
మృతి చెందిన జయలక్ష్మి
కర్నూలు,ఆదోని రూరల్: మండల పరిధిలోని గణేకల్ గ్రామానికి చెందిన నవ వధువు జయలక్ష్మి కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు పెద్దతుంబళం ఎస్‌ఐ చంద్ర తెలిపారు. గ్రామానికి చెందిన పెద్ద ఎల్లప్ప కూతురు జయలక్ష్మిని కౌతాళం మండలం మల్లనహట్టి గ్రామానికి చెందిన లక్ష్మన్నతో నెల క్రితం వివాహం జరిపించారు. జయలక్ష్మి కడుపునొప్పి తాళలేక శనివారం ఆత్మహత్యకు యత్నించగా కుటుంబ సభ్యులు ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి వైద్యులు రెఫర్ చేయగా అక్కడ కోలుకోలేక మృతిచెందిందని ఎస్‌ఐ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment