సాక్షి, విశాఖపట్నం: ప్రారంభోత్సవ తేదీ ఖరారైన వెంటనే విశాఖలో దిశ పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించనున్నామని విశాఖ నగర సీపీ ఆర్కే మీనా తెలిపారు. శనివారం నగర కమిషనరేట్ కాన్ఫరెన్స్ హాలులో ’దిశ’ చట్టంపై ప్రభుత్వం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయనతో పాటు డీసీపీ రంగారెడ్డి, పలువురు అధికారులు, మహిళ మిత్రలు హాజరయ్యారు. ఈ సందర్భంగా నగర సీపీ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇప్పటికే పోలీస్‌స్టేషన్‌ల ఏర్పాటు, వాహనాలు, కోర్టులు, పిపీలు, ఫోరెన్సిక్ ల్యాబ్‌ల కోసం నిధులు మంజూరు చేసిందని వెల్లడించారు. (అందుకే దిశ చట్టం తీసుకువచ్చాం: సీఎం జగన్)
రాష్ట్రంలో తిరుపతి, విశాఖల్లో కొత్తగా ఫోరెన్సిక్ ల్యాబ్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందన్నారు. ‘డయల్ 100’ కూడా చురుగ్గా పనిచేస్తోందని.. ఫిర్యాదు అందిన వెంటనే 3 నుంచి 5 నిమిషాల్లో సిబ్బంది చేరుకుంటున్నారని చెప్పారు. విశాఖ లో ఇద్దరు డిఎస్పీలు, ఐదుగురు ఎస్‌ఐలు, ఆరుగురు హెచ్‌సీలు, 38 మంది మహిళా కాని స్టేబుళ్ల తో ‘దిశ’ పీఎస్ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఆధునాతన విదేశీ పరికరాలతో మార్చి చివరి నాటికి ఫోరెన్సిక్ ల్యాబ్ అందుబాటులోకి వస్తోందన్నారు. ప్రస్తుతం కంట్రోల్ రూమ్‌లో అన్ని భాషలపైన అవగాహన కలిగిన సిబ్బంది ఉన్నారని సీపీ ఆర్కే మీనా పేర్కొన్నారు.
(మహిళల సంరక్షణ కోసమే దిశ చట్టం: సుచరిత)
Comments
Please login to add a commentAdd a comment