కట్నం వేధింపులకు వివాహిత బలి | Married Woman End Lives With Extra Dowry Pressure Karnataka | Sakshi
Sakshi News home page

కట్నం వేధింపులకు వివాహిత బలి

May 15 2020 7:43 AM | Updated on May 15 2020 7:43 AM

Married Woman End Lives With Extra Dowry Pressure Karnataka - Sakshi

దొడ్డబళ్లాపురం: వరకట్నం వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన కనకపుర పట్టణంలో చోటుచేసుకుంది. మళవళ్లి తాలూకా బాళెహొన్నిగ గ్రామానికి చెందిన బీఎం పూర్ణిమ(22)కు ఇదే గ్రామానికి చెందిన మునిమాదేవ అనే వ్యక్తితో 2 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. మునిమాదేవ కనకపురలోని ఒక కాలేజీలో గెస్ట్‌ లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం ఉదయం పూర్ణిమ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇదిలా ఉండగా  మునిమాదేవ మొదటినుండి అధిక కట్నం కోసం వేధించేవాడని, ఇటీవలే ఒక లక్ష కావాలని లేదంటే విడాకులు ఇస్తానని బెదిరించడంతో నగదు రూపంలో ఇచ్చామని పూర్ణిమ కుటుంబ సభ్యులు వాపోయారు. ఘటనపై  కేసు నమోదుచేసుకున్న పోలీసులు మునిమాదేవ,అతడి సహోదరుడిని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement