
లక్ష్మి (ఫైల్)
మైసూరు : ప్రపంచ మహిళ దినోత్సవం రోజునే నిండు గర్భిణి వరకట్న వేధింపులకు బలైన ఘటన జిల్లాలోని హుణసూరు పట్టణం సమీపంలోని కల్కుణి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు... మైసూరు జిల్లాలోని నంజనగూడు తాలుకాలోని మంచళ్లి గ్రామానికి చెందిన లక్ష్మి (24)ని 10 నెలల క్రితం హుణసూరుకు చెందిన యోగేష్ ఇచ్చి వివాహం జరిపించారు. పెళ్లి సమయంలో కట్న కానుకలు సమర్పించారు. అనంతరం కూడా ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇల్లు ఇచ్చే విషయం ఆలస్యం కావడంతో కుటుంబ సభ్యులు మరింత కట్నం తీసుకురావాలని వేధించడం మొదలుపెట్టారు. దీంతో భర్త, అత్తింటి వేధింపులు తాళలేక లక్ష్మీ ఆదివారం ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment