ప్రతీకాత్మక చిత్రం
శివాజీనగర(బెంగళూరు): నగరంలోని కెంపేగౌడ నగరలో భార్యపై యాసిడ్ దాడి చేసి ఆమె మరణానికి కారణమైన భర్తకు కోర్టు జీవితఖైదును విధించింది. అందంగా ఉండడంతో పరపురుషులు మోహిస్తారనే అనుమానం అతన్ని కిరాతకునిగా మార్చింది. వివరాలు.. 2017 జులై 14న కెంపేగౌడనగర సన్యాసిపాళ్య ఇంట్లో మంజుల అనే మహిళపై భర్త చెన్నేగౌడ యాసిడ్ దాడి చేశాడు.
ఆమె అందంగా ఉందని, అందరూ ఆమెను చూస్తారని నిత్యం గొడవలు పడి వేధించేవాడు. దీంతో ఆమె చేస్తున్న చిన్న ఉద్యోగం కూడా మానేసి ఇంట్లోనే ఉండిపోయింది. అయినప్పటికీ అక్కసు తీరని చెన్నేగౌడ ఆమెపై యాసిడ్ పోశాడు. మంజులకు తీవ్ర గాయాలు కాగా, విక్టోరియా ఆసుపత్రిలో మృతి చెందింది. ఐదు రోజుల తరువాత నిందితున్ని అరెస్ట్ చేశారు. విచారణలో నేరం రుజువు కావడంతో 46వ సీసీహెచ్ కోర్టు అతనికి జీవిత ఖైదు, రూ.25 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment