లక్ష్యసాధన కోసం అభ్యర్థులు శ్రమించాలి
Published Thu, Jul 21 2016 11:54 PM | Last Updated on Mon, Sep 4 2017 5:41 AM
ఎంజీఎం : దేహదారుఢ్య పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ లక్ష్యసాధన కోసం మరింత శ్రమించాల్సి ఉంటుందని వరంగల్ పోలీసు కమిషనర్ జి.సుధీర్‌బాబు సూచించారు.
గురువారం పోలీస్ కానిస్టేబుళ్ల నియామకంలో భాగంగా గతంలో నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు హన్మకొండలోని జేఎన్‌ఎస్ గ్రౌండ్స్‌లో ఏడో రోజు దేహదారుఢ్య పరీక్షలు కొనసాగించారు. ఈ సందర్భంగా కమిషనర్ సుధీర్‌బాబు మాట్లాడుతూ నిత్యం సాధన చేయడం ద్వారా పోలీసు కొలువులు సాధించడం చాలా సులభమవుతుందని సూచించారు. గురువారం 963 మంది అభ్యర్థులు 800 మీటర్ల అర్హత పరీక్షకు హాజరయ్యారు. 172 మంది మహిళా అభ్యర్థులు 100 మీటర్ల పరుగు, షాట్‌పుట్, లాంగ్‌జంప్ అంశాలల్లో పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ యాదయ్య, పరిపాలన విభాగం అధికారి స్వరూపరాణి, ఏసీపీలు శోభన్‌కుమార్, జనార్దన్, మహేందర్, సురేంద్రనాథ్, వెంకటేశ్వరరావు, ఈశ్వర్‌రావు, రవీందర్‌రావు, రమేశ్‌కుమార్ పాల్గొన్నారు.
Advertisement