
ఒక్కరోజు సీపీగా సాదిక్
హైదరాబాద్ : తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఓ చిన్నారి చిరకాల కోరికను మేక్ ఏ విష్ ఫౌండేషన్ తీర్చింది. కరీంనగర్ జిల్లాకు చెందిన సాదిక్ (10) బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్నాడు. అయితే కమిషనర్ ఆఫ్ పోలీస్ కావలన్నది అతడి కోరిక. మేక్ ఏ విష్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ సాదిక్ కోరికను తీర్చింది.
సాదిక్ బుధవారం ఉదయం తన ఇంటికి వచ్చిన బుగ్గకారులో కమిషనర్ కార్యాలయానికి వెళ్లాడు. ఈ బుల్లి కమిషనర్కు అక్కడ రెడ్ కార్పెట్ పరిచి మరీ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కానిస్టేబుళ్లు సాదిక్కు గౌరవ వందనం చేసారు. అనంతరం నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి అతడిని సీపీ సీట్లో కూర్చొపెట్టారు.