
సాక్షి,హైదరాబాద్ : ఈనెల 31న రాత్రి 9 నుంచి తెల్లవారు జామున 3 గంటల వరకు అన్ని ఫ్లైఓవర్లను మూసి వేస్తున్నట్లు సైబరాబాద్ సీపీ సందీప్ శాండిల్య ప్రకటిం చారు. గురువారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డ్రంక్ అండ్ డ్రైవ్ కోసం 120 బృందాల ను రంగంలోకి దించినట్లు ఆయన వెల్లడించారు. హోటల్ యాజమాన్యాలు అతిగా మద్యం సేవించిన వారిని క్యాబుల్లో ఇంటికి తరలించాలన్నారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే డయల్ 100కు ఫోన్ చేయాలని సూచించారు.
మద్యం సేవించి వాహనాలు నడిపితే వాహనాన్ని సీజ్ చేస్తామని హెచ్చరించారు. బార్లు, పబ్బులు, మద్యం దుకాణాలు కచ్ఛితమైన సమయ పాలన పాటించాలన్నారు. ఔటర్ రింగురోడ్డుపై రాత్రి 9 నుంచి వేకువజామున 3గంటల వరకు ఆంక్షలు ఉంటాయన్నారు. న్యూ ఇయర్ వేడుకల్లో డీజే పెట్టుకోవాలంటే అనుమతి తీసుకోవాలన్నారు. పబ్బులు, బార్లలోకి మైనర్లను అనుమతించకూడదని, ఈవెంట్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment