
హైదరాబాద్ : కరడుగట్టిన చైన్ స్నాచింగ్ గ్యాంగ్‌ను అరెస్ట్ చేసినట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడించారు. విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. రెండేళ్ల నుంచి ఈ గ్యాంగ్ సభ్యులు నేరాలకి పాల్పడుతున్నారని చెప్పారు. పట్టుబడిన ఐదుగురు నిందితులు నుంచి 800 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని, మొత్తం మూడు కమిషనరేట్ల పరిధిలో వీరిపై 180 కేసులు ఉన్నాయని తెలిపారు.
జైలుకి వెళ్లి వచ్చిన తరువాత తిరిగి 32 చైన్ స్నాచింగ్‌లు చేశారని అన్నారు. చైన్ స్నాచింగ్ చేస్తున్న సమయంలో ఎవరైనా ఎదురు తిరిగితే వారిని కత్తులతో బెదిరించి పరారవుతున్నారని వివరించారు. బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నాలుగు ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారని తెలిపారు. నిందితులు సలీం, సయ్యద్ నజిమ్, సల్లాఉద్దీన్, సయ్యద్ జహంగీర్, అముల్ కోలేకర్లపై పీడీ యాక్ట్ నమోదు చేస్తున్నట్లు సజ్జనార్ తెలిపారు.