Mutton Mulakkada Curry in Telugu: శాకాహారమైనా మాంసాహారమైనా మునక్కాడలు, మనగాకు చేరితే ఆ ఘుమఘుమలే వేరు. తినగ తినగ మునగలో తీరైన రుచులుండు అన్నట్టు మునగ వంటలను తింటూ లొట్టలేయకుండా ఉండలేరు.
మునక్కాడ మటన్
కావలసినవి: మటన్ – అరకేజీ; మునక్కాయలు – 3 (3 అంగుళాల పరిమాణంలో ముక్కలు చేయాలి); ఉల్లిపాయలు – 3; అల్లం–వెల్లుల్లి పేస్ట్ – 2 టీ స్పూన్లు; కారం – 2 టీ స్పూన్లు; పసుపు – చిటికెడు; కొబ్బరి తురుము – అర టీ స్పూన్; లవంగాలు – 4; దాల్చిన చెక్క – చిన్న ముక్క; గరంమసాలా – అర టీ స్పూన్; కరివేపాకు – రెండు రెమ్మలు; టొమాటో– 1 (తరగాలి); కొత్తిమీర – ఒక కట్ట; ఉప్పు – తగినంత; నూనె – సరిపడా
తయారుచేయు విధానం:
► మటన్ ని శుభ్రంగా కడిగి కుకర్లో వేసి. కొద్దిగా కారం, ఉప్పు, గరంమసాలా కలిపి స్టౌ మీద పెట్టి రెండు–మూడు విజిల్స్ వచ్చాక దింపేయాలి.
►స్టౌ మీద మందపాటి గిన్నె పెట్టి. నూనె పోసి, బాగా వేడెక్కాక ఉల్లిపాయ తరుగు వేసి వేయించాలి. దీంట్లో అల్లంవెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొబ్బరి, లవంగాలు, దాల్చిన చెక్క వేసి, వేయించాలి.
►తరువాత ఉప్పు, కారం, పసుపు, గరంమసాలా వేసి కలపాలి. ఇందులో మునక్కాయ ముక్కలు, ఉడికించి పెట్టుకున్న మటన్ ముక్కలు కూడా వేసి కలిపి మూత పెట్టాలి.
►రెండు నిమిషాల తరువాత కొద్దిగా నీళ్లు పోసి, టొమాటో ముక్కలు వేసి, ఓ పదినిమిషాలు ఉడికించాలి. ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత కొత్తిమీర తరుగు వేసి, దించాలి.
Comments
Please login to add a commentAdd a comment