ప్రభుత్వాసుపత్రుల్లో ఈ–ఆఫీస్
Published Fri, Aug 19 2016 11:58 PM | Last Updated on Mon, Sep 4 2017 9:58 AM
జిల్లాలోని అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో ఈ ఆఫీస్ అమలు చేయాలని జిల్లా ఆసుపత్రుల సమన్వయాధికారి డాక్టర్, కె.శంకరరావు స్పష్టం చేశారు. శుక్రవారం డీసీహె^Œ ఎస్ కార్యాలయంలో ఆయన జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల సూపరింటెండెంట్‌లతో సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకరరావు మాట్లాడుతూ పేదలకు నాణ్యమైన వైద్య, సేవలు చికిత్సలు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. ఈ క్రమంలో ఆసుపత్రుల్లో సేవలు పొందుతున్న ప్రతి పేషెంట్ వ్యాధి, అందుతున్న సేవలు, వాడుతున్న మందుల వివరాలు కేస్ షీట్‌లో నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. ఈ వివరాలను ఆన్‌లైన్ చేయడం వల్ల రోగికి మరింత మెరుగైన చికిత్సలు అవసరమైన సందర్భాల్లో ఈ వివరాలు సహకరిస్తాయని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే పేదలకు తక్కువ ధరలకే మందులు అందించేందుకు ఆసుపత్రుల్లో అన్న సంజీవని మందుల షాపులు ఏర్పాటు చేయాలని, ఆసుపత్రుల్లో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు స్పఛ్ఛ ఆసుపత్రి అభియాన్ కార్యక్రమం అమలు చేయాలని సూచించారు.ఏలూరు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్, ఏవీఆర్.మోహన్‌తో పాటు జిల్లాలోని 18 ప్రభుత్వాసుపత్రుల సూపరింటెండెంట్‌లు పాల్గొన్నారు.
Advertisement