సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగర కమిషనర్‌గా సందీప్ శాండిల్య బాధ్యతలు చేపట్టారు. ఆయన్ని సీపీగా నియమిస్తూ తెలంగాణ సీఎస్ శాంతికుమారి శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. తొలుత ఆయన శనివారం బాధ్యతలు స్వీకరిస్తారని పోలీస్ శాఖ ప్రకటించింది. అయితే.. ఉత్తర్వులు వెలువడిన గంటల వ్యవధిలోనే ఆయన బాధ్యతలు స్వీకరించడం గమనార్హం.
ఢిల్లీకి చెందిన సందీప్ శాండిల్య.. ఇంతకు ముందు పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా ఆయన పనిచేశారు. గతంలో సైబరాబాద్ సీపీగా, రైల్వే అడిషనల్ డీజీగా విధులు నిర్వహించారు.
సంతోషంగా ఉంది..
హైదరాబాద్ నగర కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందని సందీప్ శాండిల్య అన్నారు. ‘‘ఎలక్షన్ కమీషన్ ఇచ్చిన బాధ్యత ను సక్రమంగా నిర్వహిస్తాం. టెక్నాలజీకి తగ్గట్టుగా పని చేస్తాం. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ నిర్వహిస్తాం’’ అని తెలిపారాయన.
గుంటూరులో ఫస్ట్ పోస్టింగ్
1993 ఐపీఎస్ బ్యాచ్‌కి చెందిన సందీప్ శాండిల్య గుంటూరులో మొదటి పోస్టింగ్ పొందారు. నల్గొండ, ఆదిలాబాద్, కృష్ణా, సౌత్ జోన్, డీసీపీగా చేశారు. సీఐడీ, ఇంటిలిజెంట్ సెక్యూరిటీ వింగ్‌లో, అడిషనల్ పోలీస్ కమిషనర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేశారు. 2016 నుంచి 2018 వరకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా విధులు నిర్వహించారు. అడిషనల్ డీజీ రైల్వే అండ్ రోడ్ సేఫ్టీగా విధులు నిర్వహించిన శాండిల్య.. జైళ్ల శాఖ డీజీగానూ మూడు నెలల పాటు పనిచేశారు.
కాగా, రానున్న తెలంగాణా ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఈసీ ఏకంగా 20 మంది ఉన్నతస్థాయి అధికారులను బదిలీ చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సహా నలుగురు జిల్లాల కలెక్టర్లు, 13 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. వారి స్థానంలో కొత్త వారిని నియమించాలని ప్రభుత్వానికి సూచించింది. గురువారం సాయంత్రం 5 గంటలలోపు పూర్తిస్థాయి ప్రిన్సిపల్ సెక్రటరీల నివేదికను పంపించాలని కోరింది. ఈ మేరకు ప్రతిపాదిక జాబితా చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి ఈసీకి పంపగా ఇందులోని పలువురి పేర్లను ఖరారు చేసింది.
తెలంగాణా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీకి సంబంధించి అన్ని పోస్టుల నియామకాలపై ఉత్తర్వులు జారీ అయ్యాయి. పది జిల్లాలకు కొత్త ఎస్పీలు, వరంగల్, నిజమాబాద్‌కు కొత్త కమిషనర్ల నియామకం జరిగింది.
యాదాద్రి కలెక్టర్‌గా హనుమంత్, నిర్మల్ కలెక్టర్‌గా ఆశీష్ సంగ్వాన్, రంగారెడ్డి కలెక్టర్‌గా భారతీ హోలీకేరి, మేడ్చల్ కలెక్టర్‌గా గౌతం, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణీ ప్రసాద్, ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ ముఖ్యకార్యదర్శిగా సునీల్ శర్మ, ఎక్సైజ్ కమిషనర్‌గా జ్యోతి బుద్ధ ప్రకాశ్, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌గా క్రిస్టినా నియమితులయ్యారు. అలాగే వరంగల్ కమిషనర్‌గా అంబర్ కిషోర్ ఝా , నిజామాబాద్ కమిషనర్‌గా కల్మేశ్వర్‌ని ఎంపిక చేశారు.
పోలీసు కమిషనర్లు, ఎస్పీల జాబితా వివరాలు
►సంగారెడ్డి - చెన్నూరి రూపేష్
►కామారెడ్డి- సింధు శర్మ
►జగిత్యాల- సన్‌ప్రీత్ సింగ్
►మహబూబ్ నగర్ - హర్షవర్ధన్
►నాగర్ కర్నూల్- గైక్వాడ్ వైభవ్ రఘునాథ్
►జోగులాంబ గద్వాల్- రితిరాజ్
►మహబూబాద్ - డాక్టర్ పాటిల్ సంగ్రామ్
►నారాయణపేట - యోగేష్ గౌతమ్
►జయశంకర్ భూపాలపల్లి - ఖరే కిరణ్ ప్రభాకర్
►సూర్యాపేట- బీకే రాహుల్ హెగ్డే
►వరంగల్ పోలీసు కమిషనర్-అంబర్ కిషోర్ ఝా
►నిజామాబాద్ పోలీసు కమిషనర్ -కల్మేశ్వర్ సింగేనేవర్
చదవండి: కాంగ్రెస్ పార్టీకి పొన్నాల లక్ష్మయ్య రాజీనామా
Comments
Please login to add a commentAdd a comment