నితిన్ గడ్కరీ (ఫైల్ ఫొటో)
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో నాలుగు జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పునాది రాయి వేయనున్నారు. శనివారం రామంతపూర్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ గ్రౌండ్స్‌లో జరగనున్న ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు హాజరవుతారు. రూ.1,523 కోట్ల రూపాయల వ్యయంతో చేపడుతున్న రోడ్డు నిర్మాణాలకు గడ్కరీ శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో హైదాబాద్-బెంగళూరు ఎన్‌హెచ్ 44, ఆరాంఘర్– శంషాబాద్‌మార్గాన్ని ఆరు లేన్ల రహదారిగా తీర్చిదిద్దడం, ఎన్‌హెచ్ 765డి లో హైదరాబాద్ జౌటర్ రింగ్ రోడ్డు నుంచి మెదక్ వరకు ఉన్నరోడ్డు స్థాయిని పెంచడం, అంబర్‌పేట్- ఉప్పల్ ఎక్స్ రోడ్ రోడ్డును నాలుగు లేన్లగా తీర్చిదిద్దడం, ఉప్పల్-నారాపల్లి రోడ్డును ఆరు లేన్లుగా తీర్చిదిద్దే నిర్మాణాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment