ప్రతీకాత్మక చిత్రం
రెండో భార్య చేతిలో ఓ రియల్టర్ ను అతని రెండో భార్య ఇనుప రాడ్ తో కొట్టి హత్య చేయడం స్థానికంగా సంచలనం రేపింది.అనంతరం ఆ మహిళ నేరుగా వెళ్లి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయింది. కర్ణాటక లోని గళూరు జిల్లా మాదనాయకనహళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్వామి రాజ్ తన మొదటి భార్య నుంచి విడిపోయి బ్యూటీషియన్ అయిన నేత్ర (35)ని రెండో వివాహం చేసుకున్నాడు. ఇటీవల తన భర్త తనకి శారీరకంగా హింసించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే నేత్రను మరొకరితో శారీరక సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేశాడు. ఇందుకు నేత్ర అంగీకరించక పోవడంతో ఈ విషయమై వారిద్దరికి గొడవ కూడా జరిగాయి. చివరికి సహనం కోల్పోయిన ఆమె అతను నిద్రిస్తున్న సమయంలో తన భర్త ని రాడ్ తో కొట్టి హత్య చేసి పోలీసులకు లొంగిపోయింది. తదుపరి విచారణ నిమిత్తం ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే నేత్ర, రాజ్‌లకు ఐదేళ్ల క్రితం వివాహమైందని, ఆస్తి తగాదాల కారణంగా తరచూ గొడవలు జరుగుతుంటాయని, ఇదే హత్యకు కారణమని రాజ్ మొదటి భార్య సత్యకుమారి పోలీసులకు తెలిపారు. ఆమె మదనాయకనల్లి పోలీసులకు కేసు నమోదు చేసిందని దర్యాప్తు అధికారి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment