ఈ ఆఫీస్‌లో భీమవరం టాప్
సెప్టెంబర్ 12 నుంచి అమలులో ఉన్న కాగితరహితపాలన
ఫైళ్ల క్లియరెన్స్‌లో ముందంజలో భీమవరం పురపాలక సంఘం
ఆ వెనుక ఏలూరు కార్పొరేషన్.. సమీపంలో లేని ఇతర మునిసిపాలిటీలు
భీమవరం టౌన్ : కాగిత రహితపాలన (ఈఆఫీస్)లో భీమవరం పురపాలక సంఘం జిల్లాలో ముందంజలో ఉంది. ప్రభుత్వం ప్రతి పనిని ఈఆఫీస్‌లో చేపట్టాలని ఆదేశించడంతో సెప్టెంబర్ 12 నుంచి మునిసిపాలిటీల్లో కాగితరహిత పాలనకు శ్రీకారం చుట్టారు. ప్రతి ఫైల్‌ను కాగితాల్లో కాకుండా ఆఫీస్‌లోనే పరిశీలించి అందులోనే కమిషనర్లు డిజిటల్ సంతకాలు చేస్తున్నారు. దీంతో పాటు డీఎంఏ ఆదేశాల మేరకు రెవెన్యూపరమైన యాజమాన్య హక్కుల బదిలీ, డీఅండ్‌వో ట్రేడ్స్, కొత్త అసస్‌మెంట్స్, ఖాళీస్థలాల పన్నులు తదితర పనులు కూడా ఈఆర్‌పీ సిస్టంలో ప్రవేశపెట్టి సంతకాలు చేస్తున్నారు. జిల్లాలోని ఏలూరు నగరపాలక సంస్థ, జంగారెడ్డిగూడెం నగర పంచాయతీతో పాటు మిగిలిన ఏడు పురపాలక సంఘాల్లో ఈఆఫీస్ ఫైళ్ల క్లియరెన్స్ ఇప్పటివరకు ఇలా ఉంది.
పురపాలక సంఘం ఫైళ్ల క్లియరెన్స్
1. ఏలూరు (కార్పొరేషన్) 1,275
2. భీమవరం 2,016
3. నరసాపురం 242
4. నిడదవోలు 38
5. పాలకొల్లు 224
6. తణుకు 413
7. తాడేపల్లిగూడెం 479
8. కొవ్వూరు 51
9. జంగారెడ్డిగూడెం 77