
సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్ పరిధిలో ఈ ఏడాది కేసుల సంఖ్య పెరిగిందని సైబరాబాద్ సీపీ సందీప్ శాండిల్యా తెలిపారు. ఏడాదిలో మొత్తం 2600 కేసులు నమోదయ్యాయని.. గతేడాదితో పోలిస్తే 800 కేసులు పెరిగాయన్నారు. ఆయనిక్కడ శుక్రవారం మాట్లాడుతూ..' సైబరాబాద్ పరిధిలో 729కి మందికి ఓ పోలీస్ చొప్పున భద్రత పర్యవేక్షిస్తున్నారు. నగరంలో అన్ని పండుగలు శాంతియుతంగా జరిగేలా పోలీసులు పనిచేశారు. అంతే కాకుండా 35 జాతీయ, అంతర్జాతీయ సదస్సులకు భారీ భద్రత కల్పించాం. సైబరాబాద్ పరిధిలోని షీ టీమ్స్180 కౌన్సిలింగ్ సెషన్స్ నిర్వహించి, 70 వేల మంది మహిళలకు అవగాహన కల్పించారు.
సోషల్ మీడియాలో మహిళల పట్ల అసభ్యంగా పోస్టులు పెట్టిన 870 కేసులను షీ టీమ్స్ పరిష‍్కరించాయి. వరకట్న వేధింపులు, గృహహింస నుంచి మహిళలకు రక్షణ కల్పించేలా ఐదు ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్లు పనిచేస్తున్నాయి. ఆరు సెన్సేషనల్ డెకాయిడ్స్ కేసులను చేధించాం. పెరు అంతర్జాతీయ దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నాము. 100 గుట్కా కేసులు నమోదు చేసి.. 3 కోట్ల 79 లక్షల విలువైన గుట్కా సీజ్ చేశాం. ఔటర్ రింగ్ రోడ్డులో ప్రమాదాలు జరుగకుండా 9 స్పీడ్ లేజర్ గన్స్ ఏర్పాటు చేశాము. మరో వైపు 13 వేల 500 డ్రంక్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి' అని సీపీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment