సీపీ గౌతం సవాంగ్‌కు డీజీపీ హోదా
విజయవాడ :
నగర పోలీసు కమిషనర్ డి.గౌతం సవాంగ్‌కు పదోన్నతి లభించింది. ఆయనకు డీజీపీ హోదా కల్పిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అడిషినల్ డీజీ కేడర్‌లో ఉన్న ఆయనను డీజీ కేడర్ అధికారిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.టక్కర్ జీవో జారీ చేశారు.