e-office
-
Andhra Pradesh: ఈ–ఆఫీస్ @ 2023.. మార్గదర్శకాలివే..!
సాక్షి, అమరావతి: నూతన సంవత్సరం ఆరంభం నుంచి రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల పని తీరులో నూతనత్వం సంతరించుకోనుంది. కాగితాలు, ఫైళ్లతో పని లేకుండా అంతా ఈ–ఆఫీస్ పద్ధతిలో కార్యకలాపాలు జరగనున్నాయి. జనవరి 1వ తేదీ నుంచి రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ కార్యకలాపాలన్నీ ఈ–ఆఫీస్ నుంచే నిర్వహించాలని సీఎస్ డా.కె.ఎస్.జవహర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఉత్తర ప్రత్యుత్తరాలు, ఫైళ్లు, తపాల్స్ అన్నీ ఈ–ఆఫీస్, అధికారిక ఈ–మెయిల్స్ ద్వారానే జరగాలని, భౌతికంగా తీసుకోబడవని తెలిపారు. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులను ఇటీవల సీఎస్ జారీ చేశారు. ఈ–ఆఫీస్‌ను ప్రవేశపెట్టి ఆరు సంవత్సరాౖలెనా ఇంతవరకు అమలు కాలేదు. ఈ–ఆఫీస్‌కు స్పష్టమైన మార్గదర్శకాలున్నప్పటికీ శాఖలు, సచివాలయంలో ఉత్తర ప్రత్యుత్తరాలు ఫిజికల్ విధానంలోనే జరుగుతున్నాయని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఫలితంగా సిబ్బంది శక్తి, ఉత్పాదకత, వనరులతో పాటు సమయం వృధా అవుతోందన్నారు. కాలం చెల్లిన విధానాలకు స్వస్తి పలకాలని స్పష్టం చేశారు. శాఖాధిపతుల కార్యాలయాలు సమర్పిస్తున్న కొన్ని ప్రతిపాదనలు, ఏసీబీ కేసులు అందుబాటులో లేవన్న ఫిర్యాదులున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ఇ–ఆఫీస్‌ను నిజమైన స్ఫూర్తితో అమలు చేయడానికి కఠినమైన మార్గదర్శకాలను అనుసరించాలని చెప్పారు. అసాధారణ కేసులకు సంబంధించి సంబంధిత కార్యదర్శి అనుమతి తీసుకుంటే తప్ప మిగతా కార్యాకలాపాలన్నీ జనవరి 1వ తేదీ నుంచి ఇ–ఆఫీస్ ద్వారానే కొనసాగించాలి. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఈ సూచనలను చిత్తశుద్ధిలో అనుసరించాలని సీఎస్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఇ – ఆఫీస్ నిర్వహణపై సాధారణ పరిపాలన శాఖ ఈ నెలాఖరు వరకు శాఖాధిపతులు, శాఖలు, ఇతర ప్రభుత్వ విభాగాల ఉద్యోగులకు శిక్షణ ఇస్తోంది. ఇవీ మార్గదర్శకాలు.. ► ఆమోదిత ముసాయిదా ప్రతుల కరస్పాండెన్స్‌లన్నింటీపై (జీవోలు మినహా) తప్పనిసరిగా సంబంధి అధికారి డిజిటల్ సంతకం ఉండాలి. ఆ ప్రతులను ఎంట్రీలో సూచించిన చిరునామాకు ఇ–ఆఫీస్‌లో ఇ–డిస్పాచ్‌లోనే పంపాలి. ఆమోదించిన ముసాయిదా ప్రతులను (జీవోలు మినహా) కూడా ఇడిస్పాచ్ ద్వారానే పంపాలి. ► ప్రభుత్వ ఉత్తర్వుల జారీకి ప్రస్తుతం అమల్లో ఉన్న వ్యవస్థలోనే జీవో నంబర్లను జనరేట్ చేయాలి. తుది జీవోను నంబర్‌తో పాటు సంతకం చేసిన స్కాన్డ్ కాపీలను ప్రభుత్వ అధికారిక ఇ–మెయిల్స్ ద్వారా మాత్రమే పంపించాలి. ► ప్రభుత్వ శాఖాధిపతుల కార్యాలయాలు, స్వయం ప్రతిపత్తి సంస్థలు, కలెక్టరేట్లు, జిల్లా కార్యాలయాలు అన్ని ప్రతిపాదనలను తప్పనిసరిగా డిజిటల్ ఆకృతిలో (పీడీఎఫ్) ఇన్వర్డ్ అండ్ అవుట్‌వర్డ్ కమ్యూనికేషన్ విభాగం ఇ–మెయిల్ ఐడీ, ఇ–ఆఫీస్ వ్యవస్థలోని ఇ–డిస్పాచ్ ద్వారా లేదా అధికారిక ఇ–మెయిల్ ద్వారానే పంపాలి. భౌతిక ఆకృతిలో సమర్పించిన ప్రతిపాదనలు పరిగణనలోకి తీసుకోబడవు. డిజిటల్ ఫార్మాట్లో ప్రతిపాదనను సమర్పించడంలో జాప్యానికి సంబంధిత కార్యాలయమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అధికారిక ఇ–మెయిల్, ఇ–డిస్పాచ్ ద్వారా డిపార్ట్మెంట్లో స్వీకరించిన అన్ని ప్రతిపాదనలు, డిస్పాచ్ విభాగంలో సంబంధిత సిబ్బంది ఇ–రశీదులుగా మార్చి, వెంటనే సంబంధిత శాఖ అధికారులకు పంపాలి. ► ఏసీబీ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్లు కూడా నివేదికలను డిజిటల్ ఫార్మాట్లో ఏకకాలంలో ఏపీ విజిలెన్స్ కమిషన్‌కు, సంబంధిత శాఖ కార్యదర్శికి పంపాలి. రిఫరెన్స్ కోసం నిర్ణీత సమయంలో ప్రభుత్వానికి స్థూలమైన భౌతిక నివేదికను పంపాలి. ► సచివాలయాల శాఖలన్నీ తప్పనిసరిగా అన్ని సాధారణ ఉత్తర ప్రత్యుతరాలు (కరస్పాండెన్స్‌లు) డిజిటల్ ఫార్మాట్లో ఇ–డిస్పాచ్ ద్వారా ఇన్వర్డ్ అండ్ అవుట్‌వర్డ్ కమ్యునికేషన్ విభాగాల అధికారికి పంపించాలి. డీవో లేఖలతో పాటు ఇతర ముఖ్యమైన ఉత్తర ప్రత్యుత్తరాలను సంబంధిత అధికారి అధికారిక ఇ–మెయిల్‌కు పంపాలి. -
ఈ-ఆఫీస్ ద్వారా పరిపాలన
-
ఫైళ్లన్నీ ఈ– ఆఫీస్‌లోనే పంపాలి
– జెడ్పీ సీఈఓ బీఆర్ ఈశ్వర్ కర్నూలు(అర్బన్): జిల్లాలోని అన్ని మండల పరిషత్ కార్యాలయాల నుంచి ఫైళ్లన్ని ఈ – ఆఫీస్ సిస్టమ్‌లోనే పంపాలని జిల్లా పరిషత్ సీఈఓ బీఆర్ ఈశ్వర్ కోరారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ భవనంలో జిల్లాలోని అన్ని ఎంపీడీఓ కార్యాలయాలకు చెందిన సూపరెంటెండెంట్లతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈఓ ఈశ్వర్ మాట్లాడుతూ.. ఈ – ఆఫీస్ ద్వారా ఫైళ్లన్ని పంపేందుకు ప్రతి ఒక్కరూ అలవాటు పడాలని, అవసరమైన కంప్యూటర్ పరిజ్ఞానాన్ని సంపాదించుకోవాలన్నారు. రాబోయే రోజులన్నీ సాంకేతిక పరిజ్ఞానంతోనే ఆధారపడి ఉంటాయన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో బోర్ల పరిస్థితులపై ఎప్పడికప్పుడు సమీక్షిస్తుండాలని, బోర్ల మరమ్మతులకు అవసరమైన పరికరాలు కొనుగోలు చేసేందుకు ఎలాంటి తాత్సారం చేయరాదన్నారు. ఆయా ప్రాంతాలకు చెందిన సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు ఇచ్చిన ప్రతిపాదనలపై వెంటనే పరిశీలించి తాగునీటి సమస్య పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ముఖ్యంగా 2016–17 ఆర్థిక సంవత్సరం ముగిసిన నేపథ్యంలోనే అకౌంట్లన్ని పక్కాగా ఉంచుకోవాలన్నారు. ఎస్సీ ,ఎస్టీ కాలనీల్లో చేపట్టే పనులకు సంబంధించి ప్రతిపాదనలు వచ్చిన వెంటనే పనులు చేపట్టి పూర్తి చేయాలన్నారు. వచ్చిన బడ్జెట్‌ను ఖర్చు చేయకుంటే కార్పొరేషన్‌కు తిరిగి చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ డిప్యూటీ సీఈఓ ప్రతాపరెడ్డి, ఏఓ భాస్కర్‌నాయుడు, ఎంపీడీఓ కార్యాలయ సూపరెంటెండెంట్లు పాల్గొన్నారు. -
కాగిత రహిత పాలనలో వెనుకబడిన జిల్లా
– 8నెలల నుంచి చెబుతున్నా పట్టించుకోలేదు – మాన్యువల్‌గా ఫైళ్లు పంపితే సహించేది లేదు – కార్యాలయాలను ఈ– ఆఫీసులుగా మార్చండి – జిల్లా అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు కర్నూలు(అగ్రికల్చర్): ‘ఎనిమిది నెలల నుంచి చెబుతున్నా ఎవ్వరూ పట్టించుకోలేదు. కాగిత రహిత పాలనలో జిల్లా పూర్తిగా వెనుకబడి పోయింది. ఇది బాధాకరం’ అంటూ అధికారులపై జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం నోడల్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ ప్రధానంగా ఈ– ఆఫీసులపై సమీక్ష నిర్వహించారు. కాగిత రహిత పాలనలో అట్టడుగున ఉన్నందున అన్ని శాఖల అధికారులు ఇప్పటికైనా ఈ ఆఫీసులోకి మారాలని సూచించారు. ఇక నుంచి మాన్యువల్‌గా ఫైళ్లు పంపరాదని, పంపినా వాటిని చూడటం జరగదని చెప్పారు. ఈ–ఆఫీసులను నిర్లక్ష్యం చేస్తే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. జూనియర్ అసిస్టెంట్ మొదలు కొని జిల్లా అధికారి వరకు మంగళవారం లోగా డిజిటల్ టోకన్ తీసుకోవాలని సూచించారు. అలాగే ప్రజలు వడదెబ్బకు గురి కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారికి అవగాహన కల్పించాలని ఆదేశించారు. నీటి సమస్య, పశుగ్రాసం కొరతపై ప్రత్యేక దృష్టి సారించాలని వివరించారు. ఆర్బన్ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్లు, గ్రామీణ ప్రాంతాల్లో డీఆర్డీఏ అధికారులు చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. తుంగభద్ర దిగువ కాలువకు ఏప్రిల్ ఒకటి నుంచి నీళ్లు విడుదల చేస్తున్నామని, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను నింపుకునేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. సమావేశంలో జేసీ హరికిరణ్, జేసీ–2 రామస్వామి, డీఆర్ఓ గంగాధర్‌గౌడు, సీపీఓ ఆనంద్‌నాయక్, జేడీఏ ఉమామహేశ్వరమ్మ, డ్వామా పీడీ పుల్లారెడి అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. -
అన్ని దస్త్రాలు ఈ- ఆఫీసులోకే
- 20లోగా మార్పు చేయాలి - ఆ తర్వాత ఏ ఫైలూ మాన్యువల్‌గా ఉండరాదు - జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఆదేశం కర్నూలు(అర్బన్): అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించి వందశాతం దస్త్రాలు ఈ-ఆఫీసులోకి మార్చాలని కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఆదేశించారు. ఈ ప్రక్రియ ఈ నెల 20 నాటికి పూర్తి కావాలని, అటు తర్వాత అన్ని ఫైళ్లు డిజిటల్ పద్ధతిలోనే నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టరేట్ సమావేశ భవనంలో ఈ-ఆఫీసుపై మంగళవారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఈ-ఆఫీసు విధానంలో వెనుకబడి ఉండటాన్ని ప్రస్తావించిన కలెక్టర్ అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మన జిల్లా రాష్ట్రంలోని అన్ని జిల్లాల కంటే దిగువన ఉండడం శోచనీయమన్నారు. సంబంధిత అధికారులు శ్రద్ధ పెట్టకపోవడమే ఇందుకు కారణమని, ఇది మంచి పరిణామం కాదని తెలిపారు. ఈ-ఆఫీసు విధానం అమలుకు ఈ నెల 20వతేదీని డెడ్‌లైన్‌గా పెట్టిన కలెక్టర్ .. 21వ తేదీ నుంచి ఏ ఒక్క దస్త్రమూ ఫిజికల్‌గా, మ్యాన్యువల్‌గా కనిపించరాదని ఆదేశించారు. 20వ తేదీ నాటికి అన్ని దస్త్రాలను డిజిటల్ చేయాలని, నిర్దేశించిన గడువు అనంతరం ఏ శాఖ నుంచైనా ఫిజికల్ దస్త్రాలు కనిపిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ - ఆఫీసు ప్రక్రియను ప్రతి శాఖలోనూ యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలన్నారు. నోడల్ ఏజెన్సీగా ఎన్ఐసీ ఉంటూ బాధ్యతగా ప్రతి శాఖాధికారికి సరైన గైడెన్స్ ఇవ్వాలని, ఈ అంశం ప్రాధాన్యాన్ని గుర్తించి ప్రగతి చూపాలన్నారు. ఈ- ఆఫీసుకు మారిన ప్రతి దస్త్రమూ రికార్డు రూమ్ చేరాలన్నారు. ఇందుకు సంబంధించిన కార్యకలాపాల నిర్వహణకు అవసరమైన కంప్యూటర్, స్కానర్‌ను కొనుగోలు చేయాలన్నారు. నిధుల సమస్య ఎదురైతే తన దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ సూచించారు. అన్ని శాఖల అధిపతులు ఎన్ఐసీ నుంచి శిక్షణ తీసుకొని కార్యాలయంలోని అధికారులు, సిబ్బందికి అవగాహన కల్పించాలని ఆదేశించారు. తద్వారా అన్ని విభాగాలు ఈ-ఆఫీసులోకి మారేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. సమావేశంలో డీఆర్ఓ గంగాధర్‌గౌడ్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఈ ఆఫీసు బహుదూరం
► సింగిల్ డిజిట్‌కే పరిమితమైన పదిశాఖలు ► ప్రతివారం ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నా పురోగతి నామమాత్రం ఒంగోలు టౌన్ : ఈ-ఆఫీసుకు కొన్నిశాఖలు దూరంగా ఉంటున్నారుు. మొక్కుబడిగా కార్యకలాపాలు సాగిస్తుండటంతో జిల్లాపై తీవ్రప్రభావం చూపుతోంది. అన్ని శాఖలకు సంబంధించిన కార్యకలాపాలు ఈ-ఆఫీసు ద్వారానే చేపట్టాలని కలెక్టర్ సుజాతశర్మ, జారుుంట్ కలెక్టర్ హరిజవహర్‌లాల్ పదేపదే ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ ఆ శాఖాధికారుల్లో పూర్తిస్థారుులో స్పందిస్తున్న దాఖలాలు కనిపించడంలేదు. ఈ-ఆఫీసుపై జారుుంట్ కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి వారం వారం సమీక్షిస్తున్నప్పటికీ ఆశించిన స్థారుులో ఫలితాలు రావడం లేదు. దీనిలో ప్రకాశం జిల్లా ప్రస్తుతం ఐదో స్థానంలో ఉంది. మొక్కుబడిగా వ్యవహరిస్తున్న ఆ పది శాఖలతోపాటు ఇతర శాఖలు కూడా లైట్‌గా తీసుకుంటే ప్రకాశం జిల్లా దిగువ స్థానానికి పడిపోయే ప్రమాదం ఉంది. ఐదు నెలలైనా అంతే సంగతులు... జిల్లాలో ఈ ఏడాది జూలై నుంచి ఈ-ఆఫీసును అమలు చేస్తున్నారు. అంతకు ముందుగానే కలెక్టరేట్‌ను పెలైట్ ప్రాజెక్టుగా ఎంపికచేసి కార్యకలాపాలు సాగించారు. ఆ తరువాత మొదటి విడతలో 10శాఖలను చేర్చారు. అనంతరం రెండో విడతలో మరో 72 శాఖలను ఈ-ఆఫీసులో చేర్చారు. రోజుకు 100 నుంచి 135 వరకు ఈ-ఆఫీసు ద్వారా ఫైల్స్ నిర్వహణ ప్రక్రియ జరుగుతోంది. ప్రస్తుతం జిల్లాలో 82 శాఖల్లో ఈ-ఆఫీసు అమలవుతోంది. ఇప్పటివరకు ఈ-ఆఫీసు ద్వారా 10,250 ఫైల్స్‌కు సంబంధించిన కార్యకలాపాలు సాగారుు. పూర్తిస్థారుులో అన్ని శాఖలు ఈ-ఆఫీసు ద్వారా కార్యకలాపాలు సాగిస్తే ప్రకాశం జిల్లా రాష్ట్రస్థారుులో మొదటి మూడు స్థానాల్లో నిలిచేది. అరుుతే, కొన్ని శాఖల పనితీరు చూస్తుంటే జిల్లా ర్యాంకు కిందకు దిగజారే ప్రమాదం పొంచి ఉంది. కారణాలు అనేకం... ఈ-ఆఫీసుకు సంబంధించి కొన్ని శాఖలు వెనుకబడటానికి కారణాలు అనేకం ఉన్నారుు. ఆయా శాఖలకు సంబంధించి పూర్తిస్థారుులో మ్యాన్ పవర్(సిబ్బంది) లేకపోవడం ఒక కారణమైతే, సంబంధిత కార్యకలాపాలకు సంబంధించిన వివరాలు స్కాన్‌చేసి పంపడం ఇంకో కారణం. కొన్ని సందర్భాల్లో దాదాపు 100 నుంచి 200 పేజీల వరకు స్కానింగ్ చేసి ఈ-ఆఫీసుకు పంపించడం కష్టతరమవుతోంది. అదేవిధంగా స్కానర్ల సమస్య కూడా కొన్ని శాఖలను పట్టిపీడిస్తోంది. ఈ-ఆఫీసు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా యంత్రాంగం ఆర్భాటంగా ప్రకటించినప్పటికీ వాటికి సంబంధించిన స్కానర్లు మాత్రం పూర్తిస్థారుులో అందించలేదు. సంబంధిత శాఖలే స్కానర్లు కొనుగోలు చేసుకుని ఏర్పాటు చేసుకోవాలని జిల్లా కేంద్రం నుంచి ఆదేశాలు వెళ్లడంతో వాటిని ఏ విధంగా కొనుగోలు చేయాలో తెలియక కొంతమంది రోజుల తరబడి ఈ-ఆఫీసు వారుుదా వేసుకుంటూ వచ్చారు. అన్ని శాఖలు తమకు సంబంధించిన బడ్జెట్లో స్కానింగ్ మిషన్లు కొనుగోలు చేయాలని ఆదేశాలు వెళ్లినప్పటికీ నామమాత్రపు బడ్జెట్లకు పరిమితమైన శాఖాధికారులు వాటిని కొనుగోలు చేసేందుకు ముం దుకు రాకపోవడంతో ఈ-ఆఫీసు కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపింది. టాప్ టెన్‌లో కొన్ని శాఖలు... జిల్లాలో ఈ-ఆఫీసుకు సంబంధించి రెవెన్యూ, జిల్లాపరిషత్, డ్వామా, పౌరసరఫరాలశాఖ, డీఆర్డీఏ, వ్యవసాయశాఖ, జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్థ, ట్రెజరీ, ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్, చీరాల మున్సిపాలిటీ టాప్‌టెన్‌లో ఉన్నారుు. వీటితోపాటు కనిగిరి, కందుకూరు, అద్దంకి మున్సిపాలిటీల్లో కూడా ఈ-ఆఫీసుకు సంబంధించిన కార్యకలాపాలు చురుకుగా సాగుతున్నారుు. ఈ శాఖలకు సంబంధించిన కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతూ ఉంటా రుు. దాంతో ఈ-ఆఫీసులో అవి ముందంజలో ఉన్నారుు. అరుుతే ఆ శాఖలు మరింత మెరుగ్గా వ్యవహరించాల్సి ఉంది. ఆ దిశగా సంబంధిత జిల్లా అధికారులు వేగవంతం చేస్తే కొంతమేర ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నారుు. సింగిల్ డిజిట్స్ శాఖలు... జిల్లాలో పది శాఖలు ఈ-ఆఫీసుకు సంబంధించి సింగిల్ డిజిట్స్‌కే పరిమితమయ్యారుు. ఆ శాఖల పనితీరు కారణంగా రాష్ట్రస్థారుులో జిల్లా స్థానంపై ప్రభావం కనిపిస్తోంది. మెప్మా, కార్మికశాఖ, జిల్లా ఉపాధి కార్యాలయం, ఎస్ఈ కన్స్టక్ష్రన్స, ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ కార్యాలయం, సమాచార పౌరసంబంధాల అసిస్టెంట్ డెరైక్టర్ కార్యాలయం, జిల్లా యువజన సంక్షేమశాఖ, ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్, గిద్దలూరు అటవీశాఖ కార్యాలయం, ఫుడ్ ఇన్స్పెక్టర్ కార్యాలయాలు సింగిల్ డిజిట్స్‌కే పరిమితమయ్యారుు. ఈ శాఖలకు సంబంధించిన కార్యకలాపాలను ఈ-ఆఫీసు ద్వారా తక్కువగా పంపిస్తుండటంతో డబుల్ డిజిట్స్‌కు కూడా చేరుకోలేకపోతున్నారుు. -
ఈ ఆఫీస్‌లో భీమవరం టాప్
సెప్టెంబర్ 12 నుంచి అమలులో ఉన్న కాగితరహితపాలన ఫైళ్ల క్లియరెన్స్‌లో ముందంజలో భీమవరం పురపాలక సంఘం ఆ వెనుక ఏలూరు కార్పొరేషన్.. సమీపంలో లేని ఇతర మునిసిపాలిటీలు భీమవరం టౌన్ : కాగిత రహితపాలన (ఈఆఫీస్)లో భీమవరం పురపాలక సంఘం జిల్లాలో ముందంజలో ఉంది. ప్రభుత్వం ప్రతి పనిని ఈఆఫీస్లో చేపట్టాలని ఆదేశించడంతో సెప్టెంబర్ 12 నుంచి మునిసిపాలిటీల్లో కాగితరహిత పాలనకు శ్రీకారం చుట్టారు. ప్రతి ఫైల్‌ను కాగితాల్లో కాకుండా ఆఫీస్‌లోనే పరిశీలించి అందులోనే కమిషనర్లు డిజిటల్ సంతకాలు చేస్తున్నారు. దీంతో పాటు డీఎంఏ ఆదేశాల మేరకు రెవెన్యూపరమైన యాజమాన్య హక్కుల బదిలీ, డీఅండ్‌వో ట్రేడ్స్, కొత్త అసస్మెంట్స్, ఖాళీస్థలాల పన్నులు తదితర పనులు కూడా ఈఆర్పీ సిస్టంలో ప్రవేశపెట్టి సంతకాలు చేస్తున్నారు. జిల్లాలోని ఏలూరు నగరపాలక సంస్థ, జంగారెడ్డిగూడెం నగర పంచాయతీతో పాటు మిగిలిన ఏడు పురపాలక సంఘాల్లో ఈఆఫీస్ ఫైళ్ల క్లియరెన్స్ ఇప్పటివరకు ఇలా ఉంది. పురపాలక సంఘం ఫైళ్ల క్లియరెన్స్ 1. ఏలూరు (కార్పొరేషన్) 1,275 2. భీమవరం 2,016 3. నరసాపురం 242 4. నిడదవోలు 38 5. పాలకొల్లు 224 6. తణుకు 413 7. తాడేపల్లిగూడెం 479 8. కొవ్వూరు 51 9. జంగారెడ్డిగూడెం 77 -
ప్రభుత్వాసుపత్రుల్లో ఈ–ఆఫీస్
జిల్లాలోని అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో ఈ ఆఫీస్ అమలు చేయాలని జిల్లా ఆసుపత్రుల సమన్వయాధికారి డాక్టర్, కె.శంకరరావు స్పష్టం చేశారు. శుక్రవారం డీసీహె^Œ ఎస్ కార్యాలయంలో ఆయన జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల సూపరింటెండెంట్లతో సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకరరావు మాట్లాడుతూ పేదలకు నాణ్యమైన వైద్య, సేవలు చికిత్సలు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. ఈ క్రమంలో ఆసుపత్రుల్లో సేవలు పొందుతున్న ప్రతి పేషెంట్ వ్యాధి, అందుతున్న సేవలు, వాడుతున్న మందుల వివరాలు కేస్ షీట్లో నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. ఈ వివరాలను ఆన్లైన్ చేయడం వల్ల రోగికి మరింత మెరుగైన చికిత్సలు అవసరమైన సందర్భాల్లో ఈ వివరాలు సహకరిస్తాయని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే పేదలకు తక్కువ ధరలకే మందులు అందించేందుకు ఆసుపత్రుల్లో అన్న సంజీవని మందుల షాపులు ఏర్పాటు చేయాలని, ఆసుపత్రుల్లో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు స్పఛ్ఛ ఆసుపత్రి అభియాన్ కార్యక్రమం అమలు చేయాలని సూచించారు.ఏలూరు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్, ఏవీఆర్.మోహన్‌తో పాటు జిల్లాలోని 18 ప్రభుత్వాసుపత్రుల సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. -
ప్రభుత్వాసుపత్రుల్లో ఈ–ఆఫీస్
జిల్లాలోని అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో ఈ ఆఫీస్ అమలు చేయాలని జిల్లా ఆసుపత్రుల సమన్వయాధికారి డాక్టర్, కె.శంకరరావు స్పష్టం చేశారు. శుక్రవారం డీసీహె^Œ ఎస్ కార్యాలయంలో ఆయన జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల సూపరింటెండెంట్లతో సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకరరావు మాట్లాడుతూ పేదలకు నాణ్యమైన వైద్య, సేవలు చికిత్సలు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. ఈ క్రమంలో ఆసుపత్రుల్లో సేవలు పొందుతున్న ప్రతి పేషెంట్ వ్యాధి, అందుతున్న సేవలు, వాడుతున్న మందుల వివరాలు కేస్ షీట్లో నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. ఈ వివరాలను ఆన్లైన్ చేయడం వల్ల రోగికి మరింత మెరుగైన చికిత్సలు అవసరమైన సందర్భాల్లో ఈ వివరాలు సహకరిస్తాయని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే పేదలకు తక్కువ ధరలకే మందులు అందించేందుకు ఆసుపత్రుల్లో అన్న సంజీవని మందుల షాపులు ఏర్పాటు చేయాలని, ఆసుపత్రుల్లో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు స్పఛ్ఛ ఆసుపత్రి అభియాన్ కార్యక్రమం అమలు చేయాలని సూచించారు.ఏలూరు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్, ఏవీఆర్.మోహన్‌తో పాటు జిల్లాలోని 18 ప్రభుత్వాసుపత్రుల సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. -
ఈ గవర్నెన్స్ లక్ష్యంగా ఏపీలో పాలన
-
‘ఈ-టౌన్ ప్లానింగ్’కు కసరత్తు
* రెండు, మూడు నెలల్లో అందుబాటులోకి * రూపకల్పనలో కొత్త సాఫ్ట్వేర్ * ఇకపై ఆన్లైన్లోనే దరఖాస్తుల పరిశీలన సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీలోని అన్ని విభాగాల్లో ఇప్పటికే ‘ఈ-ఆఫీస్’ అమల్లోకి రాగా.. తాజాగా టౌన్ ప్లానింగ్ విభాగంలోనూ ఇదే విధానాన్ని కొనసాగించేందుకు కసరత్తు జరుగుతోంది. భవన నిర్మాణ అనుమతుల దరఖాస్తులు సైతం ఆన్లైన్లోనే పరిశీలించే ప్రక్రియకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ-ఆఫీస్‌తో అనుసంధానం చేసి ‘ఈ-టౌన్ ప్లానింగ్’ను అందుబాటులోకి తీసుకురానున్నారు. మరో రెండు, మూడు నెలల్లో ఇది అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీకి వచ్చే అన్ని దరఖాస్తులను స్కానింగ్ చేసి ఆన్లైన్ ద్వారానే సంబంధిత అధికారులకు పంపుతున్నారు. టౌన్‌ప్లానింగ్ విభాగంలో భవనాల అనుమతుల దరఖాస్తుల పరిశీలన సమయంలో నిర్మించబోయే భవనం ఎత్తు, రహదారి వెడల్పు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఎంత విస్తీర్ణంలో.. ఎన్ని అంతస్తుల భవనానికి ఎన్ని అడుగుల సెట్‌బ్యాక్ వదలాలి వంటి అంశాల్ని పరిశీలిస్తున్నారు. ఈ-ఆఫీస్ అమల్లోకి వచ్చినా.. ప్లాన్ సరిగ్గా ఉందో లేదో తెలుసుకునేందుకు ఈ పరిశీలన తప్పనిసరి. ఈ పరిశీలన (స్క్రూటిని) సైతం ఆటోమేటిగ్గా జరిగేందుకు సాఫ్ట్వేర్ రూపొందించనున్నారు. ఉదాహరణకు 200-300 చ.మీ.లలో నిర్మించే 12 మీటర్ల లోపు భవనాలకు ముందువైపు రెండడుగులు.. మిగతా మూడు వైపులా ఒకటిన్నర అడుగు సెట్‌బ్యాక్‌గా వదలాల్సి ఉంటుంది. స్థల విస్తీర్ణం.. అంతస్తులు.. తదితర అంశాలను ఇకపై కొత్త సాఫ్ట్వేర్ పరిగణనలోకి తీసుకొని నిర్మించబోయే భవనానికి ఎటు వైపు ఎన్ని అడుగుల సెట్‌బ్యాక్ వదలాలో సూచిస్తుంది. నిబంధనల మేరకు ప్లాన్ ఉందో లేదో దరఖాస్తు స్కానింగ్ సమయంలోనే తెలుస్తుంది. ఈ-ఆఫీస్ ప్రారంభమైనప్పటి నుంచి ప్రధాన కార్యాలయంలోని టౌన్‌ప్లానింగ్ విభాగంలో ఇప్పటికే 3,314 ఫైళ్లు, సెంట్రల్‌జోన్‌లో 1,215 ఫైళ్లు, నార్త్‌జోన్‌లో 735, ఈస్ట్‌జోన్‌లో 191 ఫైళ్లు స్వీకరించినట్లు సీసీపీ దేవేందర్‌రెడ్డి తెలిపారు. అన్ని కార్యాలయాల్లో వెరసి పది లక్షలకుపైగా పేజీలు స్కాన్ చేసినట్టు చెప్పారు. కొత్త సాఫ్ట్వేర్ అందుబాటులోకి రాగానే ఈ-ఆఫీస్‌తో అనుసంధానం చేయడం ద్వారా టౌన్‌ప్లానింగ్ ఫైళ్లు మరింత త్వరగా పరిష్కారం కాగలవన్నారు. -
అనుమతులన్నీ ఆన్లైన్లోనే...
5 నుంచి అమలుకు జీహెచ్ఎంసీ సిద్ధం సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీలోని అన్ని విభాగాల్లోనూ కాగితపు రహిత(పేపర్‌లెస్) విధానాన్ని..‘ఈ-ఆఫీస్’ (ఆన్లైన్ ద్వారానే అన్ని ఫైళ్లు)ను అమలు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. తొలుత టౌన్‌ప్లానింగ్ విభాగంలో అమలు చేయనున్నారు. భవన నిర్మాణాలు పూర్తయ్యాక జారీ చేసే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్స్‌ను ఇకపై ఆన్లైన్ ద్వారా మాత్రమే జారీ చేయనున్నారు. ఈ నెల 5 నుంచి ఈ విధానాన్ని ప్రారంభించేందుకుఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇదంతా కాగి తాల ద్వారా సాగేది. భవన నిర్మాణాలు పూర్తయిన యజమానులు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కోసం తమ దరఖాస్తులు, అవసరమైన పత్రాలు, ఫొటోలను ఆన్లైన్లోనే సమర్పించాల్సి ఉంటుంది. వాటిని పరిశీలించాక ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ను ఆన్లైన్ ద్వారానే జారీ చే స్తారు. సంబంధిత అధికారి డిజి టల్ సంతకంతో కూడిన ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు జారీ అవుతాయి. ఈ విధానం ద్వారా ప్రజలు తమ ఫైల్ ఏ సమయంలో.. ఎవరి వద్ద ఉందో ఆన్లైన్లోనే తెలుసుకోవచ్చు. తొలుత ఆక్యుపెన్సీ సర్టిఫికెట్స్ జారీ చేసి...క్రమంగా భవన నిర్మాణ అనుమతులు సహా అన్ని అంశాలనూ ఆన్‌లైన్‌తో ముడిపెట్టనున్నారు. దీనికోసం ఎన్ఐసీ నుంచి ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను తీసుకుంటున్నారు. దరఖాస్తు దారులు ఇకపై జీహెచ్ఎంసీ వెబ్సైట్లోకి వెళ్లి సంబంధిత ఫారంలో వివరాలు నమోదు చేసి, ఫీజును ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్ల ద్వారా చెల్లిం చవచ్చు. ఆ మేరకు అక్నాలెడ్జ్మెంట్ అందుతుంది. భవన నిర్మాణ అనుమతులకు దరఖాస్తు చేసుకునేవారికి ఎంతో సమయం కలిసి వస్తుంది. జీహెచ్ ఎంసీలోని అన్ని విభాగాల్లోనూ ఈ-ఆఫీస్ అమలుకు అవసరమైన సాఫ్ట్వేర్లు తీసుకోవడం.. సిబ్బందికి శిక్షణ కార్యక్రమాల్లో ఉన్నతాధికారులు బిజీగా ఉన్నారు. ఆస్తిపన్ను, ట్రేడ్‌లెసైన్సు, జనన మరణ ధ్రువీకరణ తదితర అన్ని విభాగాల్లోనూ ఆన్లైన్ అమలుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దేశంలోనే ఏ కార్పొరేషన్లో లేని విధంగా అన్ని పనులనూ ఆన్లైన్ ద్వారా చేసేం దుకు సిద్ధమవుతున్న జీహెచ్ఎంసీ అందుకు తగిన విధంగా సిద్ధమవుతోంది.