులోపు సంబంధిత భాషలో నిర్బంధ కారణాలను వివరించే కాపీలను అందచేయనందున.. సదరు వ్యక్తుల నిర్బంధం ఉత్తర్వులను రద్దు చేస్తూ ధర్మాసనం తీర్పు ఇచ్చింది. -
సీపీ గౌతం సవాంగ్‌కు డీజీపీ హోదా
విజయవాడ : నగర పోలీసు కమిషనర్ డి.గౌతం సవాంగ్‌కు పదోన్నతి లభించింది. ఆయనకు డీజీపీ హోదా కల్పిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అడిషినల్ డీజీ కేడర్‌లో ఉన్న ఆయనను డీజీ కేడర్ అధికారిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.టక్కర్ జీవో జారీ చేశారు. -
పుష్కరాలకు సహకరించండి
విజయవాడ, కృష్ణా పుష్కరాల విజయవంతానికి సహకరించాలని నగర పోలీసు కమిషనర్ డి. గౌతం సవాంగ్ రాజకీయ పక్షాల నాయకులను కోరారు. సోమవారం ఆయన కమిషనరేట్‌లో వివిధ పార్టీలతో నేతలతో సమావేశం నిర్వహించారు. సీపీ మాట్లాడుతూ 12ఏళ్ళకు జరిగే పుష్కరాల పండుగను ప్రతి ఒక్కరు తమ సొంత కార్యక్రమంగా భావించి సహృదయంతో విజయవంతయ్యేలా సహకరించాలని కోరారు. ఈ పుష్కరాలకు రాష్ట్రం నలుమూలల నుంచే గాక దేశం మొత్తం నుండి భక్తులు తరలి వస్తారని సీపీ చెప్పారు. ఎంత పెద్ద ఎత్తున జనం వచ్చినా వాటిని సమర్థవంతంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశామన్నారు. పుష్కరాలకు వచ్చే ప్రతి« అతిథి సంతోషంగా తిరిగి వెళ్లలా అందరూ సహకరించాలని కోరారు. సమావేశానికి హాజరైన నాయకులు మాట్లాడుతూ ఒన్‌టౌన్ పరిధిలో అర్జున వీధి, బ్రాహ్మణ వీధి, కృష్ణలంక ఏరియాల్లో జరిగే ఇబ్బందులను వివరించారు. వాటిపై సీపీ స్పందిస్తూ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు. పుష్కరాల రోజుల్లో ఎటువంటి ఆందోళణలు, ఉద్యమాలు జరపకుండా రాజకీయపార్టీల నాయకులు వాయి దా వేసుకున్నారని సీపీ చెప్పారు. ఈ సమావేశంలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ, బీజేపీ అధ్యక్షుడు దాసం ఉమామహేశ్వరరాజు, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లాది విష్ణు, సీపీఐ, సీపీఎం నగర శాఖ అధ్యక్షులు దోనేపూడి కాశీనాథ్, శంకర్, బిజెపి, టిడిపి, లోక్‌సత్తా తదితర పార్టీల నాయకులు పాల్గొన్నారు. -
డమ్మీ కేబుల్ ఆపరేటర్‌కు సహకరిస్తున్న ఎస్సై
పోలీసు కమిషనర్‌ను కలిసిన ఆపరేటర్లు వరంగల్ : పర్వతగిరి మండలం నారాయణపురంలోని కేబుల్ ఆపరేటర్‌ను ఇబ్బందులకు గురిచేస్తున్న డమ్మీ ఆపరేటర్‌పై ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా ఆయనకే సహకరిస్తున్న ఎస్సైపై విచారణ జరపాలని తెలంగాణ రూరల్ ఎంఎస్ఓ, కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు వారు శనివారం పోలీసు కమిషనర్ సుధీర్‌బాబుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేబుల్ ఆపరేటర్స్ వెల్పేర్ అసోసియేషన్‌కు చెందిన ఓఎఫ్సీ కేబుల్‌ను నారాయణపురంలోని వాటర్ ట్యాంకు వద్ద మూడ్ రవి కట్ చేసి తన బంధువులకు కనెక్షన్ ఇచ్చాడని తెలిపారు. ఈ విషయమై పర్వతగిరి ఎస్సైకి ఫిర్యాదు చేయడంతో పాటు ఆధారాల సీడీ అందజేస్తే ప్రొబెషనరీ ఎస్సైతో విచారణ చేయించారని పేర్కొన్నారు. అనంతరం అక్రమంగా బిగించిన ఓఎఫ్సీ వైరు తొలగించారే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. మళ్లీ గత నెలలో వైర్ కట్ చేసి వేరే కనెక్షన్లు ఇస్తుండగా సూర రమేష్‌ను పట్టుకుని ప్రశ్నిస్తే ఎస్సై చెబితేనే చేస్తున్నట్లు తెలిపాడన్నారు. ఈ విషయమై ఎస్సైని కలిస్తే పట్టించుకోకపోగా పర్వతగిరి ఎంఎస్ఓకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని తెలిపారు. ఈ మేరకు పూర్తిస్థాయిలో విచారణ జరిపిం చాలని పర్వతగిరి ఎంఎస్ఓ గోగినేని భవానీశంకర్రావుతో పాటు అసోసియేషన్ రూరల్ జిల్లా అధ్యక్షుడు పాల్వంచ కోటేశ్వర్, సెక్రటరీ బైరీ శ్రీనివాస్, వంగాల ఉమాశంకర్లింగం, రాజేష్ కోరారు. -
లక్ష్యసాధన కోసం అభ్యర్థులు శ్రమించాలి
ఎంజీఎం : దేహదారుఢ్య పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ లక్ష్యసాధన కోసం మరింత శ్రమించాల్సి ఉంటుందని వరంగల్ పోలీసు కమిషనర్ జి.సుధీర్‌బాబు సూచించారు. గురువారం పోలీస్ కానిస్టేబుళ్ల నియామకంలో భాగంగా గతంలో నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు హన్మకొండలోని జేఎన్ఎస్ గ్రౌండ్స్‌లో ఏడో రోజు దేహదారుఢ్య పరీక్షలు కొనసాగించారు. ఈ సందర్భంగా కమిషనర్ సుధీర్‌బాబు మాట్లాడుతూ నిత్యం సాధన చేయడం ద్వారా పోలీసు కొలువులు సాధించడం చాలా సులభమవుతుందని సూచించారు. గురువారం 963 మంది అభ్యర్థులు 800 మీటర్ల అర్హత పరీక్షకు హాజరయ్యారు. 172 మంది మహిళా అభ్యర్థులు 100 మీటర్ల పరుగు, షాట్‌పుట్, లాంగ్‌జంప్ అంశాలల్లో పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ యాదయ్య, పరిపాలన విభాగం అధికారి స్వరూపరాణి, ఏసీపీలు శోభన్‌కుమార్, జనార్దన్, మహేందర్, సురేంద్రనాథ్, వెంకటేశ్వరరావు, ఈశ్వర్రావు, రవీందర్రావు, రమేశ్‌కుమార్ పాల్గొన్నారు. -
ఒక్కరోజు సీపీగా సాదిక్
-
చిన్ని... చిన్ని...ఆశ
-
ఒక్కరోజు పోలీస్ కమిషనర్ గా సాదిక్
-
ఒక్కరోజు సీపీగా సాదిక్
హైదరాబాద్ : తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఓ చిన్నారి చిరకాల కోరికను మేక్ ఏ విష్ ఫౌండేషన్ తీర్చింది. కరీంనగర్ జిల్లాకు చెందిన సాదిక్ (10) బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. అయితే కమిషనర్ ఆఫ్ పోలీస్ కావలన్నది అతడి కోరిక. మేక్ ఏ విష్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ సాదిక్ కోరికను తీర్చింది. సాదిక్ బుధవారం ఉదయం తన ఇంటికి వచ్చిన బుగ్గకారులో కమిషనర్ కార్యాలయానికి వెళ్లాడు. ఈ బుల్లి కమిషనర్‌కు అక్కడ రెడ్ కార్పెట్ పరిచి మరీ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కానిస్టేబుళ్లు సాదిక్‌కు గౌరవ వందనం చేసారు. అనంతరం నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి అతడిని సీపీ సీట్లో కూర్చొపెట్టారు. -
శివ.. ఓ క్రిమినల్ జీవిత కథ!