terrorist threat
-
గులాం నబీ ఆజాద్‌కు ఉగ్రవాదుల బెదిరింపులు
శ్రీనగర్: కాంగ్రెస్ మాజీ నేత, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్‌కు ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు రావడం కలకలం రేపింది. లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెంట్ ఫ్రంట్ ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. మిషన్ కశ్మీర్ కార్యక్రమంలో భాగంగా జమ్ముకశ్మీర్‌లో ఆజాద్ ర్యాలీలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్న సమయంలోనే ముష్కర సంస్థ ఆయనకు వ్యతిరేకంగా పోస్టర్లు ప్రచురించడం ఆందోళన కల్గిస్తోంది. పోస్టర్లో ఆజాద్‌ను రాజకీయ ఊసరవెల్లి అని ఆరోపించారు ఉగ్రవాదులు. ఆయన ద్రోహి అని విధేయత అంటే ఏంటో తెలియదని విమర్శించారు. స్వార్థ ప్రయోజనాల కోసం ముందస్తు ప్రణాళికతోనే కశ్మీర్ రాజకీయాలపై ఆసక్తి కనబరుస్తున్నారని పేర్కొన్నారు. తన గార్డులను మార్చడానికి ముందు ఆజాద్ కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సమావేశమయ్యారని తెలిపారు. కాగా.. కాంగ్రెస్‌తో 50 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకుని ఆ పార్టీకి కొద్ది రోజుల క్రితమే రాజీనామా చేశారు ఆజాద్. రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కశ్మీర్లో సొంత రాజకీయ పార్టీ స్థాపిస్తానని ప్రకటించారు. ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకుంటారని ప్రచారం జరిగినప్పటికీ.. తనకు ఆ ఆలోచన లేదని ఆజాద్ చెప్పారు. చదవండి: పొలిటికల్ ట్విస్ట్.. పీకేతో నితీశ్ కుమార్ భేటీ -
హిట్‌లిస్ట్‌లో రాజాసింగ్.. భద్రత పెంపు
సాక్షి, హైదరాబాద్: టెర్రరిస్ట్‌ల నుంచి ముప్పు ఉందని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తనకు భద్రత పెంచుతూ లేఖ రాశారని గోశామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల అరెస్టైన ఉగ్రవాదుల హిట్ లిస్టులో తన పేరు ఉన్నట్లు పోలీసులు ద్వారా తన దృష్టికి వచ్చిందని, ఈ నేపథ్యంలో భద్రత కల్పించాలని కోరినట్లు పేర్కొన్నారు. తన విజ్ఞప్తి మేరకు పోలీసులు తన ఇంటి వద్ద నూతన ఆయుధాలతో భద్రత ఏర్పాటు చేశారని వెల్లడించారు. బైక్‌పై తిరగవద్దని, ప్రభుత్వం ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ కారులోనే ప్రయాణించాలని సూచనలు చేశారని రాజాసింగ్ తెలిపారు. డీసీపీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో తన భద్రత పర్యవేక్షణ చేస్తున్నారని చెప్పారు. (రాజాసింగ్ గన్‌మెన్‌కు కరోనా పాజిటివ్) తెలంగాణ పోలీసులు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని అన్నారు. గతంలో హైదరాబాద్ సీపీకి లైసెన్స్ గన్ ఇవ్వాలంటూ లేఖ రాశానని, ఇప్పటికైనా తనకు గన్ లైసెన్స్ మంజూరు చేయాలని పోలీసుశాఖకు రాజాసింగ్ విజ్క్షప్తి చేశారు. స్లమ్ ఏరియా కాబట్టి తన నియోజకవర్గంలో కారులో వెళ్లలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఎవరితో ముప్పు ఉందనే విషయాన్ని తెలియపరచాలని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తానని చెప్పారు. ముప్పు విషయంలో కేంద్రం, ఐబీ, ఇంటలిజెన్స్ నుంచి తనకు తరచూ ఫోన్ కాల్స్ వస్తున్నాయని తెలిపారు. -
తీర రక్షణ గాల్లో దీపమే
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: తీవ్రవాద ముప్పు వంటి ప్రమాదకర పరిస్థితులు పొంచిఉన్న నేపథ్యంలో తీరప్రాంత రక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం తీర భద్రతను గాలికొదిలేసింది. దేశంలో గుజరాత్ తరువాత అత్యంత పొడవైన సముద్రతీరం గల మన రాష్ట్రంలో తీరం వెంబడి గస్తీ కాయాల్సిన కోస్టల్ సెక్యూరిటీ బోట్లన్నీ పడకేశాయి. ఒక్కటంటే ఒక్కబోటు కూడా పనిచేయడంలేదు. చివరకు మొన్న తిత్లీ తుపాను సమయంలోనూ ఇవి ఏవిధంగానూ అక్కరకురాలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అంచనావేయవచ్చు. సముద్రమార్గంలో దేశంలోకి ప్రవేశించిన లష్కరే తోయిబా తీవ్రవాదులు 2008 నవంబర్ 26న ముంబైనగరంపై జరిపిన దాడిలో 164 మంది మరణించడంతో కేంద్ర ప్రభుత్వం తీరప్రాంత భద్రతపై దృష్టిసారించింది. సముద్రతీరంలో మెరైన్ పోలీస్స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 24గంటలూ తీరం వెంబడి బోట్లలో గస్తీ కాయడం, ప్రకృతి విపత్తు సమయాల్లో సహాయక చర్యల్లో పాలుపంచుకోవడం ప్రధాన విధులుగా ఏర్పాటైన ఈ మెరైన్ పోలీస్ స్టేషన్లను తరువాతి కాలంలో కోస్టల్ సెక్యూరిటీ పోలీస్స్టేషన్లుగా మార్పు చేశారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలో ఆయా పోలీస్స్టేషన్లు పనిచేస్తుంటాయి. 1214.7 కిలోమీటర్ల తీరరేఖ కలిగిన ఆంధ్రప్రదేశ్‌లో 21 కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ స్టేషన్లు ఉండగా గిలకలదండి, నిజాంపట్నం, రిషికొండ, వాకలపూడి, కళింగపట్నం, వాడలరేవు పోలీస్స్టేషన్లకు మాత్రమే ఒక్కో స్టేషన్‌కు మూడేసి చొప్పున బోట్లు ఉన్నాయి. మిగిలిన 15 పోలీస్స్టేషన్లలో పోలీసులు తీరం వెంబడి గ్రామాల్లో గస్తీకి మాత్రమే పరిమితమవుతున్నారు. బోట్లకు డీజిల్ లేదు... సిబ్బందికి జీతాల్లేవ్.. పెట్రోలింగ్ నిమిత్తం బోటు సముద్రంలోకి వెళ్తే గంటకు 200 లీటర్ల డీజిల్ ఖర్చవుతుంది. కానీ కొద్దిరోజుల క్రితం వరకు కేవలం రోజుకి 40 లీటర్లే ఇచ్చి తూతూ మంత్రంగా పెట్రోలింగ్ చేయించేవారు. ఇప్పుడు అదీ లేదు.. ప్రస్తుతం బోట్లన్నీ పడకేయడంతో డీజిల్ ఖర్చు మిగిలిందనే భావనలో అధికారులు ఉన్నారు. ఇక పోలీసు అధికారులు, ఆ శాఖ ఉద్యోగులకు తప్పించి... హోంగార్డులు, అవుట్ సోర్సింగ్‌కు తీసుకున్న బోటు డ్రైవర్లు, ఇతర సిబ్బందికి సరైన జీతభత్యాలు లేకపోగా.. ఇస్తున్న అరకొర కూడా సక్రమంగా ఇవ్వని పరిస్థితి నెలకొంది. జీతాల్లేక చాలాచోట్ల బోట్ క్రూ మానివేయడంతో లోకల్ ఫిషర్‌మెన్‌ను వినియోగిస్తూ వచ్చారు. స్టేషన్ ఒకచోట.. బోట్లు మరోచోట ఇక పోలీస్‌స్టేషన్ ఒక చోట ఉంటే.. దానికి దూరంగా ఎక్కడో బోట్లు ఉన్న పరిస్థితి మన రాష్ట్రంలో మాత్రమే నెలకొంది. విశాఖ నగరంలోని ఫిషింగ్ హార్బర్ వద్ద పోలీస్‌స్టేషన్ ఉండగా, 15 కిలోమీటర్ల దూరంలోని రిషికొండ వద్ద బోట్లు ఉంటాయి. శ్రీకాకుళం జిల్లా కళింగపట్నంలో పోలీస్‌స్టేషన్ ఉంటే బోట్లు మాత్రం 50కిలోమీటర్ల దూరంలోని భావనపాడులో ఉంటాయి. గుంటూరు జిల్లా రేపల్లెలో స్టేషన్ ఉంటే బోట్లు మాత్రం నిజాంపట్నంలో ఉంటాయి. ఒక్క కృష్ణాజిల్లా మచిలీపట్నం గిలకలదిండిలో మాత్రమే పోలీస్‌స్టేషన్‌కు ఎదురుగా బోట్లు ఉండే పరిస్థితి ఉంది. బోట్లు ఉన్న చోట పోలీస్స్టేషన్లు లేకపోవడంతో బోట్ల వద్ద కేవలం హోం గార్డు, హెడ్ కానిస్టేబుళ్ మాత్రమే విధుల్లో ఉంటున్నారు. తీరం సమీపంలోనే జెట్టీలు కట్టి... అక్కడే పోలీస్స్టేషన్లు ఏర్పాటు చేయాల్సిన సర్కారు ఏ మాత్రం పట్టించుకోవడంలేదు. -
'ప్రజలారా.. ఇప్పట్లో అక్కడికి వెళ్లకండి'
కాన్బెర్రా: తమ దేశ పౌరులను ఆస్ట్రేలియా ప్రభుత్వం హెచ్చరించింది. ఇప్పట్లో అంకారా, ఇస్తాంబుల్వంటి టర్కీ నగరాల పర్యటనకు వెళ్లొద్దని గట్టిగా చెప్పింది. ప్రస్తుతం ఉగ్రవాదుల కన్ను ఆ నగరాలపై ఉన్నందున అక్కడికి వెళ్లవద్దని హెచ్చరించింది. ఈ రెండు నగరాల్లో ఉగ్రవాదులు పేలుళ్లకు పాల్పడి 80 మందికి పైగా ప్రాణాలు కోల్పోయేలా చేశారని, అందుకే తమ పౌరుల ప్రాణాలు కాపాడే దృష్ట్యా ఈ హెచ్చరికలు చేస్తున్నట్లు తెలిపింది. అంతేకాకుండా, మరోసారి భారీ పేలుళ్లకు పాల్పడతామని వరుస హెచ్చరికలు జారీ అవుతున్నాయని, బ్యాట్ మాన్, బింగోల్, బిట్లిస్, గాజియన్ టెప్, హక్కారీ, హాతే, మార్డిన్ వంటి ప్రాంతాలతోపాటు మరెన్నింటికో వార్నింగ్స్ ఇచ్చినందున టర్కీ నగర ప్రాంతాలకు వెళ్లొద్దని తమ ప్రజలకు హెచ్చరించింది.