
అకాడమీ సంచాలకుడిగా బాధ్యతలు స్వీకరిస్తున్న సందీప్ శాండిల్య
బండ్లగూడ: రాజా బహదూర్ వెంకట రామిరెడ్డి తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడామీ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సందీప్ శాండిల్య.. అకాడమీ సంచాలకుడిగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.
1993 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి సందీప్ శాండిల్య ఈనెల 3న జరిగిన పోలీస్ ఉన్నతాధికారుల బదిలీల ఉత్తర్వులను అనుసరించి రైల్వే, రోడ్ సేఫ్టీ విభాగం నుంచి బదిలీపై వచ్చారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆయన్ను అధికారులు, సిబ్బంది ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.