సాక్షి, హైదరాబాద్: టెర్రరిస్ట్‌ల నుంచి ముప్పు ఉందని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తనకు భద్రత పెంచుతూ లేఖ రాశారని గోశామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల అరెస్టైన ఉగ్రవాదుల హిట్ లిస్టులో తన పేరు ఉన్నట్లు పోలీసులు ద్వారా తన దృష్టికి వచ్చిందని, ఈ నేపథ్యంలో భద్రత కల్పించాలని కోరినట్లు పేర్కొన్నారు. తన విజ్ఞప్తి మేరకు పోలీసులు తన ఇంటి వద్ద నూతన ఆయుధాలతో భద్రత ఏర్పాటు చేశారని వెల్లడించారు. బైక్‌పై తిరగవద్దని, ప్రభుత్వం ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ కారులోనే ప్రయాణించాలని సూచనలు చేశారని రాజాసింగ్ తెలిపారు. డీసీపీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో తన భద్రత పర్యవేక్షణ చేస్తున్నారని చెప్పారు. (రాజాసింగ్ గన్‌మెన్‌కు కరోనా పాజిటివ్)
తెలంగాణ పోలీసులు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని అన్నారు. గతంలో హైదరాబాద్ సీపీకి లైసెన్స్ గన్ ఇవ్వాలంటూ లేఖ రాశానని, ఇప్పటికైనా తనకు గన్ లైసెన్స్ మంజూరు చేయాలని పోలీసుశాఖకు రాజాసింగ్ విజ‍్క్షప్తి చేశారు. స్లమ్ ఏరియా కాబట్టి తన నియోజకవర్గంలో కారులో వెళ్లలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఎవరితో ముప్పు ఉందనే విషయాన్ని తెలియపరచాలని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తానని చెప్పారు. ముప్పు విషయంలో కేంద్రం, ఐబీ, ఇంటలిజెన్స్ నుంచి తనకు తరచూ ఫోన్ కాల్స్ వస్తున్నాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment