
ఆశారాణి, ప్రదీప్ (ఫైల్)
మైసూరు (కర్ణాటక): వరకట్న వేధింపులకు నవ వివాహిత ఆత్మహత్య చేసుకోగా, ఆమె భర్త జైలులో ఉరివేసుకుని మరణించాడు. మైసూరు శ్రీరాంపుర ఎస్‌బీఎం కాలనీకి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రదీప్‌కు మైసూరు జిల్లా నంజనగూడు తాలూకా సరగూరు గ్రామానికి చెందిన ఆశారాణితో ఏప్రిల్ 4న వివాహం జరిగింది. ఈనెల 3వ తేదీన ఆశారాణి ఉరి వేసుకుని ప్రాణాలు వదిలింది.
అత్తింటి వేధింపులకు తాళలేక తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని కువెంపు నగర పోలీసులకు మృతురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రదీప్‌ను పోలీసులు అరెస్టు చేసి కరోనా కేసుల కారణంగా కైలాసపురంలోని ఖైదీల తాత్కాలిక కేంద్రంలో ఉంచారు. గురువారం అక్కడే బెడ్‌షీట్‌తో ప్రదీప్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
చదవండి: ఘోర ప్రమాదం: పోలీసులపై దూసుకెళ్లిన లారీ
తుఫాన్ అలర్ట్: దూసుకొస్తున్న ‘తౌక్టే’
Comments
Please login to add a commentAdd a comment