పుష్కరాలకు సహకరించండి
విజయవాడ, కృష్ణా పుష్కరాల విజయవంతానికి సహకరించాలని నగర పోలీసు కమిషనర్ డి. గౌతం సవాంగ్ రాజకీయ పక్షాల నాయకులను కోరారు. సోమవారం ఆయన కమిషనరేట్‌లో వివిధ పార్టీలతో నేతలతో సమావేశం నిర్వహించారు. సీపీ మాట్లాడుతూ 12ఏళ్ళకు జరిగే పుష్కరాల పండుగను ప్రతి ఒక్కరు తమ సొంత కార్యక్రమంగా భావించి సహృదయంతో విజయవంతయ్యేలా సహకరించాలని కోరారు. ఈ పుష్కరాలకు రాష్ట్రం నలుమూలల నుంచే గాక దేశం మొత్తం నుండి భక్తులు తరలి వస్తారని సీపీ చెప్పారు. ఎంత పెద్ద ఎత్తున జనం వచ్చినా వాటిని సమర్థవంతంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశామన్నారు. పుష్కరాలకు వచ్చే ప్రతి« అతిథి సంతోషంగా తిరిగి వెళ్లలా అందరూ సహకరించాలని కోరారు. సమావేశానికి హాజరైన నాయకులు మాట్లాడుతూ ఒన్‌టౌన్ పరిధిలో అర్జున వీధి, బ్రాహ్మణ వీధి, కృష్ణలంక ఏరియాల్లో జరిగే ఇబ్బందులను వివరించారు. వాటిపై సీపీ స్పందిస్తూ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు. పుష్కరాల రోజుల్లో ఎటువంటి ఆందోళణలు, ఉద్యమాలు జరపకుండా రాజకీయపార్టీల నాయకులు వాయి దా వేసుకున్నారని సీపీ చెప్పారు. ఈ సమావేశంలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ, బీజేపీ అధ్యక్షుడు దాసం ఉమామహేశ్వరరాజు, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లాది విష్ణు, సీపీఐ, సీపీఎం నగర శాఖ అధ్యక్షులు దోనేపూడి కాశీనాథ్, శంకర్, బిజెపి, టిడిపి, లోక్‌సత్తా తదితర పార్టీల నాయకులు పాల్గొన్నారు.