రాంగోపాల్‌పేట్, న్యూస్‌లైన్: శ్రీ సోమవంశ సహస్రార్జున క్షత్రియ సమాజ్ సికింద్రాబాద్ శాఖ స్వర్ణోత్సవాలు ఆదివారం హరిహరకళాభవన్‌లో కోలాహలంగా నిర్వహించారు. వందల మంది సమాజ్‌కు చెందిన మహిళలు, పురుషులు, పిల్లలతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్నారుల ఆటాపాటలతో, డ్యాన్సులతో అలరించారు. రాంగోపాల్‌పేట్‌లోని సమాజ్ కార్యాలయం నుంచి వందలాది మంది మహిళలు హారతులు చేతపట్టుకుని ర్యాలీ నిర్వహించారు. ఎంజీరోడ్, సుభాష్‌రోడ్, ఆర్పీరోడ్, బాటా గుండా హరిహరకళాభవన్ వరకు ర్యాలీ కొనసాగింది. అలాగే అర్జునుడి చిత్రపటాన్ని రథంలో ఉంచి కోలాహలంగా ఊరేగింపు చేశారు. అలాగే వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు, బహుమతులు అందించారు.
మెరిట్ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సికింద్రాబాద్ ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్, ఎమ్మెల్యే పీ శంకర్‌రావులు హాజరై ఎస్కేఎస్ సమాజ్‌కు అండగా ఉంటామని అన్నారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ వీరిని బీసీ డీ నుంచి ఏ కులంలోకి మార్చాలని డిమాండ్ చేశారు. ఈ కులానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.500 కోట్ల నిధులు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ సనత్‌నగర్ కో ఆర్డినేటర్ శీలం ప్రభాకర్, కార్పొరేటర్లు కిరణ్మయి, ముద్దం నరసింహాయాదవ్, సమాజ్ అధ్యక్షుడు శ్రావణ్‌కుమార్, ప్రతినిధులు పాల్గొన్నారు.
కోలాహలంగా ఎస్‌ఎస్‌కే సమాజ్ స్వర్ణోత్సవాలు
Published Mon, Jan 20 2014 4:07 AM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM
Advertisement
Advertisement