Sandeep Shandilya
-
హైదరాబాద్ బోరబండ సీఐ రవికుమార్ పై వేటు
-
Hyderabad: సీపీ ఆకస్మిక తనిఖీ.. బోరబండ సీఐపై వేటు
హైదరాబాద్: బోరబండ పీఎస్‌ను హైదరాబాద్ నగర సీపీ సందీప్ శాండిల్య ఆకస్మిక తనిఖీ చేశారు. మంగళవారం బోరబండ పోలీస్ స్టేషన్‌కు ఆకస్మికంగా వచ్చిన సీపీ.. సీఐ రవికుమార్‌ను రౌడీ షీటర్ల లెక్క అడిగారు. దీనికి సీఐ రవికుమార్ తటపటాయించారు. అసలు రౌడీ షీటర్లు ఎవరో గుర్తించు అంటూ సీఐని సీపీ వెంట తీసుకెళ్లారు. రౌడీ షీటర్ల ఇళ్లను సీఐ రవికుమార్ గుర్తించలేకపోయారు. దాంతో సీఐను సీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు సందీప్ శాండిల్య. పనిమనిషిపై అత్యాచారం కేసులో మురళీ ముకుంద్ అరెస్ట్ ‘‘క్లిక్ చేసి వాట్సాప్ ఛానెల్ ఫాలో అవ్వండి’’ -
హైదరాబాద్ సీపీగా బాధ్యతలు స్వీకరించిన సందీప్ శాండిల్య
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగర కమిషనర్‌గా సందీప్ శాండిల్య బాధ్యతలు చేపట్టారు. ఆయన్ని సీపీగా నియమిస్తూ తెలంగాణ సీఎస్ శాంతికుమారి శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. తొలుత ఆయన శనివారం బాధ్యతలు స్వీకరిస్తారని పోలీస్ శాఖ ప్రకటించింది. అయితే.. ఉత్తర్వులు వెలువడిన గంటల వ్యవధిలోనే ఆయన బాధ్యతలు స్వీకరించడం గమనార్హం. ఢిల్లీకి చెందిన సందీప్ శాండిల్య.. ఇంతకు ముందు పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా ఆయన పనిచేశారు. గతంలో సైబరాబాద్ సీపీగా, రైల్వే అడిషనల్ డీజీగా విధులు నిర్వహించారు. సంతోషంగా ఉంది.. హైదరాబాద్ నగర కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందని సందీప్ శాండిల్య అన్నారు. ‘‘ఎలక్షన్ కమీషన్ ఇచ్చిన బాధ్యత ను సక్రమంగా నిర్వహిస్తాం. టెక్నాలజీకి తగ్గట్టుగా పని చేస్తాం. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ నిర్వహిస్తాం’’ అని తెలిపారాయన. గుంటూరులో ఫస్ట్ పోస్టింగ్ 1993 ఐపీఎస్ బ్యాచ్‌కి చెందిన సందీప్ శాండిల్య గుంటూరులో మొదటి పోస్టింగ్ పొందారు. నల్గొండ, ఆదిలాబాద్, కృష్ణా, సౌత్ జోన్, డీసీపీగా చేశారు. సీఐడీ, ఇంటిలిజెంట్ సెక్యూరిటీ వింగ్‌లో, అడిషనల్ పోలీస్ కమిషనర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో పనిచేశారు. 2016 నుంచి 2018 వరకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా విధులు నిర్వహించారు. అడిషనల్ డీజీ రైల్వే అండ్ రోడ్ సేఫ్టీగా విధులు నిర్వహించిన శాండిల్య.. జైళ్ల శాఖ డీజీగానూ మూడు నెలల పాటు పనిచేశారు. కాగా, రానున్న తెలంగాణా ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఈసీ ఏకంగా 20 మంది ఉన్నతస్థాయి అధికారులను బదిలీ చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సహా నలుగురు జిల్లాల కలెక్టర్లు, 13 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. వారి స్థానంలో కొత్త వారిని నియమించాలని ప్రభుత్వానికి సూచించింది. గురువారం సాయంత్రం 5 గంటలలోపు పూర్తిస్థాయి ప్రిన్సిపల్ సెక్రటరీల నివేదికను పంపించాలని కోరింది. ఈ మేరకు ప్రతిపాదిక జాబితా చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి ఈసీకి పంపగా ఇందులోని పలువురి పేర్లను ఖరారు చేసింది. తెలంగాణా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీకి సంబంధించి అన్ని పోస్టుల నియామకాలపై ఉత్తర్వులు జారీ అయ్యాయి. పది జిల్లాలకు కొత్త ఎస్పీలు, వరంగల్, నిజమాబాద్‌కు కొత్త కమిషనర్ల నియామకం జరిగింది. యాదాద్రి కలెక్టర్‌గా హనుమంత్, నిర్మల్ కలెక్టర్‌గా ఆశీష్ సంగ్వాన్, రంగారెడ్డి కలెక్టర్‌గా భారతీ హోలీకేరి, మేడ్చల్ కలెక్టర్‌గా గౌతం, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణీ ప్రసాద్, ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ ముఖ్యకార్యదర్శిగా సునీల్ శర్మ, ఎక్సైజ్ కమిషనర్‌గా జ్యోతి బుద్ధ ప్రకాశ్, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌గా క్రిస్టినా నియమితులయ్యారు. అలాగే వరంగల్ కమిషనర్‌గా అంబర్ కిషోర్ ఝా , నిజామాబాద్ కమిషనర్‌గా కల్మేశ్వర్‌ని ఎంపిక చేశారు. పోలీసు కమిషనర్లు, ఎస్పీల జాబితా వివరాలు ►సంగారెడ్డి - చెన్నూరి రూపేష్ ►కామారెడ్డి- సింధు శర్మ ►జగిత్యాల- సన్‌ప్రీత్ సింగ్ ►మహబూబ్ నగర్ - హర్షవర్ధన్ ►నాగర్ కర్నూల్- గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ►జోగులాంబ గద్వాల్- రితిరాజ్ ►మహబూబాద్ - డాక్టర్ పాటిల్ సంగ్రామ్ ►నారాయణపేట - యోగేష్ గౌతమ్ ►జయశంకర్ భూపాలపల్లి - ఖరే కిరణ్ ప్రభాకర్ ►సూర్యాపేట- బీకే రాహుల్ హెగ్డే ►వరంగల్ పోలీసు కమిషనర్-అంబర్ కిషోర్ ఝా ►నిజామాబాద్ పోలీసు కమిషనర్ -కల్మేశ్వర్ సింగేనేవర్ చదవండి: కాంగ్రెస్ పార్టీకి పొన్నాల లక్ష్మయ్య రాజీనామా -
పోలీస్ అకాడమీ సంచాలకుడిగా సందీప్ బాధ్యతలు
బండ్లగూడ: రాజా బహదూర్ వెంకట రామిరెడ్డి తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడామీ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సందీప్ శాండిల్య.. అకాడమీ సంచాలకుడిగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. 1993 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి సందీప్ శాండిల్య ఈనెల 3న జరిగిన పోలీస్ ఉన్నతాధికారుల బదిలీల ఉత్తర్వులను అనుసరించి రైల్వే, రోడ్ సేఫ్టీ విభాగం నుంచి బదిలీపై వచ్చారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆయన్ను అధికారులు, సిబ్బంది ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. -
ఆ కిరాతకానికి పాల్పడింది వీళ్లే..!
సాక్షి, హైదరాబాద్: సంచలనం రేపిన బొటానికల్ గార్డెన్ వద్ద గర్భిణీ మృతదేహం పడేసిన కేసులో పోలీసులు నిందితులను మంగళవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. నిండు గర్భిణీ అన్న కనీస కనికరం లేకుండా ఆమెను హతమార్చిన నిందితుల వివరాలు మీడియాకు వెల్లడించారు. వివాహేతర సంబంధాలే ఈ హత్యకు కారణమని పోలీసులు తేల్చారు. మృతురాలు పింకీ స్వస్థలం బిహార్‌లోని కుగ్రామమని, వివాహేతర అక్రమ సంబంధాలే ఆమెను బలిగొన్నాయని తెలిపారు. దారుణం జరిగిందిలా.. బిహార్‌కు చెందిన బింగి అలియాస్ పింకీకి దినేశ్ అనే వ్యక్తితో 15 ఏళ్ల కిందట వివాహం జరిగింది. 2017లో భర్తను విడిచిపెట్టిన పింకీ.. వికాస్ అనే వ్యక్తితో సహజీవనం చేయడం మొదలుపెట్టింది. అయితే, వికాస్‌కు అంతకుముందు నుంచే మమతా ఝా అనే మహిళతో అక్రమ సంబంధం ఉంది. మమతా ఝా, అనిల్ ఝా భార్యాభర్తలు.. వారి కుమారుడు అమర్‌కాంత్ ఝా. బతుకుదెరువు కోసం వీరు హైదరాబాద్‌కు వచ్చారు. ఈ క్రమంలో తన ప్రియుడు వికాస్‌ను వెతుక్కుంటూ పింకీ కూడా హైదరాబాద్ వచ్చింది. ఇక్కడ అమర్ కాంత్ కుటుంబంతో కలిసి ఉంటున్న వికాస్‌కు అతని తల్లి మమతతో అక్రమ సంబంధం ఉన్న విషయాన్ని పింకీ గ్రహించింది. దీని గురించి వికాస్‌ను నిలదీసింది. ఈ కోపంలోనే గత నెల 29న పింకీపై నలుగురూ దాడి చేశారు. వారు కిరాతకంగా కొట్టడంతో కడుపులోని పాప సహా పింకీ చనిపోయింది. ఆ తర్వాత స్టోన్ కట్టర్‌తో మృతదేహాన్ని ముక్కలు చేసి..గోనెసంచిలో పడేసి.. రాత్రి సమయంలో బైక్ మీద మృతదేహాన్ని తరలించారు. ఈ కేసులో నిందితులైన మమతా ఝా, అనిల్ ఝా, అమర్‌కాంత్ ఝా, వికాస్‌లను అరెస్ట్ చేశారు. చాలెంజ్‌గా మారిన ఈ మర్డర్ మిస్టరీని సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. 150 సీసీ కెమెరాల్లో ఈ ఘటనను పరిశీలించి.. నిందితుల ఆచూకీ కనిపెట్టినట్టు సీపీ సందీప్ శాండిల్య మీడియాకు తెలిపారు. -
31న సిటీలో ఆ రోడ్లన్నీ బంద్
సాక్షి,హైదరాబాద్ : ఈనెల 31న రాత్రి 9 నుంచి తెల్లవారు జామున 3 గంటల వరకు అన్ని ఫ్లైఓవర్లను మూసి వేస్తున్నట్లు సైబరాబాద్ సీపీ సందీప్ శాండిల్య ప్రకటిం చారు. గురువారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డ్రంక్ అండ్ డ్రైవ్ కోసం 120 బృందాల ను రంగంలోకి దించినట్లు ఆయన వెల్లడించారు. హోటల్ యాజమాన్యాలు అతిగా మద్యం సేవించిన వారిని క్యాబుల్లో ఇంటికి తరలించాలన్నారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే డయల్ 100కు ఫోన్ చేయాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే వాహనాన్ని సీజ్ చేస్తామని హెచ్చరించారు. బార్లు, పబ్బులు, మద్యం దుకాణాలు కచ్ఛితమైన సమయ పాలన పాటించాలన్నారు. ఔటర్ రింగురోడ్డుపై రాత్రి 9 నుంచి వేకువజామున 3గంటల వరకు ఆంక్షలు ఉంటాయన్నారు. న్యూ ఇయర్ వేడుకల్లో డీజే పెట్టుకోవాలంటే అనుమతి తీసుకోవాలన్నారు. పబ్బులు, బార్లలోకి మైనర్లను అనుమతించకూడదని, ఈవెంట్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. -
ఈ ఏడాది కేసులు పెరిగాయి: సీపీ
సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్ పరిధిలో ఈ ఏడాది కేసుల సంఖ్య పెరిగిందని సైబరాబాద్ సీపీ సందీప్ శాండిల్యా తెలిపారు. ఏడాదిలో మొత్తం 2600 కేసులు నమోదయ్యాయని.. గతేడాదితో పోలిస్తే 800 కేసులు పెరిగాయన్నారు. ఆయనిక్కడ శుక్రవారం మాట్లాడుతూ..' సైబరాబాద్ పరిధిలో 729కి మందికి ఓ పోలీస్ చొప్పున భద్రత పర్యవేక్షిస్తున్నారు. నగరంలో అన్ని పండుగలు శాంతియుతంగా జరిగేలా పోలీసులు పనిచేశారు. అంతే కాకుండా 35 జాతీయ, అంతర్జాతీయ సదస్సులకు భారీ భద్రత కల్పించాం. సైబరాబాద్ పరిధిలోని షీ టీమ్స్180 కౌన్సిలింగ్ సెషన్స్ నిర్వహించి, 70 వేల మంది మహిళలకు అవగాహన కల్పించారు. సోషల్ మీడియాలో మహిళల పట్ల అసభ్యంగా పోస్టులు పెట్టిన 870 కేసులను షీ టీమ్స్ పరిష్కరించాయి. వరకట్న వేధింపులు, గృహహింస నుంచి మహిళలకు రక్షణ కల్పించేలా ఐదు ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్లు పనిచేస్తున్నాయి. ఆరు సెన్సేషనల్ డెకాయిడ్స్ కేసులను చేధించాం. పెరు అంతర్జాతీయ దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నాము. 100 గుట్కా కేసులు నమోదు చేసి.. 3 కోట్ల 79 లక్షల విలువైన గుట్కా సీజ్ చేశాం. ఔటర్ రింగ్ రోడ్డులో ప్రమాదాలు జరుగకుండా 9 స్పీడ్ లేజర్ గన్స్ ఏర్పాటు చేశాము. మరో వైపు 13 వేల 500 డ్రంక్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి' అని సీపీ తెలిపారు. -
అవగాహనతోనే సైబర్ నేరాల నియంత్రణ
సాక్షి, సిటీబ్యూరో: ప్రజలు సైబర్ నేరాలు బారినపడకుండా ఉండేందుకు ఆన్లైన్ లావాదేవీలపై అవగాహన పెంపొందించుకోవాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్యా అన్నారు. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) సహకారంతో సైబరాబాద్ కమిషనరేట్‌లో పోలీసులు, క్యాబ్, ఆటో డ్రైవర్లకు నగదు రహిత లావాదేవీలపై శనివారం ఐడీఆర్‌బీటీ ఫ్రొఫెసర్, మొబైల్ పేమెంట్ ఫోరమ్ ఫర్ ఇండియా కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ వీఎన్ శాస్త్రి, సైబర్ సెల్ ఏసీపీ జయరాం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీపీ సందీప్ శాండిల్యా మాట్లాడుతూ...సైబర్ నేరాల్లో రికవరీ కావడం చాలా కష్టమని, అందుకే సైబర్ నేరాలు జరిగే తీరు, వాటి బారినపడకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. నగదు రహిత లావాదేవీల వినియోగం కారణంగా ఎదురయ్యే కొత్త తరహా మోసాలను ఆధునిక పరిజ్ఞానంతో పరిష్కరించాలని సూచించారు. ఇందుకోసం లా అండ్ అర్డర్, సైబర్ సెల్ అధికారులు సమన్వయంతో పని చేయాలని కోరారు. జాయింట్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ...మొబైల్ పేమెంట్లపై వివిధ టెక్నిక్లను వినియోగదారులకు వివరించడంపై దృష్టి సారించాలన్నారు. ఒకటి ఆఫ్‌లైన్, ఒకటీ ఆన్లైన్ లావాదేవీల కోసం రెండు బ్యాంక్ ఖాతాలు వినియోగించడం ద్వారా సైబర్ నేరాలకు చెక్ పెట్టవచ్చన్నారు. మొబైల్ బ్యాంకింగ్‌లో ఆ¯న్‌లైన్ నగదు లావాదేవీలకు అన్‌స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీసు డాటా (యూఎస్ఎస్డీ) ఎంతో ఉత్తమమని డాక్టర్ వీఎన్ శాస్త్రి వివరించారు. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ, కనడ, పంజాబీ తదితర అన్ని భాషల్లో యూఎస్ఎస్డీ ఉంటుందని, గ్రామీణ ప్రాంత ప్రజలకైనా సులభంగా ఆన్లైన్ నగదు లావాదేవీలు అర్ధమవుతాయన్నారు. క్రెడిట్‌కార్డు మోసాలు, ఫిషింగ్, స్కిమ్మింగ్, విషింగ్లపై వివరించారు.సైబర్ నేరగాళ్ల ఎత్తుగడలు, పోలీసులు స్పందించాల్సిన తీరుపై ఏసీపీ జయరాం వివరించారు. ఎస్సీఎస్సీ కార్యదర్శి భరణి కుమార్ మాట్లాడుతూ...‘మొబైల్ వినియోగంలో భారత్ రెండో స్థానంలో ఉందని, నగదు రహిత లావాదేవీలపై అవగాహన తీసుకరావడం ద్వారా క్యాష్‌లెస్ ఎకానమీలో ప్రపంచంలోనే తొలి స్థానం సాధించవచ్చ’ని వివరించారు. కార్యక్రమంలో సైబరాబాద్ డీసీపీలు, ఏసీపీలు, ఎస్‌హెచ్‌వోలు, ఈ–కాప్స్, షీ టీమ్స్, సైబర్ క్రైమ్ పోలీసులు, ఎస్సీఎస్సీ ప్రతినిథులు పాల్గొన్నారు. -
మగ బిడ్డ కావాలనే ఆశతో..
సాక్షి, సిటీబ్యూరో: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో కలకలం సృష్టించిన బుర్కా గ్యాంగ్ మిస్టరీ వీడిపోయింది. ఓ తండ్రికి మగబిడ్డ కావాలనే ఆశతోనే ఈ కిడ్నాప్ చేసిన ఫాహీమా బేగం, అజీమ్ ఖాన్, ప్రవీణ్ బేగమ్‌లను రాజేంద్రనగర్ పోలీసులు, శంషాబాద్ ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్య శనివారం మీడియాకు వివరలు వెల్లడించారు. గోడేఖబర్కు చెందిన వాహీద్కు ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. మగ సంతానం కలిగినా అతను ఐదు నెలల వయస్సులో చనిపోవడంతో మగపిల్లవాడిని దత్తత ఇస్తే తీసుకుంటానని తన సోదరి పర్వీన్ బేగం, బావ అజ్జులకు తెలిపాడు. దీంతో అజ్జు చింతల్మెట్లోని తన బంధువు ఫహీం బేగంను సంప్రదించాడు. అమె మగపిల్లాడిని దత్తత ఇచ్చేవారి కోసం గాలించినా ఫలితం లేకపోవడంతో వాహీద్ మగపిల్లాడిని కిడ్నాప్ చేసి తీసుకవచ్చినా అభ్యంతరం లేదని, చట్టపరంగా దత్తత డీడ్‌ను రెడీ చేసుకుంటానని చెప్పాడు. దీంతో ఈనెల 3న ఫాహీమా బేగం బుర్కా ధరించి అదే ప్రాంతంలో ఆడుకునేందుకు వెళుతున్న ఖలీమ్(4), అతని సోదరి రేష్మా(6)లను అనుసరించి, కుర్కురే ఇప్పిస్తానని తన వెంట తీసుకెళ్లింది. పిల్లలతో కలిసి ఆటో ఎక్కి సిఖ్చావనీకి చేరుకుంది. అక్కడ రేష్మాకు రూ.10 ఇచ్చి ఇచ్చి షాపునకు పంపించింది. పాప అటు వెళ్లగానే ఖలీమ్‌ను తీసుకుని కిషన్‌బాగ్‌లోని తన స్నేహితుడు అజీమ్ ఇంటికి చేరుకుంది. ఆ తర్వాత రూ.15 వేలకు వాహీద్కు బాలుడిని అప్పగించింది. దీంతో వారు నాంపల్లి కోర్టుకు వెళ్లి దత్తత తీసుకున్నట్లు ఓ అగ్రిమెంట్ డీడ్‌ను తయారుచేశారు. ఆటోపై అక్షరాల ఆధారంతో స్థానికుల సహాయంతో ఇంటికి చేరిన రేష్మా బురఖాలో వచ్చిన మహిళ తమ్ముడిని ఎత్తుకెళ్లిపోయిందని చెప్పడంతో తల్లి జబీన్ బేగం రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆయా ప్రాంతాల్లోని సీసీకెమెరాలు పరిశీలించగా, చింతల్మెట్ నుంచి సిఖ్చావాని ప్రాంతానికి ఆటోలో పిల్లాడిని తీసుకెళ్లినట్లు గుర్తించారు. ఆటోపై ఉన్న జాన్ అనే అక్షరాల అధారంగా ఆటో డ్రైవర్ ఆచూకీ తెలుసుకుని ఆటో డ్రైవర్‌ను విచారించిన పోలీసులు అతని పాత్ర లేదని నిర్ధారించుకున్నారు. ఆ తర్వాత బురకాలో ఉన్న మహిళ కోసం శ్రమించిన పోలీసులకు దొరికిన ఓ చిన్న ఆధారం అదుపులోకి తీసుకున్నారు. -
సైబరాబాద్‌లో ఐదుగురు సీఐల బదిలీ
సాక్షి,సిటీబ్యూరో: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఐదుగురు సీఐలకు స్థానచలనం కలిగింది. సైబర్‌క్రైమ్స్ సీఐ కె.బాలకృష్ణారెడ్డిని కొత్తగా ఏర్పాటు చేసిన బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌కు, దుండిగల్‌లో పనిచేస్తున్న సీహెచ్ శంకర్‌రెడ్డిని జీడిమెట్లకు, శంషాబాద్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న బొల్లం శంకరయ్యను దుండిగల్‌కు, శంషాబాద్ సీసీఎస్‌లో ఉన్న చంద్రబాబును సైబర్‌క్రైమ్స్‌కు, వెకెన్సీ రిజర్వులో ఉన్న పుష్పన్‌కుమార్‌ను సీసీఎస్ శంషాబాద్‌కు అటాచ్ చేస్తూ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
సిట్ చీఫ్‌గా శాండిల్య
వికార్ ఎన్‌కౌంటర్‌పై ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు సభ్యులుగా ఖమ్మం ఎస్పీ షానవాజ్, మరో నలుగురు సమగ్ర దర్యాప్తు తర్వాత కోర్టుకు నివేదిక ప్రభుత్వ ఉత్తర్వులు జారీ సాక్షి, హైదరాబాద్: ఉగ్రవాది వికారుద్దీన్ ముఠా ఎన్‌కౌంటర్‌పై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) రాష్ర్ట ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఐజీ(పర్సనల్) సందీప్ శాండిల్యను సిట్ చీఫ్‌గా నియమించింది. ఖమ్మం జిల్లా ఎస్పీ షానవాజ్ ఖాసిం, ఇంటెలిజెన్స్ విభాగం డీఎస్పీ ఎం.దయానంద్ రెడ్డి, ఏసీపీ ఎం.రమణకుమార్, ఇన్ స్పెక్టర్లు రాజా వెంకటరెడ్డి, ఎస్.రవీందర్ సిట్ సభ్యులుగా ఉన్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై సమగ్ర, నిష్పాక్షిక దర్యాప్తు కోసం సిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. వరంగల్ కేంద్ర కారాగారంలో విచారణ ఖైదీలుగా ఉన్న వికారుద్దీన్, సయ్యద్ అంజద్, ఎండీ జాకీర్, ఎండీ హనీఫ్, ఇజార్‌ను ఈ నెల 7న కోర్టు విచారణ నిమిత్తం హైదరాబాద్‌కు తరలిస్తుండగా నల్లగొండ జిల్లా ఆలేర్ సమీపంలో ఎన్కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. పోలీసుల ఆయుధాలు లాక్కుని కాల్పులు జరిపేందుకు వికార్ గ్యాంగ్ యత్నించడంతో ఎదురుకాల్పుల్లో నిందితులంతా చనిపోయినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌పై ఆలేర్ పోలీసుస్టేషన్లో క్రైం నెంబరు 35/2015 కింద ఐపీసీ, ఆయుధాల చట్టం, సీఆర్పీసీ సెక్షన్ల కింద కేసు నమోదైనట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విచారణ ఖైదీల మృతికి దారితీసిన పరిస్థితులను వెలుగులోకి తెచ్చేందుకు సిట్ ఆధ్వర్యంలో సమగ్ర దర్యాప్తు చేయిస్తున్నట్లు ప్రభుత్వం వివరణ ఇచ్చింది. దర్యాప్తులో భాగంగా ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన అన్ని ఆధారాలు సేకరించాలని, లోపాలుంటే వెలికి తీయాలని సిట్‌ను ఆదేశించింది. దర్యాప్తు నివేదికను సంబంధిత న్యాయస్థానంలో సిట్ సమర్పిస్తుందని తెలిపారు. -
సమన్వయంతో ట్రాఫిక్ నియంత్రణ
సీసీడీసీసీ ప్రారంభత్సోవంలో సైబరాబాద్ కమిషనర్ సాక్షి, సిటీబ్యూరో: జంట పోలీసు కమిషనరేట్ల పరిధిలో నేరాలు-ట్రాఫిక్ నియంత్రణ కోసం గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో ‘ కేంద్రీయ నేరస్తుల వివరాలు సేకరణ విభాగం’ (సీసీడీసీసీ)ను ఏర్పాటు చేశారు. దీనిని నగర అదనపు పోలీసు కమిషనర్ సం దీప్శాండిల్యాతో కలిసి సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ శుక్రవారం ప్రా రంభించారు. సీసీడీసీసీలో రెండు కమిషనరేట్లకు చెందిన నేరస్తులందరి పూర్తి వివరాలు (కుటుంబం, బంధువులు, స్నేహతులు) సేకరించి అందుబాటులో పెడతారు. వీటితో పాటు ఫొటోలు, వేలి ముద్రలనూ కూడా ఉంచుతారు. దొంగతనాలు, ఇతర నేరాలు చేసి పట్టుబడిన నేరస్తుల వివరాలు సేకరించడం సీసీడీసీసీ ముఖ్య ఉద్దేశమని కమిషనర్ ఆనంద్ తెలిపారు. ఈ వివరాలను అన్ని ఠాణాలతో పాటు ప్రత్యేక దర్యాప్తు విభాగాలకు, అవసరమైన అన్ని జిల్లాలకు పంపిస్తామన్నారు. ఇలా చేయడం వల్ల తరచూ నేరస్తుల కదలికలపై నిఘా పెట్టడంతో పాటు వారిని పట్టుకోవడమూ సులభమవుతుందన్నారు. నేరాగాళ్లపై పోలీసులకు పూర్తి అవగాహన కలిగి ఉన్నప్పుడే మంచి ఫలితాలొస్తాయన్నారు. కేవలం నేరాలే కాకుండా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించే విషయంలోనూ ఇప్పటి నుంచి రెండు కమిషనరేట్ల పోలీసులు సమన్వయంతో పని చేస్తారన్నారు. సైబరాబాద్‌లో నేరం చేసి సిటీలో.. నగరంలో నేరం చేసి సైబరాబాద్‌లో తలదాచుకుంటున్న వారిని సీసీడీసీసీలోని వివరాల ఆధారంగా ఇట్టే పట్టేయడానికి వీలవుతుందని నగర అదనపు పోలీసు కమిషనర్ సందీప్‌శాండిల్యా అన్నారు. ఇదిలా ఉండగా.. నేరగాళ్ల బారిన పడకుండా ఉండేందుకు ప్రజలు తీసుకోవాల్సిన చర్యలపై వాల్‌పోస్టర్‌ను కమిషనర్ ఆనంద్ విడుదల చేశారు. సొంత భద్రతపై దృష్టి పెట్టాలి: సీవీ ఆనంద్ నేరాల జరగుకుండా ఉండేందుకు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు సొంత భద్రతపై దృష్టి పెట్టుకోవాలి. ఉదయం, సాయంత్రం వేళ్లలో వాకింగ్‌కు వెళ్లేటప్పడు, పిల్లలకు టిఫిన్ బాక్స్ ఇవ్వడానికి స్కూళ్లకు, ఒంటరిగా ఆలయానికి వెళ్లేటప్పుడు స్నాచర్ల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలి.