
సాక్షి, విశాఖపట్నం: మధురవాడలో నవ వధువు సృజన మృతిపై ఎట్టకేలకు మిస్టరీ వీడింది. సృజన మృతికి ప్రేమ వ్యవహారమే కారణమని పోలసులు నిర్ధారించారు. పెళ్లి ఆపాలనే ప్రయత్నంలోనే సృజన ప్రాణాలు పోగొట్టుకున్నట్టు వెల్లడించారు. పెళ్లికి 3 రోజుల ముందు ఇన్స్‌స్టాగ్రామ్‌లో పరవాడకు చెందిన ప్రియుడు మోహన్‌తో చాటింగ్ చేసినట్టు పోలీసులు తెలిపారు. కాగా, సరైన ఉద్యోగం లేకపోవడంతో పెళ్లికి సమయం కావాలని మోహన్.. సృజనను కోరినట్టు చెప్పారు. దీంతో పెళ్లి ఆపేందుకు ప్రయత్నిస్తానని ప్రియుడికి చెప్పింది. అనంతరం పెళ్లి ఆపేందుకు సృజన విష పదార్థం సేవించింది. ఈ క్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నవ వధువు సృజన మృతి చెందినట్టు స్పష్టం చేశారు.
ఇదీ జరిగింది..
విశాఖ నగర శివారులోని మధురవాడ నగరం పాలెంలో నాగోతి శివాజీ, సృజనల వివాహానికి ఏర్పాట్లు జరిగాయి. కళ్యాణ మండపంలో నవ వధువు సృజన ఒక్కసారిగా కుప్పకూలిన విషయం తెలిసిందే. దీంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అనంతరం వధువు బ్యాగులో గన్నేరు పప్పు తొక్కలు లభ్యమైనట్టు పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: ప్రేమ పెళ్లి.. నా భర్త దగ్గరికి వెళ్లిపోతా.. ఇంతలోనే ఘోరం..
Comments
Please login to add a commentAdd a comment