పోలీసుల అదుపులో నిందితుడు?
పోతరాజుపల్లిలో దారుణం
చిన్నచిన్న గొడవలు.. క్షణికావేశం.. వెరసి బంధాలు, బంధుత్వాలను లెక్క చేయడం లేదు. ఆ కోపంలో ప్రవర్తించిన తీరు ప్రాణాలపైకి తెస్తుండగా.. పచ్చని సంసారాల్లో చిచ్చు పెట్టే పరిస్థితి నెలకొంటోంది. అరుుతే, ఇక్కడ ఓ కొడుకు కారణమేమిటో తెలియకున్నా తండ్రి తలపై గొడ్డలితో బాదడంతో ఆయన కన్నుమూయగా.. మరో ఘటనలో దత్తత తీసుకుని కన్నబిడ్డలా పెంచి పోషించాడన్న విషయూన్ని మరిచిపోరుున మరో వ్యక్తి... తండ్రిని నెట్టివేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
గీసుకొండ : చిన్నచిన్న కుటుంబ కలహాలు పెద్దవి కావడంతో ఆవేశానికి లోనైన తనయుడు ఏకంగా కన్నతండ్రిని గొడ్డలితో నరికి చంపిన దారుణ సంఘటన ఇది. వరంగల్ రెండో డివిజన్ పోతరాజుపల్లిలో బుధవారం రాత్రి 8 గంటలకు జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నారుు. పోతరాజుపల్లికి చెందిన దొమ్మాటి శంకర్‌రావు(62)కు భార్య లింగాబాయి, కుమారుడు రాజు ఉన్నారు. కొన్ని రోజుల క్రితం కుమారుడు రాజు భార్య గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయింది. కాగా, శంకర్‌రావు తల్లి వీరమ్మ కోసం ఇంట్లోనే షెడ్ వేసి పోషిస్తున్నాడు.
ఈక్రమంలో కొంతకాలంగా తండ్రిని ఇబ్బంది పెడుతూ ఇష్టారాజ్యంగా వ్యవహ రిస్తున్న రాజు.. బుధవారం రాత్రి తల్లి లింగాబారుుతో కలిసి గొడ్డలితో తండ్రి శంకర్‌రావు తలపై మోదడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మామునూరు ఏసీపీ మహేందర్, గీసుకొండ సీఐ శ్రీనివాస్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి మార్చురీకి తరలించారు. శంకర్‌రావు కుమారుడు, భార్యను అదుపులోని తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. కాగా ఈ విషయమై గీసుకొండ సీఐ శ్రీనివాస్‌ను వివరణ కోరగా కుటుంబ కలహాల కారణంగా హత్య జరిగి ఉంటుందని, పూర్తి వివరాల కోసం దర్యాప్తు జరుపుతున్నామని పేర్కొన్నారు.
తండ్రిని నరికి చంపిన తనయుడు
Published Thu, Feb 25 2016 1:12 AM | Last Updated on Sun, Sep 3 2017 6:20 PM
Advertisement
Advertisement